ఆమె ఊపిరి ఆగింది

  చికిత్స పొందుతూ ఉన్నావ్ బాధితురాలు మృతి గాయాలవల్లే మృతి: పోస్ట్‌మార్టమ్ నివేదిక నిందితులను కాల్చి చంపాలి: బాధితురాలి తండ్రి యోగి సర్కార్‌పై ప్రతిపక్షాల విమర్శల వర్షం న్యూఢిల్లీ/ఉన్నావ్ (యుపి): అయిదుగురు దుండగులు దాడిచేసి నిప్పంటించిన ఘాతుకంలో తీవ్రంగా గాయపడిన ఉన్నావ్ అత్యాచార బాధితురాలు శుక్రవారం రాత్రి మరణించారు. ఆమెను వెంటనే విమానంలో ఢిల్లీకి తరలించి సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. ‘ఎంత ప్రయత్నించినా ఆమెను కాపాడలేకపోయాం. సాయంకాలానికే ఆమె పరిస్థితి క్షీణించింది. […] The post ఆమె ఊపిరి ఆగింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

చికిత్స పొందుతూ ఉన్నావ్ బాధితురాలు మృతి
గాయాలవల్లే మృతి: పోస్ట్‌మార్టమ్ నివేదిక
నిందితులను కాల్చి చంపాలి: బాధితురాలి తండ్రి
యోగి సర్కార్‌పై ప్రతిపక్షాల విమర్శల వర్షం

న్యూఢిల్లీ/ఉన్నావ్ (యుపి): అయిదుగురు దుండగులు దాడిచేసి నిప్పంటించిన ఘాతుకంలో తీవ్రంగా గాయపడిన ఉన్నావ్ అత్యాచార బాధితురాలు శుక్రవారం రాత్రి మరణించారు. ఆమెను వెంటనే విమానంలో ఢిల్లీకి తరలించి సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. ‘ఎంత ప్రయత్నించినా ఆమెను కాపాడలేకపోయాం. సాయంకాలానికే ఆమె పరిస్థితి క్షీణించింది. శుక్రవారం రాత్రి దాదాపు 11.10 గంటలకు ఆమెకు గుండెపోటు వచ్చింది. 11.40 గంటలప్పుడు మరణించారు’ అని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో బర్న్, ప్లాస్టిక్ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ షలాబ్ కుమార్ చెప్పారు.

90 శాతం కాలిన గాయాలతో…
ఉన్నావ్ బాధితురాలు తనపై జరిగిన అత్యాచారం కేసు విచారణకు గురువారం ఉదయం రాయ్‌బరేలీలో కోర్టు కు వెడుతుండగా అయిదుగురు కిరాతకులు ఆమెకు నిప్పంటించారు. వారిలో ఇద్దరు ఆమెపై అత్యాచారం చేసినవారు కూడా ఉన్నారు. ఈ ఘటనలో 90 శాతం కాలిన గాయాలైన ఆమెను లక్నోలోని స్థానిక ఆస్పత్రి నుంచి ఢిల్లీకి విమానంలో తీసుకొచ్చారు. ఆమె అంబులెన్స్ త్వరగా ఆస్పత్రి చేరేందుకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ‘గ్రీన్ కారిడార్’ను కూడా ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో చేర్చిన తర్వాత ఉన్నావ్ బాధితురాలిని పరీక్షించిన డాక్టర్ కుమార్ ఆమె పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని, శరీరంలో ప్రధాన భాగాల పనితీరు చాలా తక్కువ స్థాయిలో ఉందని వివరించారు.

కొన్ని గంటల్లోనే నిందితుల అరెస్ట్
ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే అయిదుగురు నిందితుల్నీ అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకడు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2018 జనవరి 19 నుంచి డిసెంబర్ 12వరకు తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినట్టు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎంతో అసహాయపరిస్థితిలో ఉండి కూడా ఆమె… సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ దయాశంకర్ పాథక్‌కు ఆనాడు జరిగింది చెప్పారని తెలిపారు.

హరిశంకర్ త్రివేది, రామ్ కిశోర్ త్రితేది, ఉమేష్ బాజ్‌పాయి, శివం త్రివేది, శుభం త్రివేది తనకు నిప్పంటించారని ఆమె పేర్కొన్నారు. మండుతున్న శరీరంతో ఆమె సాయంకోసం రోడ్డుపై పరుగులు తీయడం స్థానికుల్ని కంటతడి పెట్టించింది. గత ఏడాది ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితుల్లో ఒకరికి పది రోజుల కిందట బెయిల్ దొరికింది. శరీరంలో ఎక్కువభాగం కాలినందున 23 ఏళ్ల ఉన్నావ్ బాధితురాలు మరణించినట్టు పోస్ట్‌మార్టమ్ నివేదికలో వెల్లడైందని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి డాక్టర్ శనివారం చెప్పారు. ‘శరీరానికి చెందని ఏదైనా వస్తువు ఉన్నట్టు, అందువల్ల శరీరం విషపూరితం అయినట్టు లేదా ఊపిరి ఆడనట్టు కనిపించడం లేదు. అలాంటి దాఖలాలు లేవు’ అని డాక్టర్ చెప్పారు. బాధితురాలి మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఉత్తర ప్రదేశ్ ఉన్నావ్ జిల్లాలోని ఆమె స్వగ్రామానికి తీసుకెడుతున్నారు.

కాపాడలేకపోయాను: బాధితురాలి సోదరుడు
తన సోదరి పరలోకానికి వెళ్లినట్టే, నిందితులందరూ అ క్కడికి చేరినప్పుడే ఆమెకు న్యాయం జరుగుతుందని ఉన్నావ్ బాధితురాలి సోదరుడు చెప్పారు. ‘తనను కాపాడమని సోదరి వేడుకుంది. కానీ కాపాడలేకపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను’ అని అతను శనివారం విలేకరులతో అన్నారు.నిందితుల్ని ఎన్‌కౌంటర్‌లో చంపడం లేదా ఉరితీయడంజరగాలి.వారికి బతికే హక్కు లేదు. ఇక్కడి నుంచి ఉన్నావ్ వెడతాం. అక్కడే ఆమెకు అంత్యక్రియలు చేస్తాం’ అని అతను ఢిల్లీలో చెప్పారు.

వాళ్లను కాల్చి చంపాలి: తండ్రి
ఉన్నావ్ బాధితురాలు మరణించిన వార్త విన్నప్పటి నుంచీ ఆమె స్వగ్రామంలో అంతులేని విషాదం, తీవ్ర ఆగ్రహం కనిపించాయి. ఇంట్లో గడపై కూచున్న ఆమె తండ్రి మాట్లాడుతూ ‘నిందితుల్ని వెంటాడి వెంటాడి కాల్చి చంపాలి. అది నేను చూడాలి. నాకు డబ్బు కానీ, మరే సహాయం కానీ అక్కర్లేదు’ అని బాధతో, కోపంతో అన్నారు. హైదరాబాద్‌లో దిశ హత్య కేసులో జరిగినట్టుగానే న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ‘న్యాయం చేస్తామని ఎవరైనా ముందుకొచ్చారా?’ అని అడగ్గా ‘ఏ ఎంఎల్‌ఎ కానీ, అధికారి కానీ రాలేదు’ అన్నారు. ‘నిందితులు ధనబలంతో మాకు న్యాయం జరక్కుండా చేశారు. మొదట నా కేసును నమోదు చేసుకోలేదు. కోర్టు చెప్పిన తర్వాతే కేసు రిజిస్టర్ చేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తమ అమ్మాయిని కాపాడుకోలేకపోయినందుకు కుటుంబ సభ్యులు చాలా బాధపడుతున్నారు.

ప్రతిపక్షాల ఘాటు విమర్శలు
మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడంలోను, అత్యాచార బాధితులకు భద్రత కల్పించడంలోనూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరించడంలేదని ప్రతిపక్షాలు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. ఉదాసీనంగా ఎందుకుంటోందని నిలదీశాయి. ‘ఆ జిల్లాలో అంతకు ముందు అలాంటి సంఘటన జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం 23 ఏళ్ల బాధితురాలని ఎందుకు భద్రత కల్పించలేదు?’ అని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సూటిగా అడిగారు. ‘సామాజికంగా చూస్తే మనమంతా సిగ్గుతో తలదించుకోవాలి.

Unnao rape victim passed away during treatment in Delhi

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆమె ఊపిరి ఆగింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: