జిడిపి ఆందోళనలు.. రెండో రోజూ నష్టాలు

334 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 12వేల దిగువన ముగిసిన నిఫ్టీ ముంబై: జిడిపి అంచనాలను తగ్గిస్తూ ఆర్‌బిఐ చేసిన ప్రకటన ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలను చవిచూశాయి. బ్యాంకింగ్, ఆటో స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు డీలాపడ్డాయి. తొలుత స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే నష్టాల వైపు వెళ్లాయి. అక్కడి నుంచి సూచీలు ఎక్కడా కోలుకునే ప్రయత్నం చేయలేదు. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 334 […] The post జిడిపి ఆందోళనలు.. రెండో రోజూ నష్టాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

334 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
12వేల దిగువన ముగిసిన నిఫ్టీ

ముంబై: జిడిపి అంచనాలను తగ్గిస్తూ ఆర్‌బిఐ చేసిన ప్రకటన ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలను చవిచూశాయి. బ్యాంకింగ్, ఆటో స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు డీలాపడ్డాయి. తొలుత స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే నష్టాల వైపు వెళ్లాయి. అక్కడి నుంచి సూచీలు ఎక్కడా కోలుకునే ప్రయత్నం చేయలేదు. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 334 పాయింట్లు నష్టపోయి (0.82 శాతం) 40,445 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 12 వేల స్థాయిని కోల్పోయింది. ఆఖరికి 11,922 పాయింట్ల వద్ద స్థిరపడింది. అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి.

ఆర్థిక వృద్ధి ఆందోళనతో ఇన్వెస్టర్లులాభాల స్వీకరణకు దిగారు. దీంతో సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ప్రధానంగా ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు 5 శాతం పతనం కావడం సూచీల భారీ పతనానికి కారణమైంది. అత్యధికంగా ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఇలో కీలకమైన బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 1.30శాతం నష్టపోయి 31,301 వద్ద స్థిరపడింది. గురువారం ఆర్‌బిఐ ద్రవ్య పాలసీ సమావేశంలో ఎంపి సి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి అంచనాలను 5 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ ప్రకటన మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ఆర్‌బిఐ ప్రకటించిన నేపథ్యంలో మార్కెట్ నష్టంతో ప్రారంభమైంది. ఆరంభం నుంచి మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆర్థిక, అటో షేర్లలో ఎక్కువగా విక్రయాలు వెల్లువెత్తాయి. ప్రధానంగా గెయిల్, ఇండస్ ఇండ్, జి లిమిటెడ్, ఎస్‌బిఐ, యస్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. డాక్టర్ రెడ్డీస్, టాటాస్టీల్, జెఎస్‌డబ్లు స్టీల్, కోటక్‌బ్యాంక్, ఇన్ఫ్రాటెల్ షేర్లు లాభపడ్డాయి.

Sensex falls 334 points to close

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జిడిపి ఆందోళనలు.. రెండో రోజూ నష్టాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: