2020 నాటికి 45,500కు సెన్సెక్స్

కోటక్ సెక్యూరిటీస్ న్యూఢిల్లీ: మార్కెట్‌లో రోలర్ కోస్టర్ రైడ్ నడుస్తోంది. శుక్రవారం సూచీలు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా నష్టపోయింది. అయినప్పటికీ కోటక్ సెక్యూరిటీస్ ఎండి, సిఇఒ జైదీప్ హన్స్‌రాజ్ మాట్లాడుతూ, మందగమనంలోనూ ఈ ఏడాది మార్కెట్లు పెరిగాయని, దీనికి కారణం విదేశీ పెట్టుబడులు పటిష్టంగా ఉండడం, అలాగే దేశీయ మ్యూచువల్ ఫండ్ల నుంచి సిప్(సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ఇన్వెస్ట్‌మెంట్ వంటివి పెరగడమే అని అన్నారు. సెప్టెంబర్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కార్పొరేట్ […] The post 2020 నాటికి 45,500కు సెన్సెక్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
కోటక్ సెక్యూరిటీస్

న్యూఢిల్లీ: మార్కెట్‌లో రోలర్ కోస్టర్ రైడ్ నడుస్తోంది. శుక్రవారం సూచీలు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా నష్టపోయింది. అయినప్పటికీ కోటక్ సెక్యూరిటీస్ ఎండి, సిఇఒ జైదీప్ హన్స్‌రాజ్ మాట్లాడుతూ, మందగమనంలోనూ ఈ ఏడాది మార్కెట్లు పెరిగాయని, దీనికి కారణం విదేశీ పెట్టుబడులు పటిష్టంగా ఉండడం, అలాగే దేశీయ మ్యూచువల్ ఫండ్ల నుంచి సిప్(సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ఇన్వెస్ట్‌మెంట్ వంటివి పెరగడమే అని అన్నారు. సెప్టెంబర్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కార్పొరేట్ పన్ను తగ్గింపు ప్రకటన చేశారు. ఇది కార్పొరేట్ కంపెనీలకు మంచి లాభాలను తీసువస్తుందని ఆయన అన్నారు. అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టాయని, అంతటా ప్రస్తుతం ఈక్విటీలు మంచి రాబడిని ఇచ్చే సాధనాలుగా మారాయని ఆయన అన్నారు.

Kotak Securities expect Sensex to touch 45500

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 2020 నాటికి 45,500కు సెన్సెక్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: