అల్లంతో ఆరోగ్య లాభాలెన్నో…

  వంటింట్లో వుండే పదార్థాల్లో గల గొప్ప ఔషధం అల్లం. ఎన్నో ఆరోగ్య సమస్యలకి వంటింట్లో వున్న ఈ దివ్య ఔష్యధంతో నివారించవచ్చు అంటున్నారు నిపుణులు. అల్లం వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం… జలుబు, దగ్గుకి అల్లంతో చెక్ : ఒక టేబుల్ స్పూన్ తేనెలో కొన్ని అల్లం రసం చుక్కల్ని వేసి ఓ మిశ్రమంగా కలిపి తీసుకుంటే, జలుబు, దగ్గు హుష్ కాకి అవుతాయి. రోజుకు రెండు నుంచి నాలుగుసార్లు ఇలా చేయాలి. పొట్ట ఉబ్బరం, […] The post అల్లంతో ఆరోగ్య లాభాలెన్నో… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వంటింట్లో వుండే పదార్థాల్లో గల గొప్ప ఔషధం అల్లం. ఎన్నో ఆరోగ్య సమస్యలకి వంటింట్లో వున్న ఈ దివ్య ఔష్యధంతో నివారించవచ్చు అంటున్నారు నిపుణులు. అల్లం వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం…

జలుబు, దగ్గుకి అల్లంతో చెక్ :
ఒక టేబుల్ స్పూన్ తేనెలో కొన్ని అల్లం రసం చుక్కల్ని వేసి ఓ మిశ్రమంగా కలిపి తీసుకుంటే, జలుబు, దగ్గు హుష్ కాకి అవుతాయి. రోజుకు రెండు నుంచి నాలుగుసార్లు ఇలా చేయాలి.

పొట్ట ఉబ్బరం, కడుపు నొప్పి :
అల్లం ఛాయ్‌తో పొట్ట ఉబ్బరం, కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అల్లంలో ఉండే ఔషధ గుణాలు పొట్టలో వున్న గ్యాస్‌ని బయటికి పంపించేయడానికి ఉపయోగపడతాయి. ఫలితంగా పొట్ట ఉబ్బరం, నొప్పి నుంచి త్వరిత ఉపశమనం లభిస్తుంది.

శరీరానికి వెచ్చదనం :
శీతాకాలంలో జలుబు బారిన పడకుండా శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు అల్లం బాగా ఉపయోగపడుతుంది. చిన్న ముక్కలుగా తరిమిన ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కలని రెండు కప్పుల నీటిలో వేసి 10 నిమిషాలపాటు మరగపెట్టాలి. అల్లంతో కాచిన ఈ నీళ్లు వేడి తగ్గిన తర్వాత కొన్ని తేనె చుక్కలు అందులో కలుపుకుని సేవించాలి. అప్పుడప్పుడు ఇలా అల్లంతో కాచిన నీటిని రోజులో రెండు లేదా మూడుసార్లు సేవిస్తే, జలుబు దరిచేరదు. ఈ చలికాలంలో అల్లంతో తయారుచేసే ఏదైనా శ్రేష్టమే.

Health Benefits with Ginger

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అల్లంతో ఆరోగ్య లాభాలెన్నో… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: