చిరుచేదు మంచిదే!

కాకరకాయ అనగానే చేదు అంటూ చాలా మంది దీన్ని ఇష్టపడరు. కానీ కాకర ప్రయోజనాలు తెలుసుకుంటే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. కాకరకాయ రుచికి చేదుగా ఉన్నప్పటికీ ఇందులో చాలా పోషక విలువలు ఉన్నాయి. అనేక రోగాలను నయం చేసే దివ్య ఔషధం కాకర. కాకరను అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. కడుపులో నులి పురుగులను నాశనం చేస్తుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి, […] The post చిరుచేదు మంచిదే! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కాకరకాయ అనగానే చేదు అంటూ చాలా మంది దీన్ని ఇష్టపడరు. కానీ కాకర ప్రయోజనాలు తెలుసుకుంటే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. కాకరకాయ రుచికి చేదుగా ఉన్నప్పటికీ ఇందులో చాలా పోషక విలువలు ఉన్నాయి. అనేక రోగాలను నయం చేసే దివ్య ఔషధం కాకర. కాకరను అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. కడుపులో నులి పురుగులను నాశనం చేస్తుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి, కాబట్టి వీటిని క్రమంతప్పకుండా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

1. కీళ్ళ నొప్పులు తగ్గించే గుణం కాకరకాయలో ఉంది.
2. కాలేయం సామర్థ్యం తగ్గకుండా కాపాడే శక్తి కాకరకాయకు ఉంది.
3. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. కాకరకాయను నీళ్లలో ఉడికించి ఆ నీటిని చల్లార్చుకుని తాగితే ఎన్నో ఇన్‌ఫెక్షన్స్ నుంచి బయటపడొచ్చు.
4. కాకర వల్ల జలుబు, దగ్గు, అస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి త్వరగా కోలుకోవచ్చు.
5. రక్తాన్ని శుద్ధి చేయడంలో కాకరగాయ ఎంతో కీలకంగా పనిచేస్తుంది. కాలినగాయాలు, పుండ్లను మాన్పడంలో చక్కగా పనిచేస్తుంది.
6. అందమైన శరీరాకృతి కోరుకునే వారు, బరువు తగ్గాలనుకునేవారు చేదుగా ఉన్నా కాకరకాయ రసం తాగాల్సిందే.
7. కాకరకాయలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వు శాతాన్ని తగ్గించి, బరువు తగ్గడానికి ఎంతగానో సహకరిస్తాయి.
8. కంటి సమస్యలను తగ్గిస్తుంది.
9. ఉదర సమస్యలకు, అజీర్ణం, కడుపులో మంట వంటి సమస్యలకు కాకరకాయ రసానికి మించిన సంజీవని లేదు.
10. శరీరంలో కొవ్వు శాతాన్ని అదుపులో ఉంచి, గుండె సంబంధిత వ్యాధులను నియంత్రిస్తుంది.

 

పులుసు

కావాల్సినవి : కాకరకాయ తరుగు – ఒకటిన్నర కప్పులు, చింతపండు – నిమ్మకాయంత, బెల్లం -ఒకటిన్నర టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి తగినంత, నూనె, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు – తిరగమోతకు సరిపడా.
పేస్టుకోసం: ఎండుకొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి – 5, మినప్పప్పు – 1 టేబుల్ స్పూను, గసగసాలు – 1 టీ స్పూను.
తయారీ : కాకర ముక్కల్ని పసుపు నీటిలో 10 నిమిషాలు ఉంచాలి. ఎండు మిర్చి, మినప్పప్పు, గసగసాలు విడివిడిగా వేగించి కొబ్బరి తురుముతో పాటు పేస్టు చేసుకోవాలి. నూనెలో తాలింపు వేగాక (నీరు పిండేసిన) కాకరముక్కలు వేసి 10 నిమిషాలు వేగించాలి. తర్వాత చింతపండు గుజ్జు కలిపి 20 నిమిషాలు ఉడికించాలి. ముక్కలు మెత్తబడ్డాక రుబ్బిన పేస్టు, బెల్లం, ఉప్పు వేసి పులుసు చిక్కబడ్డాక దించేయాలి. వేడి వేడి అన్నంలో కలుపుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది.

 

వరుగులు

కావాల్సినవి : కాకరకాయలు (ఓ మాదిరి సైజ్ ఉన్నవి) – ఆరు, ఉప్పు- రెండు టీస్పూన్లు లేదా అంతకంటే కాస్త తక్కువైనా ఫరవాలేదు, నీళ్లు – ఐదు కప్పులు, పసుపు – ఒక టీస్పూన్.
తయారీ : కాకరకాయల్ని కాస్త మందంగా, గుండ్రటి చక్రాల్లా తరగాలి. నీళ్లలో ఉప్పు, పసుపు వేసి వేడిచేయాలి. ఆ నీళ్లలో కాకరకాయ ముక్కలు వేసి ఓ మాదిరి మంట మీద ఐదు నిమిషాలు ఉడికించాలి. స్టవ్ ఆపేసి, కాకరకాయ ముక్కలు ఉడికించిన నీళ్లను వంపేయాలి. కాకరకాయ ముక్కల్ని ఒక ప్లేట్‌లోకి తీసి రెండు మూడు రోజులు ఎండబెట్టాలి. తరువాత ఒక డబ్బాలో నిల్వచేయాలి. తినాలనిపించినప్పుడు వేడి నూనెలో వేసి బాగా వేగించాలి. పప్పు, సాంబారు, రసం అన్నంతో కలుపుకుని తింటే కమ్మగా ఉంటాయి.

 

పకోడి

కావాల్సినవి : కాకరకాయలు – పావు కేజీ, బియ్యప్పిండి – 7 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి తగినంత, మిరియాల పొడి – పావు టీ స్పూను, కారం -1 టీ స్పూను, పసుపు -పావు టీ స్పూను, ఇంగువ – చిటికెడు, గరం మసాల – పావు టీ ను, నూనె – వేగించడానికి సరిపడా.
తయారీ : కాకరకాయలను నిలువుగా కోసి గింజలు తీసి ముక్కలు చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసి (ముక్కలకు పట్టేలా చేత్తో గట్టిగా వత్తి) గంటపాటు పక్కనుంచాలి. తర్వాత బియ్యప్పిండి, ఉప్పు, గరం మసాల, ఇంగువ, కారం కలపాలి. 10 నిమిషాల తర్వాత నూనెలో పకోడీల్లా వేసి దోరగా వేగించాలి. సాంబారన్నంలో నంజుకోడానికి ఎంతో రుచిగా ఉంటాయి.

 

ఉల్లికారం

కావాల్సినవి : కాకరకాయలు- పావు కిలో, ఉల్లి కారం -2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత, జీలకర్ర 1 టీస్పూను, నూనె – 2 టే స్పూన్లు, కరివేపాకు- 2 రెమ్మలు, కొత్తిమీర- 1 కట్ట
తయారీ : కాకరకాయలు తొక్కుతీసి కడిగి నిలువుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలకు గాట్లు పెట్టి పక్కనుంచాలి. ఉల్లికారం, ఉప్పు కలుపుకోవాలి. ఈ ముద్దను గాట్లు పెట్టిన కాకరకాయల్లో కూరి పక్కనుంచాలి. బాండ్లీలో నూనె పోసి జీలకర్ర, కరివేపాకు వేయించి కాకరకాయ ముక్కలు వేసి మూత పెట్టి చిన్నమంట మీద ఉడికించాలి. తరచుగా ముక్కల్ని గరిటెతో తిప్పుతూ అన్ని వైపులా సమంగా ఉడికించాలి. ముక్కలు బాగా ఉడికాక కొత్తిమీర చల్లి దింపాలి.

Bitter Melon Recipes

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చిరుచేదు మంచిదే! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: