నేను పోలీస్ కానందుకు బాధపడుతున్నా

  ఖమ్మం : దిశ ఘటన నిందితుల ఎన్‌కౌంటర్ పై రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పందించారు. నేను పోలీసు కాన్నందుకు బాధపడుతున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం ఖమ్మం నగరంలో జెడ్పీ సెంటర్‌లోని అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళ్లులు అర్పించిన ఆనతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌తో దిశ ఆత్మశాంతిస్తుందన్నారు. ఆడపిల్లలవైపు కన్నెత్తి చూస్తే కళ్ళు పీకి చూపిస్తామని మరోసారి […] The post నేను పోలీస్ కానందుకు బాధపడుతున్నా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఖమ్మం : దిశ ఘటన నిందితుల ఎన్‌కౌంటర్ పై రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పందించారు. నేను పోలీసు కాన్నందుకు బాధపడుతున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం ఖమ్మం నగరంలో జెడ్పీ సెంటర్‌లోని అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళ్లులు అర్పించిన ఆనతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌తో దిశ ఆత్మశాంతిస్తుందన్నారు.

ఆడపిల్లలవైపు కన్నెత్తి చూస్తే కళ్ళు పీకి చూపిస్తామని మరోసారి కెసిఆర్ ప్రజలకు భరోస కల్పించారన్నారు. కేసుల విషయంలో సత్వర న్యాయం చేయడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ అని మరోసారి రుజువైందన్నారు. దిశ ఘటనకు బాధ్యులైన నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ జరగడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుందన్నారు. ఈ సంఘటనతో మహిళలను వేధించే వారికి గుణపాఠం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఎన్‌కౌంటర్లో పాల్గొన్న పోలీసులను ఆయన అభినందించారు.

Puvvada said I am suffering from not being Policeman

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నేను పోలీస్ కానందుకు బాధపడుతున్నా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.