ఒవైసితో విద్యాశాఖ మంత్రి సబితా భేటీ

  హైదరాబాద్: ఉర్దూ మీడియం పాఠశాలల సమస్యలపై ఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఒవైసితో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం అయ్యారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులను భార్తీ చేసేందుకు ప్రత్యేక డిఎస్సి నిర్వహించే అంశాన్ని సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకోళ్తామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఖాళీ ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించాలని, అర్హత కలిగిన వారు లేకపోవడంతో ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటున్నాయన్నారు. ప్రత్యేక డిఎస్సి నిర్వహించని […] The post ఒవైసితో విద్యాశాఖ మంత్రి సబితా భేటీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: ఉర్దూ మీడియం పాఠశాలల సమస్యలపై ఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఒవైసితో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం అయ్యారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులను భార్తీ చేసేందుకు ప్రత్యేక డిఎస్సి నిర్వహించే అంశాన్ని సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకోళ్తామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఖాళీ ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించాలని, అర్హత కలిగిన వారు లేకపోవడంతో ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటున్నాయన్నారు.

ప్రత్యేక డిఎస్సి నిర్వహించని పోస్టుల భర్తీ కాకపోతే డి రిజర్వేషన్ ద్వారా మైనార్టీల్లోని జనరల్ క్వాటగిరి ద్వారా భర్తీ చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఉర్దూ భాషను ప్రోత్సహించేందుకు తెలంగాణ సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటుందని, ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో వెంటనే విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేస్తామని, నగరంలోని పలు ఉర్దూ మీడియం పాఠశాలలు కనీస సదుపాయాలను కల్పించేందుకు ప్రతిపాదనలు రూపొందించాయని మంత్రి సబితారెడ్డి స్పష్టం చేశారు.

Meeting of Asaduddin Owaisi Minister Sabitha Indra Reddy

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఒవైసితో విద్యాశాఖ మంత్రి సబితా భేటీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: