పార్లమెంట్‌లో తెలంగాణ ఎన్‌కౌంటర్ ప్రతిధ్వనులు

  ముంబై : దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై పార్లమెంట్‌లో భిన్న స్పందన లభించింది. తెలంగాణ పోలీసులు దిశ హత్యకేసు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై పలువురు ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. శివసేన ఎంపి అరవింద్ సావంత్ లోక్‌సభలో మాట్లాడుతూ ఇటువంటి కేసులలో బాధితులకు త్వరితంగా న్యాయం లభించేందుకు వీలుగా మహిళలపై జరిగే నేరాలకు సంబంధించిన కేసులను సుప్రీంకోర్టు నేరుగా విచారణ చేపట్టేలా చట్టాలను మార్చాలని కోరారు. ప్రస్తుతం న్యాయ ప్రకియ కింది కోర్టుల నుంచి మొదలవుతోందని, […] The post పార్లమెంట్‌లో తెలంగాణ ఎన్‌కౌంటర్ ప్రతిధ్వనులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముంబై : దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై పార్లమెంట్‌లో భిన్న స్పందన లభించింది. తెలంగాణ పోలీసులు దిశ హత్యకేసు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై పలువురు ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. శివసేన ఎంపి అరవింద్ సావంత్ లోక్‌సభలో మాట్లాడుతూ ఇటువంటి కేసులలో బాధితులకు త్వరితంగా న్యాయం లభించేందుకు వీలుగా మహిళలపై జరిగే నేరాలకు సంబంధించిన కేసులను సుప్రీంకోర్టు నేరుగా విచారణ చేపట్టేలా చట్టాలను మార్చాలని కోరారు. ప్రస్తుతం న్యాయ ప్రకియ కింది కోర్టుల నుంచి మొదలవుతోందని, ఏళ్ల తరబడి కొనసాగే ఈ ప్రక్రియ వల్ల బాధితులకు సత్వర న్యాయం లభించడం లేదని ఆయన చెప్పారు.

చట్టాలను మార్చడంపై చర్చించేందుకు ఒక కమిటీని నియమించవలసిందిగా లోక్‌సభ స్పీకర్‌ను ఆయన కోరారు. బిజెపి ఎంపి మీనాక్షి లేఖి తెలంగాణ పోలీసుల చర్యను సమర్శించారు. ఆట బొమ్మగా ఉంచుకునేందుకు పోలీసులకు ఆయుధాలు ఇవ్వలేదని ఆమె లోక్‌సభ జీరోఅవర్‌లో వ్యాఖ్యానించారు. వైఎస్‌ఆర్‌సిపి ఎంపి కె రఘురామకృష్ణం రాజు పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ దిశ కేసులో నలుగురు నిందితులను చంపడం తప్పు కాదని అన్నారు. పోలీసుల చర్యను ఏ హక్కుల సంస్థ అయినా వ్యతిరేకిస్తే అది జాతి వ్యతిరేకిగా ముద్ర వేయించుకుంటుందని ఆయన హెచ్చరించారు. మహారాష్ట్రకు చెందిన స్వతంత్ర ఎంపి నవనీత్ రాణా కూడా తెలంగాణ పోలీసుల చర్యను సమర్థించారు. ఒక తల్లిగా, కుమార్తెగా, భార్యగా తాను ఆ నలుగురు నిందితుల చావును బలపరుస్తున్నానని ఆమె చెప్పారు.

ఇలా ఉంటే..బిజెపికి చెందిన మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ ఈ ఎన్‌కౌంటర్‌ను భయానకమంటూ అభివర్ణించారు. ఇది అత్యంత భయానకమని, ప్రజలు చంపమన్నారన్న కారణంతో ఎలా చంపుతారని, చట్టాలను ఎవరూ చేతుల్లోకి తీసుకోరాదని ఆమె అన్నారు. ఏదేమైనా నిందితులకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించనున్న పరిస్థితులలో ఎన్‌కౌంటర్‌లో వారిని చంపడం తగదని ఆమె వ్యాఖ్యానించారు. మరో బిజెపి ఎంపి లాకెట్ చటర్జీ పోలీసుల చర్యను సమర్థించారు. అటువంటి చర్యలకు చట్టపరమైన అనుమతి ఉండాలని ఆమె సూచించారు. దిశ ఆత్మకు ఇప్పుడు శాంతి లభిస్తుందని, ఆమె కుటుంబ సభ్యులకు ఇప్పుడు మనశ్శాంతి లభిస్తుందని ఆమె అన్నారు. ఇటువంటి ఎన్‌కౌంటర్లను చట్టబద్ధం చేయాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

కాగా, ఉన్నావ్ అత్యాచార బాధితురాలిపై నిన్న నిందితులు హత్యాయత్నానికి పాల్పడడం పట్ల కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తుతూ ఉన్నావ్ బాధితురాలు 95 శాతం కాలిన గాయాలతో ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోందని తెలిపింది. ఏ దేశంలో ఏం జరుగుతోందని ప్రశ్నించిన కాంగ్రెస్ ఒకపక్క దేశంలో రాముడికి గుడి కడుతుండగా మరో పక్క సీతా మాత దగ్ధమవుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. నేరస్తులు ఏ ధైర్యంతో ఇలా చెలరేగిపోత్తున్నారని కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి లోక్‌సభలో ప్రశ్నించారు. ఉన్నావ్ సంఘటనకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

Parliament debates Telangana Encounter, MPs hailed the police action and advocated legal ways to ensure punishment to rapists and murderers

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పార్లమెంట్‌లో తెలంగాణ ఎన్‌కౌంటర్ ప్రతిధ్వనులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: