బతికుండగానే భార్యను బురదలో పాతిపెట్టాడు….

పనాజి: గోవాలోని బిచోలిమ్ ప్రాంతంలో అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను ఓ భర్త బతికి ఉండగానే బురదలో పాతిపెట్టాడు. ఆ కుటుంబం ఆర్థిక సమస్యలు ఎక్కువ కావడంతో దంపతులు మధ్య వివాదం జరగడంతో భార్యను భర్త హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తుకరామ్ షెట్‌గోయంకర్ అనే వ్యక్తి తన్వి అనే మహిళను 17 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు 14 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. బిచోలిమ్ అనే ప్రాంతంలో తిల్లారి నీటి […] The post బతికుండగానే భార్యను బురదలో పాతిపెట్టాడు…. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పనాజి: గోవాలోని బిచోలిమ్ ప్రాంతంలో అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను ఓ భర్త బతికి ఉండగానే బురదలో పాతిపెట్టాడు. ఆ కుటుంబం ఆర్థిక సమస్యలు ఎక్కువ కావడంతో దంపతులు మధ్య వివాదం జరగడంతో భార్యను భర్త హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తుకరామ్ షెట్‌గోయంకర్ అనే వ్యక్తి తన్వి అనే మహిళను 17 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు 14 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. బిచోలిమ్ అనే ప్రాంతంలో తిల్లారి నీటి పారుదల ప్రాజెక్ట్‌కు సంబంధించిన కాలువలో బురదగా ఎక్కువగా ఉండడంతో జెసిబి సహాయంతో బురదతో కూడిన మట్టిని తీసేస్తున్నారు. బురద ఎత్తిపోయిడం ఆపాలని షెట్‌గోయంకర్ అక్కడ ఉన్న కూలీలతో గొడవకు దిగాడు. షెట్‌గోయంకర్ చెప్పిన వినకుండా బురదను ఎత్తిపోస్తుండగా మహిళ మృతదేహం కనిపించింది. వెంటనే ఘటనా స్థలం నుంచి గోయంకర్ పారిపోయాడు. జెసిబి డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహం గోయంకర్ భార్యగా గుర్తించారు. పరారీలో ఉన్న గోయంకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. తన భార్య అనారోగ్య సమస్యలతో బాధపడుతోందని, ఈ క్రమంలో తమ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఎక్కువ కావడంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భార్య బతికుండగానే బురదలో పాతిపెట్టానని వివరించాడు. వెంటనే పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

 
Husband Buries wife in Mug with alive in Bicholim,Second Bucket of mud was being Scooped out, The workers were shocked to find a female body Buried there

The post బతికుండగానే భార్యను బురదలో పాతిపెట్టాడు…. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: