నిర్భయ నిందితులను చంపాలన్న ఆలోచనే రాలేదు

  న్యూఢిల్లీ : నిర్భయ హత్యాచార నిందితులను చంపాలన్న ఆలోచన తనకు ఎన్నడూ రాలేదని ఆ కేసును దర్యాప్తు చేసిన మాజీ ఢిల్లీ పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ చెప్పారు. నిర్భయ హత్యాచార సంఘటన జరిగిన కాలంలో తనపై చాలా ఒత్తిడి ఉండేదని, అయినప్పటికీ నిందిఉలను చంపివేయాలన్న ఆలోచనే తనకు రాలేదని ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ ఆయన అన్నారు. ఆకలిగా ఉన్న సింహాలకు ఆహారంగా నిందితులను వేసేయండంటూ తమకు చాలా మెసేజ్‌లు వచ్చేవని, అయినప్పటికీ తాము చట్ట […] The post నిర్భయ నిందితులను చంపాలన్న ఆలోచనే రాలేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ : నిర్భయ హత్యాచార నిందితులను చంపాలన్న ఆలోచన తనకు ఎన్నడూ రాలేదని ఆ కేసును దర్యాప్తు చేసిన మాజీ ఢిల్లీ పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ చెప్పారు. నిర్భయ హత్యాచార సంఘటన జరిగిన కాలంలో తనపై చాలా ఒత్తిడి ఉండేదని, అయినప్పటికీ నిందిఉలను చంపివేయాలన్న ఆలోచనే తనకు రాలేదని ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ ఆయన అన్నారు. ఆకలిగా ఉన్న సింహాలకు ఆహారంగా నిందితులను వేసేయండంటూ తమకు చాలా మెసేజ్‌లు వచ్చేవని, అయినప్పటికీ తాము చట్ట ప్రకారం నడుచుకున్నామని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితులు పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించినట్లు వచ్చిన మీడియా వార్తలను పరిగణనలోకి తీసుకున్న జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సి) సంఘటనా స్థలానికి నిజ నిర్ధారణ కమిటీని పంపాలని నిర్ణయించినట్లు తెలిసింది.

Never thought of killing the accused,
Nirbhaya case investigating officer, former Delhi Police Chief Neeraj Kumar says that he never get idea of killing the accused despite having pressure from the public

The post నిర్భయ నిందితులను చంపాలన్న ఆలోచనే రాలేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: