నిత్యానంద అప్పగింతపై సమాచారం లేదు

  న్యూఢిల్లీ : అత్యాచార ఆరోపణలతో బాలికల అపహరణ తదితర కేసులలో చిక్కుకున్న స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానందను దేశానికి తీసుకురావడంపై తమకు ఏ దర్యాప్తు సంస్థల నుంచి ఎటువంటి అభ్యర్థన రాలేదని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. నిత్యానంద గత నెలలో ఈక్వెడార్ పారిపోయి అక్కడే ఒక దీవిని కొనుగులో చేసి దాని కైలాస అని పేరుపెట్టినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో విదేశీ వ్యవహారాల శాఖ గురువారం ఈ ప్రకటన చేసింది. […] The post నిత్యానంద అప్పగింతపై సమాచారం లేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ : అత్యాచార ఆరోపణలతో బాలికల అపహరణ తదితర కేసులలో చిక్కుకున్న స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానందను దేశానికి తీసుకురావడంపై తమకు ఏ దర్యాప్తు సంస్థల నుంచి ఎటువంటి అభ్యర్థన రాలేదని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. నిత్యానంద గత నెలలో ఈక్వెడార్ పారిపోయి అక్కడే ఒక దీవిని కొనుగులో చేసి దాని కైలాస అని పేరుపెట్టినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో విదేశీ వ్యవహారాల శాఖ గురువారం ఈ ప్రకటన చేసింది. పారిపోయిన నేరస్తులను వెనక్కు రపించడంపై దర్యాప్తు సంస్థలు తమ మంత్రిత్వశాఖకు తెలియచేస్తాయని, వాటి సూచనల మేరకే తమ శాఖ పనిచేస్తుందని మంత్రిత్వశాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు.

దర్యాప్తు సంస్థల నుంచి అభ్యర్థన వచ్చిన తర్వాత తాము నిందితుడు పారిపోయిన దేశం ప్రభుత్వాన్ని సంప్రదించి నిందితుడి నేర వివరాలను అందచేయడం జరుగుతుందని ఆయన వివరించారు. నిత్యానంద విషయంలో ఏ దర్యాప్తు సంస్థ నుంచైనా అభ్యర్థన అందితే సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.

No request for Nityanandas extradition, MEA spokesperson Raveesh Kumar said that ;no information was received from any agency on extradition of Nityananda who is reportedly staying in Equador

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నిత్యానంద అప్పగింతపై సమాచారం లేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: