ఆరోసారి తగ్గింపు లేదు

వడ్డీ రేట్లు యథాతథమే.. ద్రవ్యోల్బణం ఆందోళనలే కారణం  రెపో రేటు 5.15 శాతం కొనసాగింపు జిడిపి వృద్ధి అంచనా 5 శాతానికి తగ్గింపు ముంబై: ఆర్థిక మందగమనం ఆందోళనకరంగా మారడం, ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని మించిపోవడం వంటి కారణాల వల్ల ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) అనూహ్యంగా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. వరుసగా ఐదుసార్లు వడ్డీ రేట్లను పెంచుకుంటూ వచ్చిన ఆర్‌బిఐ ఈసారి ఎలాంటి మార్పు చేయలేదు. రెపో రేటు 5.15 శాతం, రివర్స్ రెపో రేటు 4.90 […] The post ఆరోసారి తగ్గింపు లేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వడ్డీ రేట్లు యథాతథమే.. ద్రవ్యోల్బణం ఆందోళనలే కారణం

 రెపో రేటు 5.15 శాతం కొనసాగింపు
జిడిపి వృద్ధి అంచనా 5 శాతానికి తగ్గింపు

ముంబై: ఆర్థిక మందగమనం ఆందోళనకరంగా మారడం, ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని మించిపోవడం వంటి కారణాల వల్ల ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) అనూహ్యంగా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. వరుసగా ఐదుసార్లు వడ్డీ రేట్లను పెంచుకుంటూ వచ్చిన ఆర్‌బిఐ ఈసారి ఎలాంటి మార్పు చేయలేదు. రెపో రేటు 5.15 శాతం, రివర్స్ రెపో రేటు 4.90 శాతం ఈ రెండింటిలో ఎలాంటి మార్పులేదు. అలాగే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్), బ్యాంక్ రేట్ 5.40 శాతంగా ఉన్నాయి. గురువారం ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆధ్వర్యంలోని ఆరుగురు సభ్యుల ఎంపిసి(మోనెటరీ పాలసీ కమిటీ) ఈ ప్రకటన చేసింది. మొత్తం ఆరుగురు సభ్యులు రేట్లను యథాతథంగా కొనసాగించేందుకు ఓటు వేశారు.

ఆర్‌బిఐ ఐదో ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షలో జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి రేటు అంచనాను తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జిడిపి వృద్ధి అంచనాను 5 శాతానికి తగ్గించింది. మునుపటి అంచనా 6.1 శాతంగా ఉంది. ద్రవ్య విధాన సమీక్ష మూడు రోజుల సమావేశం తరువాత ఆర్‌బిఐ ఈ నిర్ణయాలను గురువారం తెలియజేసింది. 201920 ఆర్థిక సంవత్సరం రెండవ భాగంలో రిటైల్ ద్రవ్యోల్బణం (సిపిఐ) 4.7-5.1 శాతంగా ఉంటుందని తన నివేదికలో పేర్కొంది. అయితే మునుపటి అంచనా 3.5 శాతం నుండి 3.7 శాతంగా ఉంది.

జిడిపి వృద్ధి అంచనా తగ్గింపు

మరింత రేటు తగ్గింపునకు అవకాశం ఉందని ఎంపిసి సభ్యులు పరస్పర ఒప్పందంతో అంగీకరించారు. అయితే వృద్ధి, ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తే ప్రస్తుతం రేటును తగ్గించకూడదని నిర్ణయించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధి 6.1 శాతం నుండి 5 శాతానికి తగ్గించింది. అంతకుముందు అక్టోబర్‌లో ఆర్‌బిఐ జిడిపి వృద్ధి 6.1 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.

శక్తికాంత దాస్ ఏం చెప్పారు?

రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకారం, ఆర్థిక కార్యకలాపాలు బలహీనపడ్డాయి. ఉత్పత్తి కూడా బలహీనంగా ఉంది. వృద్ధిని పెంచడానికి ప్రభుత్వం, ఆర్‌బిఐ అనేక పటిష్టమైన చర్యలు తీసుకున్నాయి. వడ్డీ రేట్లను స్థి రంగా ఉంచడం తాత్కాలిక దశ అని, రెపో రేటులో 1.35 శాతం తగ్గింపు ఇప్పటివరకు ఎంత మేరకు ప్రభావం చూపిందో తెలుసుకుంటామని అన్నారు. ఆర్థిక వ్యవస్థకు అవసరమైనంతవరకు ద్రవ్య విధానంపై సంప్రదాయవా ద దృక్పథం ఉంటుంది. రెపోరేటులో మరింత తగ్గింపు సాధ్యమే. ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) తదుపరి సమావేశం ఫిబ్రవరి 4-, 6 తేదీలలో ఉంటుంది.

ద్రవ్యోల్బణ అంచనాలు పెరిగాయి

రిటైల్ ద్రవ్యోల్బణ అంచనాను ఆర్‌బిఐ రెండవ భాగంలో (అక్టోబర్-మార్చి) 4.7-5.1 శాతానికి పెంచింది. రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 4.6 శాతానికి పెరిగింది. ఇది ఆర్‌బిఐ అంచనాల కంటే చాలా ఎక్కువ. అందువల్ల ఆర్‌బిఐ రెండవ భాగంలో ద్రవ్యోల్బణ రేటును పెంచింది.

పావు శాతం తగ్గింపు అంచనా

గత ఐదు సమావేశాలలో ఆర్‌బిఐ రెపో రేటును తగ్గించగా, మొత్తం 1.35 శాతం తగ్గించింది. ఆర్థికవేత్తలు ఈసారి కూడా 0.25 శాతం తగ్గింపును ఆశించారు. ఆర్థిక వృద్ధి రేటును వేగవంతం చేయడానికి ఆర్‌బిఐ రెపో రేటును మరింత తగ్గించే నిర్ణయం తీసుకుంటుందని ఆశించారు. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో జిడిపి వృద్ధి కేవలం 4.5 శాతం. గత 6 సంవత్సరాలలో ఇది అత్యంత కనిష్ట స్థాయి. కాగా వడ్డీ రేటు తగ్గించినా బ్యాంకులు వినియోగదారులకు పెద్దగా ప్రయోజనం ఇవ్వలేదు. దీంతో రిజర్వు బ్యాంక్ రెపో రేట్లను బాహ్య బెంచ్‌మార్క్‌లతో అనుసంధానించడం అక్టోబర్ నుండి తప్పనిసరి చేసింది. ఎస్‌బిఐతో సహా ప్రధాన బ్యాంకులు వడ్డీ రేట్లను రెపో రేట్లతో అనుసంధానించాలని నిర్ణయించాయి.

RBI Monetary Policy 2019

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆరోసారి తగ్గింపు లేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: