జిఎస్‌టి పరిహారం ఎందుకు ఆపారు!

నిర్మలా సీతారామన్‌ను ప్రశ్నించిన రాష్ట్రాల ఆర్థికమంత్రులు న్యూఢిల్లీ: జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) పరిహారంతో సహా పలు అంశాలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో రాష్ట్ర ఆర్థిక మంత్రులు సమావేశమై చర్చించారు. ఆగస్టు- సెప్టెంబర్‌లకు జిఎస్‌టి ఆదాయంలో కొరత ఉన్నందున రాష్ట్రాలకు పరిహారం చెల్లించడంలో కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేసిందని వివిధ రాష్ట్రాలు ఫిర్యాదు చేస్తున్నాయి. ఈ తరుణంలో సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. అక్టోబర్ నెలకు గాను బకాయిలు చెల్లించాల్సి ఉంది. సమావేశం తరువాత విలేకరులతో ఢిల్లీ ఆర్థిక […] The post జిఎస్‌టి పరిహారం ఎందుకు ఆపారు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
నిర్మలా సీతారామన్‌ను ప్రశ్నించిన రాష్ట్రాల ఆర్థికమంత్రులు

న్యూఢిల్లీ: జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) పరిహారంతో సహా పలు అంశాలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో రాష్ట్ర ఆర్థిక మంత్రులు సమావేశమై చర్చించారు. ఆగస్టు- సెప్టెంబర్‌లకు జిఎస్‌టి ఆదాయంలో కొరత ఉన్నందున రాష్ట్రాలకు పరిహారం చెల్లించడంలో కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేసిందని వివిధ రాష్ట్రాలు ఫిర్యాదు చేస్తున్నాయి. ఈ తరుణంలో సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. అక్టోబర్ నెలకు గాను బకాయిలు చెల్లించాల్సి ఉంది. సమావేశం తరువాత విలేకరులతో ఢిల్లీ ఆర్థిక మంత్రి మానీష్ సిసోడియా మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశంలో రాష్ట్రాల జిఎస్‌టి పరిహారాన్ని కేంద్రం ఎందుకు ఆపిందో అనే విషయమై చర్చించామని అన్నారు. ఇటువంటి పరిస్థితులలో రాష్ట్రాలు తన ఖర్చులను భరించడం కష్టమవుతోందని సిసోడియా అన్నారు.

ఈ సమస్య త్వరలోనే పరిష్కరిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి రాష్ట్రాలకు హామీ ఇచ్చారని, ఈ విషయంలో ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నారని ఆయన అన్నారు. 4,100 కోట్ల రూపాయల జిఎస్‌టి పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వ కేంద్రం విడుదల చేయలేదని రాష్ట్రం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందని పంజాబ్ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ ఇప్పటికే చెప్పారు. నవంబర్ 20న కేరళ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్ అనే ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. మొదటి ఐదేళ్ళ(2022 వరకు)లో 14 శాతం (బేస్ ఇయర్ 2015-16) లోపు ఆదాయ కొరత ఉంటే జిఎస్‌టి చట్టం ప్రకారం రాష్ట్రాలకు పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తుంది. ఏప్రిల్-నవంబర్ కాలంలో కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం పరిహార సెస్‌లో కేంద్ర ప్రభుత్వం కేవలం 64,000 రూపాయలు వసూలు చేసింది. ఏప్రిల్-జూలైలో ప్రభుత్వం దాదాపు 48,000 కోట్ల రూపాయలను పంపిణీ చేసింది. ఆగస్టు-సెప్టెంబర్ వరకు రాష్ట్రాలకు ఇంకా రూ.18,784 కోట్లు చెల్లించలేదు.

ఉల్లి ధరలకు చెక్ పెట్టేందుకు చర్యలు

రోజు రోజుకీ పెరుగుతున్న ఉల్లి ధరలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పార్లమెంట్‌లో ఆర్థిమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈజిప్టు, టర్కీ నుంచి దిగుమతులతో ఉల్లి ధరల్లో పెరుగుదల విషయమైన చర్యలు చేపడుతున్నామని అన్నారు.

States step up pressure on Centre to clear GST

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జిఎస్‌టి పరిహారం ఎందుకు ఆపారు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: