ఆల్ఫాబెట్ సిఇఒగా సుందర్ పిచాయ్

మాతృ సంస్థ నుంచి వ్యవస్థాపకులు రాజీనామా వాషింగ్టన్: గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్(47) గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సిఇఒ అయ్యారు. ఇంటర్నెట్ దిగ్గజం ఆల్ఫాబెట్ వ్యవస్థాపకులు లారీ ఫేజ్, సెర్గీ బ్రిన్‌లు తమ ఎగ్జిక్యూటివ్ పదవులకు రాజీనామా చేసిన నేపథ్యంలో పిచాయ్‌కు ఈ స్థానం వరించింది. దీంతో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కార్పొరేట్ నాయకుల్లో ఒకరిగా భారత సంతతికి చెందిన నిపుణుడు స్థానం దక్కించుకున్నట్లైంది. గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ (46) ఆల్ఫాబెట్ సిఇఒ […] The post ఆల్ఫాబెట్ సిఇఒగా సుందర్ పిచాయ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
మాతృ సంస్థ నుంచి వ్యవస్థాపకులు రాజీనామా

వాషింగ్టన్: గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్(47) గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సిఇఒ అయ్యారు. ఇంటర్నెట్ దిగ్గజం ఆల్ఫాబెట్ వ్యవస్థాపకులు లారీ ఫేజ్, సెర్గీ బ్రిన్‌లు తమ ఎగ్జిక్యూటివ్ పదవులకు రాజీనామా చేసిన నేపథ్యంలో పిచాయ్‌కు ఈ స్థానం వరించింది. దీంతో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కార్పొరేట్ నాయకుల్లో ఒకరిగా భారత సంతతికి చెందిన నిపుణుడు స్థానం దక్కించుకున్నట్లైంది. గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ (46) ఆల్ఫాబెట్ సిఇఒ పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో పిచాయ్‌కు ఈ బాధ్యత అప్పగించారు. రెండో సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్(46) కూడా ఆల్ఫాబెట్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. సంస్థలో అధ్యక్ష పదవి ఇప్పుడు రద్దు చేశారు. పేజ్, బ్రిన్ ఈ నిర్ణయాలను బ్లాగ్ పోస్ట్ ద్వారా మంగళవారం ప్రకటించారు. పిచాయ్ వారిద్దరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Sundar Pichai as CEO of Alphabet

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆల్ఫాబెట్ సిఇఒగా సుందర్ పిచాయ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: