నువ్వుల నూనెతో కేశ సంరక్షణ

  జుట్టు ఊడిపోవడం, పొడిబారిపోవడం, చిట్లిపోవడం, చుండ్రు రావడం, చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు రావడం.. ఇలాంటి సమస్యలతో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. జుట్టు బలంగా వుండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కేశాల కుదుళ్లు దృఢంగా ఉండటం ముఖ్యం. వంటల్లోనే కాదు సౌందర్యానికీ నువ్వుల నూనెను ఉపయోగించవచ్చు. ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు, మినరల్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. నువ్వుల నూనె వెంట్రుకలకు సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.నువ్వుల నూనె మంచి హెయిర్ […] The post నువ్వుల నూనెతో కేశ సంరక్షణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జుట్టు ఊడిపోవడం, పొడిబారిపోవడం, చిట్లిపోవడం, చుండ్రు రావడం, చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు రావడం.. ఇలాంటి సమస్యలతో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. జుట్టు బలంగా వుండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కేశాల కుదుళ్లు దృఢంగా ఉండటం ముఖ్యం.

వంటల్లోనే కాదు సౌందర్యానికీ నువ్వుల నూనెను ఉపయోగించవచ్చు. ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు, మినరల్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. నువ్వుల నూనె వెంట్రుకలకు సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.నువ్వుల నూనె మంచి హెయిర్ కండిషనర్‌గా పనిచేస్తుంది. వెంట్రుకలు చిట్లిపోవడాన్ని నిరోధించి, జీవం కోల్పోయిన వెంట్రుకలను ఆరోగ్యంగా చేస్తుంది. నూరి ముద్ద చేసుకున్న సగం కప్పు నువ్వులకు రెండు టేబుల్ స్పూన్ల యోగర్ట్, టేబుల్ స్పూన్ తేనె కలిపి, ఆ మిశ్రమాన్ని వెంట్రుకలకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత షాంపూతో కడిగేస్తే జుట్టు జీవత్వంతో మెరిసిపోతుంది. జుట్టు రాలడాన్ని నువ్వుల నూనె నివారిస్తుంది.

ఇందులోని ఒమేగా-3, ఒమేగా-6, ఒమేగా-9 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు వెంట్రుకల కుదుళ్లకు కావాల్సిన పోషణనిస్తాయి. కుదుళ్లను బలంగా చేస్తాయి. సగం కప్పు వేడిచేసిన నువ్వుల నూనెను తలకు పట్టించి, మసాజ్ చేయాలి. రాత్రంతా అలాగే ఉంచి, ఉదయాన్నే షాంపూతో కడగాలి. నువ్వుల నూనెలో యాంటీ ఫంగల్, వాపు తగ్గించే గుణాలు ఉంటాయి. నువ్వుల నూనె రాసుకుంటే మాడు మీది కురుపులు పోయి, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనెకు, టేబుల్ స్పూను కలబంద గుజ్జు కలపాలి. ఈ మిశ్రమాన్ని నెత్తికి పట్టించి, మసాజ్ చేయాలి. ఆరిన తర్వాత షాంపూతో కడిగేసుకోవాలి.

Hair care with sesame oil

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నువ్వుల నూనెతో కేశ సంరక్షణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: