ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి!

  మహిళలకు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపాలని చెబుతున్నారు నిపుణులు. పని ఒత్తిడిలో పోషకాహారం, సరైన నిద్ర, విశ్రాంతి తీసుకోకుండా చేసే పనుల వల్ల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఇలా అశ్రద్ధ చేస్తూ పోతే జబ్బున పడటం ఖాయం. ప్రపంచవ్యాప్తంగా జరిపిన కొన్ని పరిశోధన ప్రకారం పురుషుల కంటే మహిళలు త్వరగా మరణిస్తారని నిర్ధారించారు. ప్రపంచంలో రెండు మిలియన్ల కంటే ఎక్కువమంది మహిళలు బ్రెస్ట్ ఓవేరియన్ కేన్సర్‌తో పోరాడుతున్నట్లు సర్వేలో తెలుస్తోంది. కొంతకాలం నుంచి మహిళలు ఎక్కువగా […] The post ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మహిళలకు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపాలని చెబుతున్నారు నిపుణులు. పని ఒత్తిడిలో పోషకాహారం, సరైన నిద్ర, విశ్రాంతి తీసుకోకుండా చేసే పనుల వల్ల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఇలా అశ్రద్ధ చేస్తూ పోతే జబ్బున పడటం ఖాయం. ప్రపంచవ్యాప్తంగా జరిపిన కొన్ని పరిశోధన ప్రకారం పురుషుల కంటే మహిళలు త్వరగా మరణిస్తారని నిర్ధారించారు.

ప్రపంచంలో రెండు మిలియన్ల కంటే ఎక్కువమంది మహిళలు బ్రెస్ట్ ఓవేరియన్ కేన్సర్‌తో పోరాడుతున్నట్లు సర్వేలో తెలుస్తోంది. కొంతకాలం నుంచి మహిళలు ఎక్కువగా డయాబెటిస్‌కు గురవుతున్నారు. నిర్లక్షం వల్ల అది ప్రాణాంతకంగా మారుతోంది. అనీమియా కూడా మరణానికి కారణమౌతోంది. ఇలాంటి ప్రాణాంతకమైన వ్యాధులకు అనేక ట్రీట్‌మెంట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వ్యాధులను ప్రారంభ దశలో కనుగొన్నప్పుడే ఉపయోగం వుంటుందని అంటున్నారు వైద్యులు.
ప్రతి మహిళా నెలకోసారి వైద్యులను సంప్రదించి మెడికల్ టెస్టులు చేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. అవసరమైతే ప్రారంభంలోనే చికిత్స తీసుకోవచ్చు. 25ఏళ్ళు దాటినప్పటి నుంచి మహిళలు వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఎంత బిజీగా ఉన్నా ఎంతోకొంత సమయాన్ని తమ ఆరోగ్యం కోసం సమయాన్ని కేటాయించాలి.

మహిళల్లో ఎక్కువగా వచ్చే ప్రాణాంతకమైన జబ్బుల బారినపడుతున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి.
అవేంటో చూద్దాం…

1. గుండెకు సంబంధించిన జబ్బులు: మహిళల్లో 38శాతం మంది మొదటి హార్ట్ అటాక్ సమయంలోనే మరణిస్తున్నట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ధూమపానం అలవాటు ఉన్న మహిళల్లో హార్ట్‌లో బ్లాక్స్ ఏర్పడి తద్వారా హార్ట్ అటాక్, గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నట్లు తెలుస్తోంది.
2. బ్రెస్ట్ కేన్సర్: మహిళలు 35సంవత్సరాల తర్వాత మామోగ్రామ్ టెస్టును తప్పకుండా చేయించుకోవాలి. దీనివల్ల రొమ్ము ఆరోగ్యంగా ఉందా లేదా అనే విషయం తెలుస్తుంది. 23ఏళ్ళతర్వాత ప్రతి ఒక్క మహిళ సెల్ఫ్ చెకప్ చేసుకోవడం చాలా అవసరం. దీని వల్ల బ్రెస్ట్‌లో ఏర్పడే అసాధారణ కణుతులను గుర్తించినట్లయితే అది బ్రెస్ట్ కేన్సర్‌కు ప్రారంభ చిహ్నంగా భావించాలి. తగిన చికిత్సలు తీసుకోవాలి.
3. సర్వైకల్ కేన్సర్: సర్విక్స్‌లోని కణాల్లో కేన్సర్ కణుతులు ఏర్పడతాయి. మహిళలు మల్టిపుల్ సెక్సువల్ సంబంధాల్ని కలిగి ఉండటం సర్వైకల్ కేన్సర్ రావడానికి కారణం. ఈ జబ్బుకు ఎలాంటి లక్షణాలుండవు. కేన్సర్ పూర్తిగా శరీరంలో చేరాక తర్వాత లక్షణాలు కనబడతాయి.
4 ఓవేరియన్ కేన్సర్: ఈ కేన్సర్ ఓవరీస్‌లో వస్తుంది. మహిళల్లో వచ్చే అత్యంత ముఖ్యమైన కేన్సర్ ఇది. ప్రపంచంలో కొన్ని మిలియన్ల సంఖ్యలో మహిళలు ఈ కేన్సర్ బారిన పడుతున్నారు. ఓవేరియన్ కేన్సర్‌కు ప్రారంభ చిహ్నాలేవీ లేవు. అందువల్ల ముందుగానే గుర్తించడం కొంచెం కష్టమే.
5 కుంగుబాటు: ఇంట్లో, బయటా ఉండే ఒత్తిడుల వల్ల చాలా మంది మహిళలు కుంగుబాటుకు లోనవుతున్నారు. దీంతో కొంతమంది మహిళలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కుటుంబ సభ్యుల సహకారం లేకపోవడం కుంగుబాటుకు ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు.
6 మధుమేహం: మహిళల్లో 28ఏళ్ల తర్వాత టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. ఉరుకుల పరుగుల జీవనం, పోషకాహార లోపం, వ్యాయామం లేకపోవడం, నిద్ర లేమి ..ఇలాంటి జీవన శైలి వల్ల మధుమేహంబారిన పడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.
7 మూత్రపిండాల సమస్య అధికం: అధిక రక్తపోటు, గుండెకు సంబంధించిన సమస్యలు ప్రతి కుటుంబంలో ఒక్కరికైనా ఉంటున్నాయి. మహిళల్లో కిడ్నీ వ్యాధులు సాధారణంగా మారాయి.
ఈ సమస్యను ప్రారంభ దశలోనే తెలుసుకుంటే మంచిది.
8 రక్తహీనత: ప్రతి ముగ్గురిలో ఒకరు ఉండాల్సిన బరువు కంటే తక్కువగా లేదా అధికంగా ఉండటం కూడా అనీమియాకు కారణం అవుతుంది. ఈ సమస్య గర్భవతుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. రక్తహీనతకు చెక్ పెట్టే ఆహారాన్ని వైద్యుల సలహాతో తీసుకోవడం వల్ల సమస్యనుంచి బయటపడొచ్చు. వీటన్నింటి నుంచీ బయటపడాలంటే తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ, ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించాలని సూచిస్తునారు వైద్యనిపుణులు.

Health Checkups are mandatory for women

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: