గాలి మాత్రమే సరిపోతుంది

  సాధారణంగా మొక్కలు పెంచుకోవాలంటే వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చక్కని గాలి వెలుతురు ఉండేలా చూస్తూ, ప్రతిరోజూ వాటికి నీళ్లు పోయాలి. రెండు రోజులు ఊరెళ్లాలన్నా వాటికి నీళ్లెలా అని సతమతమౌతుంటాం. కొన్ని మొక్కలకైతే నీళ్లు అవసరం లేకుండానే గాలి ఉంటేచాలు. గాలిని భోంచేస్తాయివి. ఇవి గాలిలో తేమ, పోషకాలు పీల్చుకొని బతుకుతాయి. అటువంటి మొక్కలే తిల్లాండ్సియా. చిన్న చిన్న వేళ్ళు, చిన్న ఆకులతో నీలం, గులాబీ, పసుపు రంగు పూలతో వుంటాయి. కాక్టస్ రకాలుగా […] The post గాలి మాత్రమే సరిపోతుంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సాధారణంగా మొక్కలు పెంచుకోవాలంటే వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చక్కని గాలి వెలుతురు ఉండేలా చూస్తూ, ప్రతిరోజూ వాటికి నీళ్లు పోయాలి. రెండు రోజులు ఊరెళ్లాలన్నా వాటికి నీళ్లెలా అని సతమతమౌతుంటాం. కొన్ని మొక్కలకైతే నీళ్లు అవసరం లేకుండానే గాలి ఉంటేచాలు. గాలిని భోంచేస్తాయివి. ఇవి గాలిలో తేమ, పోషకాలు పీల్చుకొని బతుకుతాయి. అటువంటి మొక్కలే తిల్లాండ్సియా.

చిన్న చిన్న వేళ్ళు, చిన్న ఆకులతో నీలం, గులాబీ, పసుపు రంగు పూలతో వుంటాయి. కాక్టస్ రకాలుగా కనిపించే వీటిని హ్యాంగింగ్ ప్లాంట్లుగా పెంచుతాయి. ఖాళీగా ఉండే బట్టీల్లో లేదా వేలాడేవాటిని పెంచుకోవచ్చు. మొక్కను తెచ్చుకొని కాసేపు నీళ్ళలో తడిపి ఉంచి, ఆ నీళ్ళు బాగా ఆరిపోయాక ఎక్కడ పెట్టి పెంచాలనుకున్నామో అక్కడ పెట్టేస్తే చాలు. గాలి, వెలుతురు తగిలితే చాలు ఈ మొక్కలు చక్కగా ఎదుగుతాయి. అపుడపుడు కాసిని నీళ్ళు చిలకరిస్తే చాలు.

Tillandsia are the only living plants with air

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గాలి మాత్రమే సరిపోతుంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: