ఎవరిదీ పాపం

  వాళ్లు మగాళ్ళు కాదు క్రూర మృగాలు రక్తానికి మరిగిన పిశాచులు మగాళ్ళ రూపంలో ఉన్న యమకింకరులు ప్రియాంకను ఘోరంగా హత్య చేసిన పరమ కిరాతకులు జనారణ్యంలో ముసుగులు వేసుకుని తిరుగుతున్న మృగాలు ఆడపిల్ల కనిపిస్తే చాలు ఉన్మాదంతో రెచ్చిపోయి ఊగిపోతున్నారు స్త్రీలు ఒంటరిగా కనిపిస్తే చాలు కసితీరా కాటేస్తున్న రు ఎంతకాలం ఇంకెంతకాలం ఈ ఘోర కలి కాలం? ఎవరిదీ పాపం? ఈ వికృత కేలి ఒళ్లు గగుర్పొడిచే రీతిలో దహనం వంచన చేసి మృగాల […] The post ఎవరిదీ పాపం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వాళ్లు మగాళ్ళు కాదు
క్రూర మృగాలు
రక్తానికి మరిగిన పిశాచులు
మగాళ్ళ రూపంలో ఉన్న యమకింకరులు
ప్రియాంకను ఘోరంగా హత్య చేసిన పరమ కిరాతకులు
జనారణ్యంలో ముసుగులు వేసుకుని తిరుగుతున్న మృగాలు
ఆడపిల్ల కనిపిస్తే చాలు
ఉన్మాదంతో రెచ్చిపోయి ఊగిపోతున్నారు
స్త్రీలు ఒంటరిగా కనిపిస్తే చాలు
కసితీరా కాటేస్తున్న రు
ఎంతకాలం ఇంకెంతకాలం
ఈ ఘోర కలి కాలం?
ఎవరిదీ పాపం?
ఈ వికృత కేలి
ఒళ్లు గగుర్పొడిచే రీతిలో దహనం
వంచన చేసి మృగాల బారినుండి
అమ్మలు మోసపోకుండా
ఎలా కాపాడుకోగలం
సభ్యసమాజం తలదించుకునేలా
తనమీద పడే పెట్రోల్ కూడా
సిగ్గు పడుతుంది రా
మగ జాతి కె కళంకం తెచ్చిరి కదా!
అందరం మనం అందరం
బాధ్యత వహించాలి
మహిళ కేది రక్షణ?
ఆ మూర్ఖులను ముమ్మాటికీ వదలొద్దు
ఎన్ కౌంటర్ లో కాల్చి చంపాలి
అప్పుడు అందరి మనసు ప్రశాంతంగా ఉంటుంది

– కోమటి రెడ్డి బుచ్చిరెడ్డి

Telangana girl Manasa found murdered on birthday

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎవరిదీ పాపం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: