ఎల్లలు లేని నవనీత దేవ్‌సేన్ సాహిత్య కృషి

భారత ప్రభుత్వ సర్వోన్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ పురస్కారాన్ని 2000 సంవత్సరంలో నవనీత దేవ్‌సేన్ పొందారు. అంతకుముందు సంవత్సరమే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు స్వీకరించారు. 1992లో గౌరీదేవి మెమోరియల్ అవార్డు, మహాదేవి వర్మ అవార్డు పొందారు. 1993లో రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ వారి సెల్లి అవార్డు, 1994లో బీహార్‌లోని భాగల్పూర్ విశ్వవిద్యాలయం శరత్ పురస్కారాన్ని అందజే సింది. రవీంద్ర పురస్కార్, కబీర్ సమ్మాన్, సంస ్కృతీ అవార్డు, కమల్ కుమారీ జాతీయ పురస్కా రాలను 2004లో […] The post ఎల్లలు లేని నవనీత దేవ్‌సేన్ సాహిత్య కృషి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.


భారత ప్రభుత్వ సర్వోన్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ పురస్కారాన్ని 2000 సంవత్సరంలో నవనీత దేవ్‌సేన్ పొందారు. అంతకుముందు సంవత్సరమే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు స్వీకరించారు. 1992లో గౌరీదేవి మెమోరియల్ అవార్డు, మహాదేవి వర్మ అవార్డు పొందారు. 1993లో రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ వారి సెల్లి అవార్డు, 1994లో బీహార్‌లోని భాగల్పూర్ విశ్వవిద్యాలయం శరత్ పురస్కారాన్ని అందజే సింది. రవీంద్ర పురస్కార్, కబీర్ సమ్మాన్, సంస ్కృతీ అవార్డు, కమల్ కుమారీ జాతీయ పురస్కా రాలను 2004లో పొందారు. 2017లో కళింగ సాహిత్య పురస్కా రాన్ని స్వీకరించారు. బాల సాహిత్య సృజనకు బిగ్ లిటిల్ బుక్ పురస్కారాన్ని 2017లో పొందారు.

ఒక నోబెల్ పురస్కార గ్రహీత ఆమెకు పేరు పెట్టారు. మరో నోబెల్ పురస్కార గ్రహీతకు ఆమె సహధర్మచారిణి అయ్యారు. సాహిత్య సృజనకారులైన దంపతుల వారసురాలిగా జన్మించిన ఆ చిన్నారే పెరిగి పెద్దయ్యాక భాషా సాహిత్య రంగాల్లో నిరుపమానమైన ఖ్యాతి సముపార్జించారు. పలు భారతీయ, పాశ్చాత్య భాషల్లో ప్రావీణ్యం పొందారు. తులనాత్మక సాహిత్యంలో డాక్టరేట్ పొంది, భారతీయ సాహిత్యానికి అంతర్జాతీయ సాహిత్యానికి లంకెగా నిలిచారు. కవిత్వం, కథానికలు, నవలలు, నాటకాలు, విమర్శనాగ్రంథాలు, యాత్రా సాహిత్యం, అనువాదాలతో బెంగాలీ సాహిత్యంలో ఉత్కృష్ట స్థానం పొందారు. పద్మశ్రీ పురస్కారం స్వీకరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కృతులయ్యారు. ఆ మహిళా సృజన మూర్తి ఇటీవల మృతి చెందిన నవనీత దేవ్ సేన్.

సాహితీవేత్తల కుటుంబంలో 1938 జనవరి 13న నవనీత జన్మించారు. ఆమె తండ్రి నరేంద్రదేవ్ సుప్రసిద్ధ విమర్శకులు. ఉమర్ ఖయ్యాం రుబాయిలను ఆయన అనువదించారు. ఆమె తల్లి రాధారాణి దేవి కవయిత్రిగా పేరుపొందారు. ‘అపరాజిత’ అనే పేరుతో పలు రచనలు చేశారు. నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ సైతం సాహిత్యంలో అపరాజిత ప్రతిభకు అచ్చెరువొందేవారని చెప్తారు. నవనీతకు ఆ పేరును ఆయనే పెట్టారు. చిన్ననాటి నుండే నవనీత చదువులోనూ ఆటపాటల్లోనూ అద్వితీయురాలిగా నిలిచారు. పాఠశాల విద్యాభ్యాస దశలోనే పలు క్రీడల్లో రాణించారు. జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్ ఆడేవారు. అంతర్ పాఠశాలల క్రీడాపోటీల్లోనూ పాల్గొన్నారు. ఆ దశలోనే రచనలు చేయడం కూడా ప్రారంభించారు.

తొలి దశలో గోఖలే మెమోరియల్ బాలికల పాఠశాలలో, లేడీ బ్రబోర్న్ కళాశాలలో చదువుకున్న నవనీత కోల్‌కత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో ఆంగ్లంలో డిగ్రీ పొందారు. జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో తులనాత్మక సాహిత్యంలో ఎమ్మే తొలి బ్యాచ్ విద్యార్థినిగా చేరి, 1958లో పి.జి. పూర్తిచేశారు.ఆ కోర్సులో ఆమె ప్రథమురాలిగా నిలిచారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి 1961లో రెండోసారి ఎమ్మే చేశారు. ఇండియానా విశ్వవిద్యాలయం నుండి 1964లో తులనాత్మక సాహిత్యంలో డాక్టరేటు పొందారు. బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టరల్ రీసెర్చి చేశారు. విశ్వవిఖ్యాత ఆర్థికవేత్త అమర్త్యసేన్‌ను నవనీత 1959లో వివాహం చేసుకున్నారు. నవనీత చదువుకున్న జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలోనే అమర్త్యసేన్ ఉపన్యాసకులుగా పనిచేసేవారు. అనంతర కాలంలో నోబెల్ పురస్కారం పొందారు. ఆ దంపతుల మధ్య విభేదాలు రావడంతో 1974లో ఇద్దరు పిల్లలను తీసుకుని కోల్‌కతాకు వచ్చేశారు నవనీత. 1976లో ఆ దంపతులు విడాకులు తీసుకున్నారు.

నవనీత దేవ్ సేన్ పలు భాషల్లో నిష్ణాతురాలు. బెంగాలీ, ఆంగ్లంతో పాటు హిందీ, ఒరియా, అస్సామీస్, ఫ్రెంచి, జర్మన్, గ్రీకు, సంస్కృతం, హీబ్రూ భాషల్లో ఆమె ప్రావీణ్యం పొందారు. బాల్యంలోనే కలం పట్టిన నవనీత వివిధ ప్రక్రియల్లో పలు రచనలు చేశారు. కవిత్వం, కథానికలు, నవలలు, నాటకాలు, విమర్శనాగ్రంథాలు, యాత్రా సాహిత్యం, అనువాదాలను వెలువరించారు. ఆయా ప్రక్రియల్లో 80కి పైగా గ్రంథాలను ఆమె రచించారు. తొలి కవితాసంపుటి ‘ప్రథవ్‌ు ప్రత్యయ్’ను 21 సంవత్సరాల వయస్సులో 1959లో వెలువరించిన నవనీత అనంతరం రెండో కవితాసంపుటి ‘స్వాగతో దేబ్‌దూత్’ను మరో పుష్కర కాలం తర్వాత ప్రచురించారు. నక్సలైట్ ఉద్యమంలో ఎగువ మధ్యతరగతి మేధావుల పాత్రపై ఆమె రచించిన తొలి నవల ‘అమీ అనుపవ్‌ు’ 1976లో వెలువడింది. అనంతరం వివిధ సామాజిక, ఆర్థిక సమస్యలను సృ్పశిస్తూ ఆమె నవలారచన చేశారు. ఉమ్మడి కుటుంబాలు విడిపోవడం, వృద్ధాశ్రమాల్లో జీవితం, ెమో సెక్సువాలిటీ, ఎయిడ్స్ మొదలైన అంశాలను కేంద్ర బిందువులుగా చేసుకుని పలు నవలలను ఆమె రచించారు.

నవనీత రాసిన తొలి కథానికా సంపుటి ‘మాన్సూర్ హులోర్ హాలీడే’ 1980లో వెలువడింది. 1983లో ‘నటీ నబనీత’ అనే పేరుతో వ్యాస సంపుటిని కూడా ఆమె ప్రచురించారు. కుంభమేళాకు వెళ్లే ఒంటరి మహిళ జీవిత చిత్రణ ఆమె రచన ‘కరుణా తోమర్ కోన్ పాత్ దియే’లో కనిపిస్తుంది. ఈశాన్య భారతంతో పాటు టిబెట్‌లో తన యాత్రా విశేషాలతో కూడిన యాత్రా చరిత్ర గ్రంథం ‘ట్రక్ బెనే మాక్ మెనే’ 1977లో వెలువరించారు. ‘బామా బోధిని’, ‘శ్రేష్ట కబిత’, ‘సీతా తేకే సూరు’ మొదలైన రచనలు ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి. 2014లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సుజిత్ ముఖర్జీ స్మారకోపన్యాసం చేశారు నవనీత. “భారతదేశం విభిన్న భాషల సమాహారం. భారతీయతను గుర్తించే ప్రాథమిక సాధనం అనువాదం” అని ఆ ఉపన్యాసంలో పేర్కొన్న నవనీత ఆ సూత్రాన్ని తన రచనల్లోనూ కొనసాగించారు. మహిళల కోణంలో రామాయణాన్ని ఆమె వ్యాప్తిలోకి తెచ్చారు.

రామాయణాన్ని 16వ శతాబ్దానికి చెందిన కవయిత్రి చంద్రవతి పునర్వచించిన తీరుపై ఆమె పరిశోధనలు చేశారు. తెలుగు, బెంగాలీ, మైథిలి, మరాఠీ భాషల్లో రామాయణం పాటలపై ఆమె పరిశోధించారు. పలు విశ్వవిద్యాలయాల్లో తులనాత్మక సాహిత్యంలోని వివిధ అంశాలపై ఆమె ప్రసంగించారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో రాధాకృష్ణన్ మెమోరియల్ ప్రసంగాలను ఒక పరంపరగా 199697 సంవత్సరాల్లో ఆమె చేపట్టారు. అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ, కెనడా దేశాల్లో ఉన్న హార్వర్డ్, కార్నెల్, కొలంబియా, చికాగో, హంబోల్ట్, రంటో, బ్రిటిష్ కొలంబియా, మెల్‌బోర్న్, న్యూ సౌత్‌వేల్స్ తదితర విశ్వవిద్యాలయాల్లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా వ్యవహరించారు. పలు అంతర్జాతీయ సదస్సుల్లో ఆమె పాల్గొన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ కంపారిటివ్ లిటరేచర్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సెమియాటిక్ అండ్ స్ట్రక్చరల్ స్టడీస్ మొదలైన విద్యాసంస్థల్లో ఆమె కీలకపాత్ర పోషించారు. మాక్‌మిల్లన్ సంస్థ వారి ఆధునిక భారతీయ నవలల ఆంగ్ల అనువాద పరంపరకు బెంగాలీ చీఫ్ ఎడిటర్‌గా నవనీత వ్యవహరించారు. బెంగాలీ సాహిత్య పరిషత్తుకు ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ రచయిత్రుల సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షురాలిగా, భారతీయ తులనాత్మక సాహిత్య సంస్థకు వ్యవస్థాపక కార్యదర్శిగా వ్యవహరించారు. రాయల్ ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్‌కు ఫెల్లోగా ఉన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ బెంగాలీ సలహామండలి సభ్యురాలిగా 1978 నుండి 1982 వరకు వ్యవహరించారు. భారతీయ జ్ఞానపీఠ భాషా సలహామండలి కన్వీనర్‌గా 1975 నుండి 1990 వరకు ఉన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయాల నిధుల సంఘం సీనియర్ ఫెల్లోగా వ్యవహరించారు.

కోల్‌కతాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయ తులనాత్మక సాహిత్య శాఖలో ఆచార్యురాలిగా 2002లో ఉద్యోగవిరమణ చేశారు. ఆ తర్వాతి ఏడాది నుండి మూడేళ్లపాటు న్యూఢిల్లీలోని సెంటర్ ఆఫ్ ఉమెన్ డెవలప్‌మెంట్ స్టడీస్‌లో జె.పి.నాయక్ డిస్టింగ్విష్డ్ ఫెల్లోగా వ్యవహరించారు. బెంగాలీ సాహిత్యంలో విశేష కృషి చేసిన నవనీతను పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. భారత ప్రభుత్వ సర్వోన్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ పురస్కారాన్ని 2000 సంవత్సరంలో నవనీత దేవ్ సేన్ పొందారు. అంతకు ముందు సంవత్సరమే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ఆమె స్వీకరించారు. 1992లో గౌరీదేవి మెమోరియల్ అవార్డు, మహాదేవి వర్మ అవార్డు పొందారు. రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ వారి సెల్లి అవార్డును 1993లో స్వీకరించారు. బీహార్‌లోని భాగల్పూర్ విశ్వవిద్యాలయం శరత్ పురస్కారాన్ని 1994లో అందజేసింది. రవీంద్ర పురస్కార్, కబీర్ సమ్మాన్, సంస్కృతీ అవార్డు, కమల్ కుమారీ జాతీయ పురస్కారాలను 2004లో పొందారు. 2017లో కళింగ సాహిత్య పురస్కారాన్ని స్వీకరించారు. బాల సాహిత్య సృజనకు బిగ్ లిటిల్ బుక్ పురస్కారాన్ని 2017లో పొందారు.

ఒక సందర్భంలో అమెరికాకు వెళ్లే నవనీతను కస్టవ్‌‌సు అధికారులు విమానాశ్రయంలో నిలిపివేశారట. కారణం ఆమెతో పాటు రసగుల్లాలను తీసుకెళ్లడమే. దాంతో విమానాశ్రయంలో కింద కూర్చుని ఆ రసగుల్లాలను తినేశారట నవనీత. “రసగుల్లాలు నాతో పాటు అమెరికాలోకి ప్రవేశించలేకపోతే నాలో ఉండి అమెరికాలోకి ప్రవేశిస్తాయి” అని ఆమె అన్నారట. ఆమె అప్పటికే మధుమేహ వ్యాధిగ్రస్తురాలు కావడం వల్ల అంబులెన్స్‌లను రెడీగా ఉంచమని అధికారులతో చెప్పారట. సున్నితమైన రాజకీయ, సామాజిక, మానసిక అంశాలకు వ్యంగ్యాన్ని, హాస్యాన్ని కలగలిపి అందించడం నవనీత దేవ్ సేన్ రచనాశైలి. నవంబరు 7వ తేదీన క్యాన్సర్‌తో మరణించిన నవనీత దేవ్‌సేన్ చివరి దశ వరకూ రచనలు చేస్తూనే ఉన్నారు. సుకుమార్ రాయ్ రాసినకవితను ఉదాహరిస్తూ ‘ఆల్ రైట్! కవ్‌ు అండ్ ఫైట్’ అని క్యాన్సర్‌నే సవాలు చేసిన ధీరవనిత నవనీత. సాహిత్య, విద్యా రంగాల్లో ఆమె కృషి ఎల్లలు లేనిది.

Article about Nabaneeta Dev Sen life story

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎల్లలు లేని నవనీత దేవ్‌సేన్ సాహిత్య కృషి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: