ఎవరిది నేరం..!

  నేరం ఎవరిది? గ్రామ స్వరాజ్యంకై కలలు గన్న గాంధీదా మానవత్వానికి రూపం తెలియని ఘాడ్సేదా తెలంగాణలో ఒంటరిగా తిరగొచ్చనుకున్న ఆడపిల్లదా ఆడపిల్లంటే అమ్మ రూపం అనుకోని అథములదా నేరం ఎవరిది? నేరమంటే తప్పు అనుకోని మనిషి రూప జంతువులదా మనిషిని జంతువుగా మారుస్తున్న పరిస్థితులదా నేర ప్రవృత్తిని పెంచి పోషిస్తున్న సమాజానిదా మాతృ స్వామ్యాన్ని అణచిన పితృస్వామ్య ఆధిపత్యానిదా నేరం ఎవరిది? నమ్మితే కమ్మేసే వారిదా కన్న ప్రేమ పంచే వారిదా వలచి వెంట వచ్చే […] The post ఎవరిది నేరం..! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నేరం ఎవరిది?
గ్రామ స్వరాజ్యంకై
కలలు గన్న గాంధీదా
మానవత్వానికి రూపం
తెలియని ఘాడ్సేదా
తెలంగాణలో ఒంటరిగా
తిరగొచ్చనుకున్న ఆడపిల్లదా
ఆడపిల్లంటే అమ్మ రూపం
అనుకోని అథములదా
నేరం ఎవరిది?
నేరమంటే తప్పు అనుకోని
మనిషి రూప జంతువులదా
మనిషిని జంతువుగా
మారుస్తున్న పరిస్థితులదా
నేర ప్రవృత్తిని పెంచి
పోషిస్తున్న సమాజానిదా
మాతృ స్వామ్యాన్ని అణచిన
పితృస్వామ్య ఆధిపత్యానిదా
నేరం ఎవరిది?
నమ్మితే కమ్మేసే వారిదా
కన్న ప్రేమ పంచే వారిదా
వలచి వెంట వచ్చే వారిదా
తామవారని తలచిన వారిదా
వెలుగు వెంటున్న చీకటిదా
చీకట్లో కలిసిన వెలుతురుదా
జరుగుతున్న ఆకృత్యాలకు
సాక్షీభూతమైన పంచభూతాలదా
నేరం ఎవరిది?
మనం పీల్చే గాలిదా
మనం తాగే నీటిదా
ప్రకృతి అందించిన ఫలాలదా
వికృతి హాలాహలానిదా
అబలని అసహాయగా..
ఊహించుకుంటున్న నికృష్టులదా
నీతిని నేర్పని విద్యదా

భీతిని నేర్వని జాతిదా
నేరం ఎవరిది?
దుర్మార్గపు దృష్టిదీ
చిత్త కార్తె కుక్కలదీ
అచ్చోసిన ఆంబోతులదీ
ప్రేమ ముసుగు లొసుగులదీ
మానవత్వం మాటునుండిన..
దానవత్వపు దాష్టికాలదీ
ఆధిపత్య ధోరణిదీ
ఈ నేరం మనందరిదీ కాదా..!!
పాల్వంచ హరికిషన్

Poetry on Dr Priyanka reddy murder case

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎవరిది నేరం..! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: