జంతువును మచ్చిక చేసుకున్న గొల్ల కురుమలు

  గొల్లలు ఎవరు? ఎక్కడినుండి వచ్చారు? గొల్లలలోని రకాలు ఏమిటి? గొల్లల ఆశ్రితులు ఎవరు? వారి జీవన విధానం ఏమిటి? వారి కట్టు, బొట్టు, వారి సాంఘిక ఆచారాలు, వారి దేవతలు, వారి పండుగలు, వారి జాతరలు, వారి కొలుపులు, వారి సాంఘిక దురాచారాలు, వారి మూఢనమ్మకాలు, వారి వస్తు సంస్కృతి, వారి పంచాయితీలు, వారి సామెతలు, వారి జానపద కళారూపాలు, ఇంకా, ఇంకా మరెన్నో విషయాలను విశేషాలతో పరిచయం చేస్తుంది ఈ పుస్తకం. ఈ గ్రంథంలో […] The post జంతువును మచ్చిక చేసుకున్న గొల్ల కురుమలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

గొల్లలు ఎవరు? ఎక్కడినుండి వచ్చారు? గొల్లలలోని రకాలు ఏమిటి? గొల్లల ఆశ్రితులు ఎవరు? వారి జీవన విధానం ఏమిటి? వారి కట్టు, బొట్టు, వారి సాంఘిక ఆచారాలు, వారి దేవతలు, వారి పండుగలు, వారి జాతరలు, వారి కొలుపులు, వారి సాంఘిక దురాచారాలు, వారి మూఢనమ్మకాలు, వారి వస్తు సంస్కృతి, వారి పంచాయితీలు, వారి సామెతలు, వారి జానపద కళారూపాలు, ఇంకా, ఇంకా మరెన్నో విషయాలను విశేషాలతో పరిచయం చేస్తుంది ఈ పుస్తకం. ఈ గ్రంథంలో మానవ నాగరికత ప్రారంభంలో తొలి మానవుడు తన ప్రాథమిక అవసరమైన ఆహారం కోసం జంతువులను వేటాడటం నుండి మచ్చిక చేసుకొని పశుపోషణ వృత్తిని చేపట్టిన క్రమంలో వృత్తియే కులంగా మారడాన్ని గురించి ఈ పుస్తకంలో చర్చించారు.

మనదేశంలో తొలి నాగరికతయైన సింధు నాగరికత మొదలుకొని ఆదునిక కాలం వరకు పశుపోషణ వృత్తిని చేపట్టిన జాతులలో గొల్లలు కాలక్రమేణా మానవ మనుగడకు తోడ్పడిన విషయాలను, వారి ప్రాధాన్యతను వివరించారు. అదేవిధంగా గొల్లల జాతిపరమైన సిద్ధాంతాలను చర్చించారు. వివిధ గ్రంథాల ద్వారా గొల్లలు ఆర్యులా? ద్రవిడులా? లేదా మిశ్రమ జాతికి చెందిన వారా? అనే విషయాలపై కొంతమేరకు ఇచ్చిన వివరణలు పాఠకులను ఆలోచింప చేసేలా ఉన్నాయి. గొల్లల పుట్టుక చారిత్రక నేపథ్యం గురించి వివరిస్తూ భారతదేశ వ్యాప్తంగా విస్తరించిన గొల్లలను వివిధ ప్రాంతాలలో ఏఏ పేర్లతోపిలుస్తారు.

అలాగే వివిధ భాషలలో ఏఏ పేర్లతో పిలుస్తారో రచయిత పేర్కొన్నారు. తెలుగు ప్రాంతంలోని పశువుల కాపరులను గొల్లలు, గొల్ల కురుమలు, యాదవులు అని పిలుస్తారని చెపుతూ, గొల్ల అనే తెలుగు పదం పుట్టుక గురించి వివిధ సాహిత్య గ్రంథాలలో యిచ్చిన వివరణలను క్లుప్తంగా పేరొన్నారు. గొల్లల పుట్టుక గురించి ఇతిహాస కాలంనుండి ఇంగ్లీషు కాలం వరకు వివిధ గ్రంథాలలో రాయబడిన వివరణలను క్రోడీకరించి పొందుపరిచెను. సాహిత్య ఆధారాలే కాకుండా మౌఖిక జానపద కథలలో పేర్కొన్న గొల్లకుల పుట్టుక గురించి గల వర్ణనలను యధావిధంగా పొందుపరిచి వాస్తవికంగా చిత్రీకరించారు.

చరిత్ర చదవని వారు చరిత్ర నిర్మించలేరు అంటారు డా॥ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మనకు స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్ళయినా నేటికీ చరిత్ర పట్ల సృహకాని, ఆసక్తి కానీ లేని జాతులు అనేకం ఉన్నాయి. అలాగే ఆసక్తి ఉన్న జాతుల్లో కూ డా నేటికీ తమ జాతి చరిత్రను సమగ్రంగా రాసుకోలేని వా రూ ఉన్నారు. కొన్ని జాతులైతే తమది కాని పురాణాలను, త మవి కాని వంశ వృక్ష చరిత్రలను, తమకు సంబంధంలేని గొ ప్ప వ్యక్తులను తమవిగా చెప్పుకుంటూ వారి వాస్తవ చరిత్రను నిర్ణక్ష్యం చేస్తున్నారు.

నేడు అందుబాటులో ఉన్న మనదేశ చరిత్ర గంథాల్లో మానవ మనుగడకు, దేశ అభివృద్దికి కృషి చేసిన ఉత్పత్తి కులాల చరిత్రను విస్మరించడం వల్ల ఆయా కులాల చరిత్రలు కనుమరుగైయే దశలో ఉన్నాయి. ఇలాంటి వారిలో అతి ప్రాచీన పశుపోషణ కులానికి చెందిన గొల్లలు ఒకరు. చారిత్రకంగా పరిశీలించినట్లయితే నాగరికత పరిణామ క్రమంలో తొలుత ప్రకృతిని అర్థం చేసుకొని, జంతువులను మచ్చిక చేసుకొని, పశుపోషణ వృత్తిని చేపట్టి మానవ జాతికి మాంసం, పాలు, పాల ఉత్పత్తుల్లాంటి బలమైన ఆహారం అందించి మానవ మనుగడకు దోహదపడిన తొలి మూలవాసులుగా చెప్పవచ్చును.

వీరు బలమైన ఎద్దులను, దున్నలను పెంచి నేలను దున్నడానికి దోహదపడటం వల్లనే వ్యవసాయం బ్రతికి బట్టకట్టింది. వీరు పశుసంరక్షణతోపాటు పశుసంకరణ చేసినవారిలో తొలివారుగా చెప్పవచ్చును. పశువైద్యంలో, నరాలకు చురుకు పెట్టే వైద్యంలో గొప్ప ప్రావీణ్యులు. భౌగోళిక అన్వేషణలో, తొలి సాంకేతిక పరిజ్ఞానంలో వీరు ముందువరుసలో ఉన్నా రు. ఈ విషయాలను బట్టి వీరు ఉత్పత్తి, శ్రమ సంస్కృతికి చెం దిన వారే కాకుండా సుధీర్ఘమైన చరిత్రను కలిగియున్నారని గమనించిన రచయిత డా॥ పోతరవేని తిరుపతి గొల్లకులం ఘనమైన చరిత్ర సంస్కృతికి సంబంధించిన సాహిత్య ఆధారాలు, మౌఖిక ఆధారాలను పరిశోధించి మనముందుంచిన గ్రంథమే “గొల్లల చరిత్ర సంస్కతి”.

“గొల్లల చరిత్ర సంస్కృతి” అనే పుస్తకం తెలుగు ప్రాంతంలోని అతి ప్రాచీన కులాలలో ఒకటైన గొల్లకులంలపై సమగ్ర పరిశోదనకు ప్రతిరూపంగా పేర్కొనవచ్చును. గొల్లల పుట్టుపూర్వోత్తరాలతోపాటు తెలంగాణ సంస్కృతిలో మిళితమైయున్న గొల్లల సంస్కృతి ప్రత్యేకత ఏమిటన్న ప్రశ్నకు సమాధానం గొల్లల చరిత్ర సంస్కృతి అనే గ్రంథంలో లభిస్తుంది. గొల్లలు ఎవరు? ఎక్కడినుండి వచ్చారు? గొల్లలలోని రకాలు ఏమిటి? గొల్లల ఆశ్రితులు ఎవరు? వారి జీవన విధానం ఏమిటి? వారి కట్టు, బొట్టు, వారి సాంఘిక ఆచారాలు, వారి దేవతలు, వారి పండుగలు, వారి జాతరలు, వారి కొలుపులు, వారి సాంఘిక దురాచారాలు, వారి మూఢనమ్మకాలు, వారి వస్తు సంస్కృతి, వారి పంచాయితీలు, వారి సామెతలు, వారి జానపద కళారూపాలు, ఇంకా, ఇంకా మరెన్నో విషయాలను విశేషాలతో పరిచయం చేస్తుంది ఈ పుస్తకం.

ఎల్లలులేని గొల్లలు లేని ఊరుండదు

ఈ గ్రంథంలో మానవ నాగరికత ప్రారంభంలో తొలి మానవుడు తన ప్రాథమిక అవసరమైన ఆహారం కోసం జంతువులను వేటాడటం నుండి మచ్చిక చేసుకొని పశుపోషణ వృత్తిని చేపట్టిన క్రమంలో వృత్తియే కులంగా మారడాన్ని గురించి ఈ పుస్తకంలో చర్చించారు. మనదేశంలో తొలి నాగరికతయైన సింధు నాగరికత మొదలుకొని ఆదునిక కాలం వరకు పశుపోషణ వృత్తిని చేపట్టిన జాతులలో గొల్లలు కాలక్రమేణా మానవ మనుగడకు తోడ్పడిన విషయాలను, వారి ప్రాధాన్యతను వివరించారు. అదేవిధంగా గొల్లల జాతిపరమైన సిద్ధాంతాలను చర్చించారు. వివిధ గ్రంథాల ద్వారా గొల్లలు ఆర్యులా? ద్రవిడులా? లేదా మిశ్రమ జాతికి చెందిన వారా? అనే విషయాలపై కొంతమేరకు ఇచ్చిన వివరణలు పాఠకులను ఆలోచింప చేసేలా ఉన్నాయి.

గొల్లల పుట్టుక చారిత్రక నేపథ్యం గురించి వివరిస్తూ భారతదేశ వ్యాప్తంగా విస్తరించిన గొల్లలను వివిధ ప్రాంతాలలో ఏఏ పేర్లతోపిలుస్తారు. అలాగే వివిధ భాషలలో ఏఏ పేర్లతో పిలుస్తారో రచయిత పేర్కొన్నారు. తెలుగు ప్రాంతంలోని పశువుల కాపరులను గొల్లలు, గొల్ల కురుమలు, యాదవులు అని పిలుస్తారని చెపుతూ, గొల్ల అనే తెలుగు పదం పుట్టుక గురించి వివిధ సాహిత్య గ్రంథాలలో యిచ్చిన వివరణలను క్లుప్తంగా పేరొన్నారు. గొల్లల పుట్టుక గురించి ఇతిహాస కాలంనుండి ఇంగ్లీషు కాలం వరకు వివిధ గ్రంథాలలో రాయబడిన వివరణలను క్రోడీకరించి పొందుపరిచెను. సాహిత్య ఆధారాలే కాకుండా మౌఖిక జానపద కథలలో పేర్కొన్న గొల్లకుల పుట్టుక గురించి గల వర్ణనలను యధావిధంగా పొందుపరిచి వాస్తవికంగా చిత్రీకరించారు.

తెలుగు ప్రాంతంలోని గొల్లలలో గలఅనేక ఉపశాఖల గురించి రచయిత పేర్కొంటూ, తన క్షేత్ర పర్యటనలో భాగంగా గొల్లకులంలోని ఉపశాఖల పేర్లను సేకరించి, వాటి అర్థాన్ని వివరిస్తూ, వారు ప్రత్యేకంగా ఒక శాఖగా ఎందుకు గుర్తించబడినారో వివరణాత్మకంగా చర్చించినారు. అలాగే ఒక కులం అనేక శాఖలుగా విడిపోవుటకు ప్రధానంగా అంతర్వివాహాల వలన, వృత్తిరీత్యా ఒక ప్రాంతంనుండి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడం మొదలగు కారణాలు వివరిస్తూ గొల్లకులంలో ఏర్పడ్డ ఉపశాఖలు పేర్ల రీత్యా భిన్నంగా ఉన్న వృత్తిరీత్యా సారూప్యతను కలిగియున్నవి అని బలమైన ఆధారాలతో రుజువు చేయడం అభినందనీయం.

గొల్లలింట్ల గొర్రెలు, మేకలు ఆడబిడ్డలు

ఈ గ్రంథంలో గొల్లకులం ఆచార వ్యవహారాలలో పుట్టుక, వివాహం, చావు సంబంధించిన వివిద అంశాలను చర్చిస్తూ గొల్లల జీవనంలో సామాజిక, మతపరమైన ప్రాధాన్యతను వివరించారు. ఆధునిక సాంకేతిక కాలంలో కూడా గొల్లల ఆచారాల ప్రాధాన్యతను వివరిస్తూ ప్రస్తుత తరం వారు కూడా తమ ఆచారాలను ఆచరించేలా ప్రోత్సాహకరమైన వివరణలు ఇచ్చెను. గొల్లల జీవన విదానంలో పశుపోషణ రకాలు, పశు సంరక్షణ పద్దతులతోపాటు వారు గ్రామీణ ప్రాంతాలలో చేసే పశువైద్య (చెట్లమందువైద్యం) ప్రాధాన్యత వివరించారు. అదేవిధంగా గొల్లల సాంఘిక దురాచారాలను మూఢనమ్మకాలను వివరిస్తూ వాటిలోని లోపాలను సైతం చెప్తూ గొల్ల కులంలో దురాచారాల నిర్మూలన అవసరముందని నొక్కి చెప్పారు. గొల్ల కులంలో కుల కట్టుబాటుకు ప్రాధాన్యతనిచ్చే కుల పంచాయితీ పద్ధతులను వివరణాత్మకంగా చెప్పారు.

గొల్లల వస్తు సంస్కృతిలో వారి ఇండ్లు, గృహసంబందమైన, వృత్తిసంబందమైన వస్తువులతోపాటు దుస్తులు, ఆభరణాలు, వాయిద్య పరికరాల గూర్చి వారి కుల పరిభాషలో వివరించడం అర్థవంతమైనదిగా పేర్కొనవచ్చు. ఒకనాడు గొల్లలతోపాటు ఈ సమాజంను ఉర్రూతలూగించిన గొల్లల ఆశ్రితుల జానపద కళ రూపాలు ఈనాడు ఆదరణలేక అంతరించిపోతున్నాయి. అందుకే పరిశోధకుడు తెలుగు ప్రాంతంలో ఉన్న గొల్లల ఆశ్రిత కులాల వారి జానపద కళా రూపాలను గూర్చి విషయ సేకరణ చేసి ఒక చోట చేర్చి ఆ జానపద కళారూపాల ప్రాధాన్యతలను గొల్ల కులంకు తెలియజేయాలనే భావనతోపాటు గొల్ల ఆశ్రితులు గానం చేసే గొల్లకులం పుట్టుక కథలను గ్రంథస్తం చేస్తూ గొల్లకులం మూలాలను తెలియజేసే మౌఖిక గాథలను భవిష్యత్ తరాలకు భద్రపరిచే ప్రయత్నం చేశారు ప్రసిద్ధమైన చారిత్రక ఆధారాల ద్వారా మాత్రమే కాకుండా సామాన్యంగా ప్రజల వాడుకల్లో ఉండే సామెతల ద్వారా కూడా తన జాతి చరిత్రను అక్షరబద్ధం చేశారు.

ఉదాహరణకు “ఎల్లలు లేని, గొల్లలులేని ఊరు ఉండదు”, గొల్లింట్ల గొర్రెలు, మేకలు ఆడబిడ్డలు”, ఇలా ప్రతి ఊరికి ఎల్లలు అంటే సరిహద్దులు ఎలా ఉంటాయో ఆ ఊరిలో గొల్లలు కూడా ఉంటారని, గొల్లల జీవనంలో గొర్రెల, మేకల ప్రాధాన్యతను వివరిస్తూ వాటినే తమ ఆడబిడ్డల్లాగా చూసుకుంటారని చెప్తాడు. సాధారణంగా తెలుగు ప్రాంతంలో మన ఇంటి ఆడబిడ్డకు ఉన్న ప్రాధాన్యత మనకు తెలిసిందే అలాంటి స్థానాన్ని గొర్రెలకు, మేకలకు ఇచ్చి గొల్లలు జీవిస్తారని ఈ విషయాలు నేటికీ ప్రజల్లో సామెతలుగా ఉన్నవిషయంద్వారా గొల్లల జీవనాన్ని చెప్తాడు రచయిత.

గొల్లలు వారి ఉపకులాల వారు హిందూ సంప్రదాయ పండుగలతోపాటు కులపరమైన పండుగలు జరుపుకుంటారు. వీరు జరుపుకునే కులపరమైన పండుగలలో మల్లన్న పండుగ, బీరప్ప పండుగ అత్యంత ప్రధానమైనవి. వీటితోపాటు పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, చౌడమ్మ ఈదెమ్మ పండుగలను జరుపుకుంటారు. ఈ పండుగల గురించి రచయిత ప్రత్యక్ష పద్దతిలో పరిశీలన చేసి మౌఖిక ఆధారాల ద్వారా వాస్తవికతను ధ్రువీకరించే ప్రయత్నం చేయడం అభినందనీయం. అలాగే మల్లన్న, బీరప్పల సంప్రదాయమే తెలంగాణ సంస్కృతి సంప్రదాయంగా భావించేలా ఈ పుస్తకం కనువిందు చేస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా జరుపుకునే బోనాల పండుగ గొల్లలు జరుపుకునే మల్లన్న బోనాలు, పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ బోనాల పండుగలకు సారూప్యతను రచయిత ఈ పుస్తకంలో ధ్రువీకరించారు.

జాతరలు దాదాపుగా కొన్ని జాతులకు ప్రత్యేక అస్థిత్వం, ఆత్మగౌరవంతో ముడిపడియుంది. ఇందుకు మూలంగా తమ పురాణ పురుషుల ఉన్నతిని ఘనంగా చాటుకునే వేడుకలా ఇది కొనసాగినప్పటికీ సబ్బండ కులాలను ఆకర్షిస్తుంది. పరిశోధకుడు గొల్లల ప్రధాన క్షేత్రాలైన కొంరెల్లి, ఐలోని, ఓదెల, మల్లన్నస్వామి ఆలయాలతోపాటు పెద్దగట్టు లింగమంతుల స్వామి ఆలయంలో జరిగే జాతరలలో ప్రత్యక్షంగా పాల్గొని ఆయా జాతర విశేషాలను గొల్లల సంప్రదాయ ఆరాధన పద్దతులను మౌఖిక పద్దతి ద్వారా విషయ సేకరణ చేసి విశ్లేషణాత్మకంగా వివరించారు. ఈ గ్రంథం చివరలో గొల్లకురుమల పురాణాలైన మల్లన్న పురాణం, బీరప్ప పురాణం సారాంశంతోపాటు ప్రపంచ అత్యుత్తమ జానపద ఇతిహాసాలలో ఒకటైన కాటమరాజు కథ సారాంశం పేర్కొనడం జరిగింది. సింహాలు తమ చరిత్ర తాము చెప్పుకోనంత కాలం వేటగాళ్ళు చెప్పిందే చరిత్ర అవుతుంది అన్న ఆఫ్రికన్ రచయిత మాటలను స్పూర్తిగా తీసుకొని ఒక సింహంలాగా తన జాతి చరిత్రను భవిష్యత్ తరాల వారికి అందించిన రచయిత అభినందనీయుడు. విద్యార్థులకు, పండితులకు, పరిశోధకులకు, సంఘసేవకులకు, కులాభిమానులకు, ఈ గ్రంథం ఎంతో ఉపయుక్తమైనది అని చెప్పవచ్చు.

(నేడు శ్రీ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర
గవర్నర్, హిమాచల్ ప్రదేశ్, గారిచే
యూనివర్శిటి ఆర్ట్స్ అండ్ సైన్స్
కళాశాల హన్మకొండలో గొల్లల
చరిత్రసంస్కృతి ఆవిష్కరణ సందర్భంగా)

Story about Golla Kuruma life history

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జంతువును మచ్చిక చేసుకున్న గొల్ల కురుమలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: