తాజా పండ్లు, కూరగాయలను ఎలా ఎంచుకోవాలి?

  పండ్లు, కూరగాయలపై పొర సాధారణంగా ఎంతో సున్నితంగా ఉంటుంది. ఒకవేళ ఈ పొర ఎండి, నొక్కుకుపోయినట్లు ఉంటే పండు లోపల పాడయిపోయినట్లు భావించాలి. బాగా పాడైన సిట్రస్ (ఆరెంజ్, బత్తాయి) పండ్లకు లోపల రసం ఉండదు. రసభరితమైన పండ్ల నాణ్యత వాటి బరువు, సైజును బట్టి కూడా తెలుసుకోవచ్చు. తాజా పదార్థాల్లో తేలికైన సువాసన ఉంటుంది. వీటికి మచ్చలు, మరకలుండవు. బంగాళదుంప, వెల్లుల్లి, ఉల్లి గట్టిగా, బిగుతుగా ఉండాలి. ఆకు కూరలు, కూరగాయలు ఆకుపచ్చగా సున్నితంగా […] The post తాజా పండ్లు, కూరగాయలను ఎలా ఎంచుకోవాలి? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పండ్లు, కూరగాయలపై పొర సాధారణంగా ఎంతో సున్నితంగా ఉంటుంది. ఒకవేళ ఈ పొర ఎండి, నొక్కుకుపోయినట్లు ఉంటే పండు లోపల పాడయిపోయినట్లు భావించాలి. బాగా పాడైన సిట్రస్ (ఆరెంజ్, బత్తాయి) పండ్లకు లోపల రసం ఉండదు. రసభరితమైన పండ్ల నాణ్యత వాటి బరువు, సైజును బట్టి కూడా తెలుసుకోవచ్చు.

తాజా పదార్థాల్లో తేలికైన సువాసన ఉంటుంది. వీటికి మచ్చలు, మరకలుండవు. బంగాళదుంప, వెల్లుల్లి, ఉల్లి గట్టిగా, బిగుతుగా ఉండాలి. ఆకు కూరలు, కూరగాయలు ఆకుపచ్చగా సున్నితంగా విరిగిపోకుండా ఉండాలి.

అధిక తేమ గల వస్తువులను ఎలా నిల్వ చేయాలి :
సాధరణంగా మనం వారం లేదా 15 రోజులకి కూడా తాజా వస్తువులను జమ చేస్తుంటాం. ఫ్రిజ్‌లోని కూరగాయల బాస్కెట్‌లో రకరకాల కూరగాయలు, పండ్లు, ఉంచుతాం. వీటికి కూడా శాస అవసరముంటుంది. ఏ వాతావరణం, ఉష్ణోగ్రత వద్ద వీటిని నిల్వ ఉంచుతున్నారో, దీనిపైనే పండ్లు, కూరగాయల తాజాదనం, నాణ్యత ఆధారపడి ఉంటాయి.
* స్వీట్‌కార్న్, కొత్తిమీర, బఠాణీ, పాలకూర, కరివేపాకు లాంటివి ఎక్కువగా శ్వాస తీసుకుంటాయి.
* యాపిల్, ఆరెంజ్, నిమ్మ, క్యారెట్, క్యాబేజీ, పచ్చిమిర్చి, మధ్యస్తం శ్వాస తీసుకుంటాయి.
* ప్లమ్, చెర్రీ, టమాటా, వంగ, టర్నప్, కీరా లాంటివి స్వల్ప శ్వాస తీసుకుంటాయి.
ఈ ఆహార పదార్థాలను వాటి శ్వాస తీరును బట్టి వేర్వేరుగా ఉంచాలి. ఎక్కువగా శ్వాస తీసుకునే కూరగాయలను గాలి వీచే ప్రదేశంలో పెట్టాలి. దీంతో పండ్లు, కూరగాయలు తేమ నింపుకుని తాజాగా ఉంటాయి.

ఎండు సామగ్రిని ఎలా నిల్వ చేయాలి :
ఈ సామగ్రిలో ముఖ్యమైనవి మసాలాలు. అలాగే ఔషధాలు, పప్పులు, ధాన్యం కూడా ఉంటాయి. వీటికి గాలి లేదా తేమ తగిలితే చెడిపోతాయి. అందుకే ఎయిర్‌టైట్ కంటెయినర్‌లో ఉంచటం తప్పనిసరి. మసాలాలను డ్యూయల్ లీడ్ కంటైనర్‌లో ఉంచితే అవసరమైనప్పుడు సరైన మోతాదులో తీసుకోవచ్చు.
పప్పులు, ధాన్యాల కోసం కంటైర్లు ఎయిర్‌టైట్‌గా ఉండడంతోపాటు ఉంచే ప్రదేశం సరైనదై ఉండాలి. ఎందుకంటే ఎక్కువకాలం వరకు తేమ మధ్యలో ఉంటే వీటి నాణ్యత కూడా తగ్గిపోవచ్చు.

ఎక్కువ కాలం ఉపయోగకరంగా ఎంచటమెలా :
టమాటా, గుడ్లు, బఠాణీ మొదలైనవి ఎక్కువకాలం ఉండలేవు. కాకపోతే వీటిని సరైన రీతిలో ఫ్రీజ్ చేయాలి. ఫ్రీజర్ సేఫ్ కంటైనర్‌లో ఉంచితే ఎక్కువ కాలం వరకు ఉపయోగకరంగా ఉంటాయి.
బఠాణీ లాంటివి సీజనల్ కూరగాయలు వాటి గింజల్ని ఉడికించి ఫ్రీజ్ చేసి 34 నెలల వరకు నిల్వ ఉంచొచ్చు.

పోగు చేయటం సరికాదు :
పైన చెప్పిన విధానాలతో ఆహార పదార్థాన్ని ఎక్కువకాలం నిల్వ ఉంచగలుగుతాం. కానీ ఎంత కాలం వరకు వాడాలనే ప్రణాళిక ప్రకారమే కూరగాయలు కొనుగోలు చేయడం మంచిది. మాంసం, డైరీ ఉత్పత్తులు, ఆకుపచ్చ కూరగాయలు ఎక్కువ మోతాదులో కొనొద్దు. ఎప్పుడైనా తాజా పదార్థాలతో చేసిన వంటల్లో రుచి పోషకతత్వాలు ఎక్కువగా ఉంటాయనేది తెలిసిందే.

How to choose fresh fruit and vegetables?

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తాజా పండ్లు, కూరగాయలను ఎలా ఎంచుకోవాలి? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: