దేశ భవిష్యత్తు నిర్మాతలు టీచర్లే

విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్ : ఉపాధ్యాయులు భావి భాతర పౌరులను తీర్చిదిద్దే గురుతర బాధ్యతను నిర్వర్తిస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో నిర్మితమవుతుందని అన్నారు. ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయుని ముద్ర ఉంటుందని పేర్కొన్నారు. తనకు మొదట చదువు నేర్పిన గురువు ఇప్పటికీ గుర్తుకు వస్తుంటారని చెప్పారు. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి(ఎన్‌సిఇఆర్‌టి) పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు వివిధ విషయాల పట్ల సమగ్ర అవగాహన కల్పించడానికి […] The post దేశ భవిష్యత్తు నిర్మాతలు టీచర్లే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : ఉపాధ్యాయులు భావి భాతర పౌరులను తీర్చిదిద్దే గురుతర బాధ్యతను నిర్వర్తిస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో నిర్మితమవుతుందని అన్నారు. ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయుని ముద్ర ఉంటుందని పేర్కొన్నారు. తనకు మొదట చదువు నేర్పిన గురువు ఇప్పటికీ గుర్తుకు వస్తుంటారని చెప్పారు. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి(ఎన్‌సిఇఆర్‌టి) పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు వివిధ విషయాల పట్ల సమగ్ర అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మారుతున్న సమాజానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా ఆధునిక అంశాలపై అవగాహన పెంచుకుకోవాలని సూచించారు. పిల్లలు నేర్చుకునే వయసులో ఎక్కువ సమయం పాఠశాలల్లో, ఉపాధ్యాయుల వద్దనే ఉంటారని పేర్కొన్నారు. కాబట్టి వారికి సబ్జెక్టులతో పాటు విలువలను, సామాజిక అంశాలను, ఆరోగ్యం, హరితహారం, లింగ వివక్ష తదితర అంశాల పట్టం అవగాహన కల్పించాలని చెప్పారు. పిల్లల నేపథ్యం అర్థం చేసుకుని బోధించాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల్లో అద్బుతాలు సృష్టించగలిగే శక్తి ఉందని వ్యాఖ్యానించారు. స్వార్థం పెరుగుతున్న సమాజంలో తిరిగి ఇవ్వాలనే సంస్కృతిని పిల్లల్లో పెంపొందించాలని, నిష్టతో పనిచేసే విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.విద్యార్థుల సమగ్ర వికాసానికి దోహదపడేలా శిక్షణ కార్యక్రమం ప్రణాళికను రూపొందించామని ఎస్‌సిఇఆర్‌టి సంచాలకులు డాక్టర్ హృషికేశ్ సేనాపతి అన్నారు.

ఇందులో భాగంగా నేషనల్ రిసోర్స్ గ్రూపును 120 మందితో ఏర్పాటు చేశామని తెలిపారు. 33 వేల మంది కీ రిసోర్స్ పర్సన్‌కు శిక్షణ ఇస్తామని, ఇప్పటివరకు 8 వేల మంది శిక్షణ ఇచ్చామని తెలిపారు. పిల్లల్లో సామాజిక, వ్యక్తిగత నైపుణ్యాలను అభివృద్ది చేయడం, సృజనాత్మకతను వెలికితీయడానికి అనుగుణంగా శిక్షణ కార్యక్రమం ఉంటుందని వివరించారు. విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో ఎన్నో ఆవిష్కరణలు చోటుచేసుకుంటున్నాయని, వాటిని అందిపుచ్చుకునేలా శిక్షణ ఇవ్వడం అభినందనీయమని అన్నారు.

ప్రతి ఉపాధ్యాయుడు తన వృత్తిని గర్వంగా భావించి శిక్షణా కార్యక్రమంలో చర్చించిన అంశాలను తరగతుల్లో అమలు పరచాలని అన్నారు. ఇందుకోసం పది రాజీలేని సూత్రాలను అలవరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సిఇఆర్‌టి సంచాలకులు బి.శేషుకుమారి, ప్రొఫెసర్లు పి.రేవతిరెడ్డి, పి.అనురాధరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Teachers are country future producers Says Sabitha

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post దేశ భవిష్యత్తు నిర్మాతలు టీచర్లే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: