గిరిజన రిజర్వేషన్లకు ఒత్తిడి తెస్తాం

  ఆమనగల్లులో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన మనతెలంగాణ/ఆమనగల్లు : గిరిజనుల రిజర్వేషన్ల పెంపు విషయంలో ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని, ఇప్పటికే రిజర్వేషన్లు పెంచుతూ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం జరిగిందని, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గిరిజనుల సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందిని ఆమె పేర్కొన్నారు. శుక్రవారం ఆమనగల్లు మండల పరిషత్ కార్యాలయంలో కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ […] The post గిరిజన రిజర్వేషన్లకు ఒత్తిడి తెస్తాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆమనగల్లులో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన

మనతెలంగాణ/ఆమనగల్లు : గిరిజనుల రిజర్వేషన్ల పెంపు విషయంలో ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని, ఇప్పటికే రిజర్వేషన్లు పెంచుతూ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం జరిగిందని, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గిరిజనుల సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందిని ఆమె పేర్కొన్నారు. శుక్రవారం ఆమనగల్లు మండల పరిషత్ కార్యాలయంలో కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ నేనావత్ అనిత విజయ్, జడ్పీటీసీ అనురాధ పత్యనాయక్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గిరిజన సంక్షేమం, అభివృద్ధికి ముఖ్యమంత్రి కెసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వారికి తోడ్పాటునందిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

70 ఏళ్లుగా అన్ని పార్టీలు గిరిజనులను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయి తప్ప, వారి అభివృద్ధ్దిని పట్టించుకోలేదన్నారు. దీనికి కారణం నిరక్షరాస్యతతో వారు పూర్తిగా వెనకబడి పోయారని, గిరిజనుల బతుకులు బాగుపడాలంటే విద్యతోనే సాధ్యమని గుర్తించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు నెలకొల్పిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే తలమానికమని ఆమె పేర్కొన్నారు. మహిళల, యువతుల, విద్యార్థినిలపై వేధింపుల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం షీ టీంలను ఏర్పాటు చేసిందని తద్వారా విద్యార్థినిలు హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణాలకు వెళ్లి ధైర్యంగా చదువుకోగలుగుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద గిరిజనులకు, మహిళలకు చేరవేసే కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు.

Minister Satyavathi Rathod visit to Amangal

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గిరిజన రిజర్వేషన్లకు ఒత్తిడి తెస్తాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: