అయోధ్య తీర్పు అంతరార్థం

1949లో 1992లో జరిగిన అక్రమాల విషయంలో ముస్లింలకు మేం న్యాయం చేయలేం కనక వారికి స్థలం ఇవ్వాలని నిర్ణయించడాన్ని ముస్లింలు ఆమోదిస్తారని భావిస్తున్నాం అని కూడా అన్యాపదేశంగా కోర్టు చెప్పినట్టయింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు చరిత్ర ఏమిటో స్పష్టంగానే ఉంది. సుప్రీంకోర్టే స్వయంగా ఆదేశించినప్పటికీ బాబ్రీ మసీదును పరిరక్షించడంలో విఫలమైన అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిపై కోర్టు ఏ చర్యా తీసుకోలేదు. బాబ్రీ మసీదు భూ వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కోర్టు వాచ్యంగా చెప్పిన విషయాలు ఎంత […] The post అయోధ్య తీర్పు అంతరార్థం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

1949లో 1992లో జరిగిన అక్రమాల విషయంలో ముస్లింలకు మేం న్యాయం చేయలేం కనక వారికి స్థలం ఇవ్వాలని నిర్ణయించడాన్ని ముస్లింలు ఆమోదిస్తారని భావిస్తున్నాం అని కూడా అన్యాపదేశంగా కోర్టు చెప్పినట్టయింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు చరిత్ర ఏమిటో స్పష్టంగానే ఉంది. సుప్రీంకోర్టే స్వయంగా ఆదేశించినప్పటికీ బాబ్రీ మసీదును పరిరక్షించడంలో విఫలమైన అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిపై కోర్టు ఏ చర్యా తీసుకోలేదు.

బాబ్రీ మసీదు భూ వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కోర్టు వాచ్యంగా చెప్పిన విషయాలు ఎంత గట్టిగా వినిపిస్తున్నాయో చెప్పని అంశాలూ అంతే గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ తీర్పును మనం క్షుణ్నంగా అర్థం చేసుకోవాలంటే కోర్టు అసలేం చెప్పిందో అన్న విషయంతో పాటు చెప్పకుండా వదిలేసిన అంశాలను సైతం అర్థం చేసుకోవాలి.

వివాదాస్పదమైన 2.77 ఎకరాల ఆస్తిని ‘భగవాన్ శ్రీరాం విరాజ్ మాన్’ కు, ఆ దేవుడి సంరక్షకులకు ఇచ్చేసిన కోర్టు ఈ కేసులో ఎనిమిది ఆదేశాలు ఇచ్చిన వైనం ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజానికి ఇది హిందువు, ముస్లిం పక్షాలకు మధ్య 1949 నుంచి అపరిష్కృతంగా ఉన్న యాజమాన్య హక్కులకు సంబంధించిన వ్యవహారం. అంతకు ముందు బాబ్రీ మసీదు ఉన్న స్థలం తమదంటే తమదని రెండు పక్షాలూ వాదించాయి. ఒక వేళ యాజమాన్య హక్కు భగవంతుడైన శ్రీరాముడికే దక్కుతుందని కోర్టు భావించినట్టయితే ఆ ఆస్తికి తరవాత ఏమవుతుందన్న విషయాన్ని న్యాయ స్థానం ఎందుకు పట్టించుకున్నట్టు? వివాదాస్పద స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం 1993లో స్వాధీనం చేసుకుంది. దీనికి 1993నాటి అయోధ్యలో నిర్దిష్ట ప్రాంత స్వాధీన చట్టం ఉంది. కావాలనుకుంటే ప్రభుత్వం తనకు ఇష్టమైన ట్రస్టుకో, మరో వ్యవస్థకో అప్పగించవచ్చు. అది కొన్ని షరతులకు లోబడి ఉండవచ్చు.

వివాదాస్పద స్థలంపై తీర్పు వెలువరించిన తరవాత అయోధ్య చట్టం ప్రకారం ప్రభుత్వం తనకు ఇష్టమైన రీతిలో వ్యవహరించడానికి కోర్టు వదిలేసి ఉండాల్సింది. కానీ ఆ పని ప్రభుత్వం ఎలా చేయాలో అత్యున్నత న్యాస్థానం కచ్చితంగా నిర్దేశించింది. కోర్టు ఈ పని ఎందుకు చేయవలసి వచ్చిందో ఆశ్చర్యం కలుగుతోంది. కేంద్ర ప్రభుత్వం సరిగ్గా సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తుందా? రాజ్యాంగంలోని 142వ అధికరణం ద్వారా సంక్రమించిన అధికారాల ఆధారంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశం జారీ చేసింది. ‘భిన్న పక్షాలకు న్యాయం చేయదలచుకున్నప్పుడు’ న్యాయస్థానం ఈ అధికారాన్ని వినియోగించవచ్చు. కోర్టు ఇచ్చిన ఆదేశాలు యథాలాపంగా చేసిన పనిలా లేవు. ఈ అధికారం ఎందుకు అవసరమో, 142వ అధికరణం రాజ్యాంగంలో ఎందుకు ఉందో కూడా సుప్రీంకోర్టు వివరించింది. రూఢివాదుల ‘నిశ్శబ్దాన్ని’ ఛేదించడానికి, చట్ట సభ చేసిన శాసనాన్ని అధిగమించడానికి ‘మానవ చరిత్రలో, కార్యకలాపాల్లో ఉండే సంక్లిష్టత’ లను అధిగమించడానికి ఈ ప్రత్యేకాధికారం అవసరం అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఈ దృష్టితో చూస్తే వివాదాస్పద స్థలం తమదేనని న్యాయపరంగా రుజువు చేయడంలో హిందూ పక్షాలు సఫలమైనాయని, ముస్లిం పక్షాలు ఎంతో కొంత మేరకు ఆ పని చేయగలిగాయి కనక సమ న్యాయం చేయాలని బహుశః న్యాయస్థానం భావించి ఉంటుందని అనుకోవడానికి అవకాశం ఉంది. అందువల్లే న్యాయస్థానం మసీదు నిర్మించుకోవడానికి సున్నీ ఫక్ఫ్ బోర్డుకు స్థలం కేటాయించాలని, ఈ పని సముచితమైన రీతిలో కేంద్ర ప్రభుత్వం అయోధ్య చట్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు నిర్దేశించింది. అయినా ఇది ‘న్యాయమేనా?’ అన్న ప్రశ్న ఉండనే ఉంటుంది. హిందువులు తమ వాదనను న్యాయపరంగా నిరూపించుకోగలిగినా ‘మానవ చరిత్రలో, కార్యకలాపాల్లో ఉండే సంక్లిష్టత’ లను అధిగమించడానికి సున్నీ వక్ఫ్ బోర్డుకు స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎందుకు ఆదేశించినట్టు? దీనికి సమాధానం చెప్పడం కష్టమైన పనేమీ కాదు.

బాబ్రీ మసీదును రెండు సార్లు అపవిత్రం చేశారని ఏ సందిగ్ధత లేకుండా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకసారి 1949లో అర్ధ రాత్రి చిమ్మ చీకట్ల్లో మసీదులోకి ప్రవేశించి మసీదు మధ్య గుమ్మటం కింద శ్రీ రాముడి విగ్రహాలను పెట్టారని, రెండవ సారి 1992లో పట్టపగలు, బహిరంగంగా కరసేవకుల మూక బాబ్రీ మసీదును కూల్చి వేశారని న్యాయస్థానమే అంగీకరించింది. అయినా ఈ రెండు సంఘటనలు వివాదాస్పద స్థలం తమదేనన్న హిందూ పక్షాల వాదనకు మరింత బలం చేకూరుస్తున్నట్టే భావించింది తప్ప ఈ వాదన న్యాయం కాదని అనుకోలేదు. కూల్చివేతకు గురైన బాబ్రీ మసీదు మధ్య గుమ్మటం కింద ఉన్న ప్రాంతమే రామజన్మ భూమి అన్న హిందువుల విశ్వాసానికి సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేసింది. ఈ విషయం నిర్ధారించడానికి కోర్టు ముస్లింల వాదనను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. 1857 తరవాత కూడా దాన్ని మసీదుగానే ఉపయోగించుకున్నారన్న ముస్లింల వాదనను ఒప్పుకోలేదు.

అంటే కోర్టు చెప్పదలచుకోని విషయం స్థూలంగా ఇది: 1949లోనూ, 1992లోనూ హిందువులు అక్రమంగా వ్యవహరించడం వివాదాస్పద స్థలం తమదేనన్న వాదనను బలపరుస్తోంది. అయినప్పటికీ మేం ఈ అక్రమాన్ని వినియోగించుకోనిస్తాం అని కోర్టు చెప్పకనే చెప్పింది. 1949లో 1992లో జరిగిన అక్రమాల విషయంలో ముస్లింలకు మేం న్యాయం చేయలేం కనక వారికి స్థలం ఇవ్వాలని నిర్ణయించడాన్ని ముస్లింలు ఆమోదిస్తారని భావిస్తున్నాం అని కూడా అన్యాపదేశంగా కోర్టు చెప్పినట్టయింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు చరిత్ర ఏమిటో స్పష్టంగానే ఉంది. సుప్రీంకోర్టే స్వయంగా ఆదేశించినప్పటికీ బాబ్రీ మసీదును పరిరక్షించడంలో విఫలమైన అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిపై కోర్టు ఏ చర్యా తీసుకోలేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా గడువు మీద గడువు మంజూరు చేసింది. మసీదును ధ్వంసం చేసినవారిపై నేర విచారణ ఇప్పటికీ నత్త నడకే నడుస్తోంది. బాబ్రీ మసీదు స్థల వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏ రకంగానూ ‘సంపూర్ణ న్యాయం’ కానే కాదు. పైగా దాని కోసం 142వ అధికరణం కింద ప్రత్యేకాధికారాలను వినియోగించుకున్నది. మహా అయితే ఇది ‘అసంపూర్ణ న్యాయం’ చేసింది. లేదా ‘పరిపూర్ణంగా అన్యాయం’ చేసింది.

Supreme Court verdict on Ayodhya dispute

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అయోధ్య తీర్పు అంతరార్థం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.