ప్లాస్టిక్ నియంత్రణలో తెలంగాణ నంబర్‌వన్

టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పక్ష నేత నామా నాగేశ్వరరావు మనతెలంగాణ/హైదరాబాద్: ప్లాస్టిక్ నియంత్రణలో దేశంలో తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందని పార్లమెంట్‌లో టిఆర్‌ఎస్ పక్ష నాయకుడు నామా నాగేశ్వర్ రావు చెప్పారు. అభివృద్ధిలో ప్రథమస్థానంలో ఉన్న తెలంగాణ ప్లాస్టిక్ నియంత్రణలోకూడా ప్రథమస్థానంలో ఉందని ఆయన తెలిపారు. శుక్రవారం పార్లమెంట్ లో ప్లాస్టిక్ నియంత్రణ అంశంపై సుధీర్ఘంగా చర్చజరిగింది. ఈ చర్చలో పాల్గొన్న నామానాగేశ్వర్ రావు మాట్లాడుతూ కిలో ప్లాస్టిక్‌కు కిలో బియ్యం పథకాన్ని తెలంగాణలో కెలెక్టర్లు అమలుచేస్తున్నట్లు దేశంలోకూడా ఈ […] The post ప్లాస్టిక్ నియంత్రణలో తెలంగాణ నంబర్‌వన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పక్ష నేత
నామా నాగేశ్వరరావు

మనతెలంగాణ/హైదరాబాద్: ప్లాస్టిక్ నియంత్రణలో దేశంలో తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందని పార్లమెంట్‌లో టిఆర్‌ఎస్ పక్ష నాయకుడు నామా నాగేశ్వర్ రావు చెప్పారు. అభివృద్ధిలో ప్రథమస్థానంలో ఉన్న తెలంగాణ ప్లాస్టిక్ నియంత్రణలోకూడా ప్రథమస్థానంలో ఉందని ఆయన తెలిపారు. శుక్రవారం పార్లమెంట్ లో ప్లాస్టిక్ నియంత్రణ అంశంపై సుధీర్ఘంగా చర్చజరిగింది. ఈ చర్చలో పాల్గొన్న నామానాగేశ్వర్ రావు మాట్లాడుతూ కిలో ప్లాస్టిక్‌కు కిలో బియ్యం పథకాన్ని తెలంగాణలో కెలెక్టర్లు అమలుచేస్తున్నట్లు దేశంలోకూడా ఈ పథకాన్ని అమలు చేయాలని సూచించారు. పర్యావరణానికి అనేక సవాళ్లు విసురుతున్న ప్లాస్టిక్‌ను నియంత్రించనిపక్షంలో పర్యావరణ సమతౌల్యం దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు.

దేశంలో అమలవుతున్న అనేక పథకాలకు తెలంగాణ ఆదర్శంగా ఉన్నట్టుగానే ప్లాస్టిక్ నియంత్రణలో కూడా తెలంగాణ ఆదర్శంగా ఉందన్నారు. తెలంగాణలో నిర్వహించిన 30 రోజుల పల్లెప్రగతి కార్యక్రమంలో ప్లాస్టిక్ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించడంతో గ్రామాల్లో ప్లాస్టిక్ వినియోగం తగ్గిపోయిందన్నారు. మార్కెట్‌కు ప్లాస్టిక్ రహిత సంచులను వినియోగదారులు తీసుకువెళ్లడం తెలంగాణలో మాత్రమే అగుపిస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్లాస్టిక్‌ను నియంత్రించేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. దేశం తెలంగాణను ఆదర్శంగా తీసుకుని కిలోప్లాస్టిక్‌కు కిలో బియ్యం పథక్షకాన్ని అమలు చేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయని ఆయన సూచించారు. మహత్మ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కిలో ప్లాస్టిక్‌కు కిలో బియ్యం పథకాన్ని చేర్చితే ఉపాధి అవకాశాలతోపాటు ప్లాస్టిక్ నియంత్రణ జరుగుతుందని కేంద్రానికి నామానాగేశ్వర్ రావు సూచించారు.

గిరిజన విశ్వవిద్యాలయం స్థాపించాలి, రాజ్యసభ సభ్యుడు బండప్రకాష్

రాష్ట్ర పునర్‌విభజనచట్టం ఇచ్చిన హామీల మేరకు తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో బండప్రకాష్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటును ఆలస్యం చేస్తుందని ఆయన ఆరోపించారు. ప్రస్తుత విద్యాసంవత్సరం ఆగస్టులో అడ్మిషన్స్‌ను ప్రారంభించాల్సి ఉండగా కేంద్రం నిర్లక్షంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు.

అనేక పర్యాయాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్రానికి వినతిపత్రాలను సమర్పించినా ఎందుకు స్పందించలేదని బండప్రకాష్ కేంద్రాన్ని నిలదీశారు. గిరిజన విశ్వవిద్యాలయంకోసం రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్‌ను కూడా కేంద్రానికి సమర్పించిందని ఆయన గుర్తు చేశారు. రానున్నవిద్యా సంవత్సరం నుంచి తెలంగాణలో గిరిజనవిశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలని ఆయన కేంద్రన్ని డిమాండ్ చేశారు.

Telangana number one in plastic control

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్లాస్టిక్ నియంత్రణలో తెలంగాణ నంబర్‌వన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: