డిహెచ్‌ఎఫ్‌ఎల్‌కు ముగ్గురు సభ్యుల ప్యానెల్

నియమించిన ఆర్‌బిఐ న్యూఢిల్లీ: రూ.84 వేల కోట్ల రుణ భారం ఉన్న దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ (డిహెచ్‌ఎఫ్‌ఎల్)ను నిర్వహణ కోసం ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ముగ్గురు సభ్యుల సలహా ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. దివాలా ప్రక్రియ కోసం ఎన్‌సిఎల్‌టికి వెళ్లడానికి రిజర్వు బ్యాంక్ నియమించిన నిర్వాహకుడికి ప్యానెల్ సహాయం చేస్తుంది. ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజీవ్ లాల్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ ఎన్‌ఎస్ కన్నన్, మ్యూచువల్ ఫండ్ […] The post డిహెచ్‌ఎఫ్‌ఎల్‌కు ముగ్గురు సభ్యుల ప్యానెల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
నియమించిన ఆర్‌బిఐ

న్యూఢిల్లీ: రూ.84 వేల కోట్ల రుణ భారం ఉన్న దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ (డిహెచ్‌ఎఫ్‌ఎల్)ను నిర్వహణ కోసం ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ముగ్గురు సభ్యుల సలహా ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. దివాలా ప్రక్రియ కోసం ఎన్‌సిఎల్‌టికి వెళ్లడానికి రిజర్వు బ్యాంక్ నియమించిన నిర్వాహకుడికి ప్యానెల్ సహాయం చేస్తుంది. ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజీవ్ లాల్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ ఎన్‌ఎస్ కన్నన్, మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్ ఎఎంఎఫ్‌ఐ సిఇఒ ఎన్‌ఎస్ వెంకటేష్‌లను ఆర్‌బిఐ నియమించింది. పరిపాలనాపరమైన ఆందోళనలు, అనేక రుణాల ఎగవేత కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న డిహెచ్‌ఎఫ్‌ఎల్ బోర్డును ఆర్‌బిఐ బుధవారం రద్దు చేసింది.

దీంతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ సుబ్రమణ్యకుమార్‌ను డిహెచ్‌ఎఫ్‌ఎల్ నిర్వాహకుడిగా రిజర్వు బ్యాంక్ నియమించింది. డిహెచ్‌ఎఫ్‌ఎల్ దేశంలో మూడో అతిపెద్ద తనఖా రుణదాత సంస్థ. సంక్షోభంలో ఉన్న ఎన్‌బిఎఫ్‌సిల కేసులను, కనీసం రూ .500 కోట్ల నికర విలువ కలిగిన హెచ్‌ఎఫ్‌సిలను దివాలా కోర్టుకు పంపే హక్కును ప్రభుత్వం గత వారం ఆర్‌బిఐకి అప్పగించింది. ఇన్సాల్వెన్సీ యాక్ట్ 2019 కింద సంస్థ పరిష్కార ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని, అడ్మినిస్ట్రేటర్‌ను సొల్యూషన్ ప్రొఫెషనల్(ఆర్‌పి)గా నియమించాలని ఎన్‌సిఎల్‌టిని అభ్యర్థిస్తామని ఆర్‌బిఐ తెలిపింది.

దివాళా బాటలో…

డిహెచ్‌ఎఫ్‌ఎల్ దివాళా తీస్తుంది. దీని కోసం కంపెనీ త్వరలోనే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి)కు దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ దరఖాస్తు చేయకపోతే, బ్యాంకులు వారి తరపున చేసే అవకాశముంది. ప్రభుత్వ నోటిఫికేషన్ తర్వాత ఇప్పుడు ఈ సంస్థ కూడా ఈ ప్రక్రియలో పాల్గొనవచ్చు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నవంబర్ 18న జారీ చేసిన నోటిఫికేషన్‌లో దివాలా కోడ్ (ఐబిసి)లోని సెక్షన్ 227ను సవరించింది. ఇప్పుడు రూ.500 కోట్లకు పైగా విలువ కలిగిన ఎన్‌బిఎఫ్‌సి కంపెనీలు కూడా దివాలా ప్రక్రియకు దరఖాస్తు చేసుకోవచ్చు.

three member panel for DHFL

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post డిహెచ్‌ఎఫ్‌ఎల్‌కు ముగ్గురు సభ్యుల ప్యానెల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: