ఎజిఆర్‌పై రెండేళ్ల గడువు.. టారిఫ్ పెంపు సరిపోదు

అయినా టెలికాం రంగానికి ముప్పు: రేటింగ్ సంస్థ ఫిచ్ న్యూఢిల్లీ: స్పెక్ట్రం చెల్లింపుల్లో రెండేళ్ల గడువు ఇవ్వడం, కంపెనీల చార్జీల పెంపు వల్ల టెలికాం కంపెనీలకు ప్రయోజనేమీ లేదని, ఎజిఆర్ బకాయిల నుంచి ఉపశమనం కూడా ఉండబోదని రేటింగ్ సంస్థ ఫిచ్ శుక్రవారం తెలిపింది. ఎజిఆర్(సర్దుబాటు స్థూల రాబడి) కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల రిలయన్స్ జియో ప్రభావితం కాదని, అందువల్ల దాని మార్కెట్ వాటా క్రమంగా పెరుగుతుందని సంస్థ భావించింది. 2020 సంవత్సరానికి గాను […] The post ఎజిఆర్‌పై రెండేళ్ల గడువు.. టారిఫ్ పెంపు సరిపోదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
అయినా టెలికాం రంగానికి ముప్పు: రేటింగ్ సంస్థ ఫిచ్

న్యూఢిల్లీ: స్పెక్ట్రం చెల్లింపుల్లో రెండేళ్ల గడువు ఇవ్వడం, కంపెనీల చార్జీల పెంపు వల్ల టెలికాం కంపెనీలకు ప్రయోజనేమీ లేదని, ఎజిఆర్ బకాయిల నుంచి ఉపశమనం కూడా ఉండబోదని రేటింగ్ సంస్థ ఫిచ్ శుక్రవారం తెలిపింది. ఎజిఆర్(సర్దుబాటు స్థూల రాబడి) కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల రిలయన్స్ జియో ప్రభావితం కాదని, అందువల్ల దాని మార్కెట్ వాటా క్రమంగా పెరుగుతుందని సంస్థ భావించింది. 2020 సంవత్సరానికి గాను టెలికాం రంగానికి దృక్పథం ప్రతికూలంగా ఉందని, దీనికి కారణం ఎజిఆర్ బకాయిలు భారీగా ఉండటం వల్ల ఆర్థికంగా ముప్పు పొంచి ఉందని సంస్థ పేర్కొంది. ఎజిఆర్ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం టెలికాం సంస్థలకు రెండేళ్ల గడువు ఇచ్చినా లాభం లేదని రేటింగ్ సంస్థ అంచనా వేసింది.

భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా డిసెంబర్ నుండి చార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ రెండింటి తర్వాత రిలయన్స్ జియో కూడా మొబైల్ చార్జీలను వచ్చే నెల నుండి పెంచుతున్నట్లు ప్రకటించింది. కంపెనీలు చార్జీలను పెంచడం, స్పెక్ట్రం ఫీజు చెల్లింపునకు ప్రభుత్వం రెండేళ్ల సమయం ఇవ్వడం టెలికాం రంగానికి అనుకూలంగా ఉన్నాయని, అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రభావాన్ని తగ్గించడానికి ఇది సరిపోదని ఫిచ్ పేర్కొంది.

‘సుప్రీం’లో రివ్యూ పిటిషన్

టెలికాం కంపెనీలు సుప్రీంకోర్టుకు చేరుకున్నాయి. అక్టోబర్ 24న ఎజిఆర్(సర్దుబాటు స్థూల రాబడి)పై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా, టాటా టెలిసర్వీసెస్‌లు రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయని, మరోసారి కోర్టు నిర్ణయం కోసం వేచిచూడనున్నాయని తెలుస్తోంది. భారతీయ ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియాలు నష్టాల భారం తగ్గించుకునేందుకు డిసెంబర్ నుండి చార్జీలను పెంచాలని నిర్ణయించాయి.రిలయన్స్ జియో కూడా మొబైల్ చార్జీలను వచ్చే నెల నుండి పెంచుతున్నట్లు ప్రకటించింది.

Tariff hike is not enough

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎజిఆర్‌పై రెండేళ్ల గడువు.. టారిఫ్ పెంపు సరిపోదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: