జిల్లా ఆసుప్రతులుగా 9 ఏరియా దవాఖానాలు

  అప్‌గ్రేడ్‌కు అవసరమైన నిధులకు కేంద్రం ఆమోదం అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్స్ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హైదరాబాద్ : వైద్యాన్ని వికేంద్రీకరించి ప్రజలకు అన్ని చోట్లా సేవలు అందుబాటులోకి వచ్చేలా చేయాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ఉన్న ఏరియా ఆసుపత్రులను జిల్లా ఆసుపత్రులుగా అప్ గ్రేడ్ చేసేందుకు అవసరమైన నిధులు కేటాయించేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. రెండు రోజుల ఢిల్లీ […] The post జిల్లా ఆసుప్రతులుగా 9 ఏరియా దవాఖానాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అప్‌గ్రేడ్‌కు అవసరమైన నిధులకు కేంద్రం ఆమోదం
అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్స్
ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్

హైదరాబాద్ : వైద్యాన్ని వికేంద్రీకరించి ప్రజలకు అన్ని చోట్లా సేవలు అందుబాటులోకి వచ్చేలా చేయాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ఉన్న ఏరియా ఆసుపత్రులను జిల్లా ఆసుపత్రులుగా అప్ గ్రేడ్ చేసేందుకు అవసరమైన నిధులు కేటాయించేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటన అనంతరం ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. గద్వాల్, మహబూబాబాద్, నారాయణపేట్, నిర్మల్, ఆసిఫాబాద్, నర్సంపేట, భూపాలపల్లి, సిరిసిల్ల, ములుగులో ఎహెచ్‌ను డిహెచ్‌గా మారతాయని, అందుకు రూ.576.78 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భరిస్తున్నాయన్నారు. వీటి నిర్మాణాల కోసం ఈ ఏడాది రూ. 214.12 కోట్లు మంజూరు ఆమోదం తెలిపిందన్నారు.

ఇందుకు సంబంధించిన టెండర్లను త్వరలో పిలుస్తామని, నిర్మాణాలను శరవేగంగా చేపడతామన్నారు. అలాగే గాంధీలో 200 పడకల మాతాశిశు సంరక్షణ కేంద్రాలని ఏర్పాటు చేసేందుకు రూ.30 కోట్లు తొలి విడతగా కేటాయిస్తున్నామన్నారు. అలాగే వనపర్తి, నాగర్ కర్నూల్, గజ్వేలో బర్న్ వార్డుల ఏర్పాటుకు రూ.1.5 కోట్లు మంజూరుకు ఆమోదం లభించిందన్నారు. స్పెషలిస్టు సేవలను తాత్కాలిక పద్దతిపై ఉపయోగించుకునేందుకు రూ.10 కోట్ల నిధులు కేటాయిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ఏర్పాటుకు కేంద్రం రూ.24 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపిందన్నారు. నాగర్ కర్నూల్ , పాలమూరు, గద్వాల్, వికారాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, నల్గొండ, సూర్యాపేట, జనగామ, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, కరీంనగర్, జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, సిద్దిపేట, ములుగులలో టి డయాగ్నస్టిక్స్ హబ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటి ఏర్పాటు కోసం ఇప్పటికే భవనాలు సిద్ధం అయ్యాయన్నారు.

త్వరలో వీటిలో కొన్నింటిని అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. అక్కడ 24 గంటలు ఉచితంగా పరీక్షలు అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే ఆదిలాబాద్, వరంగల్ కిమ్స్‌లో రీజనల్ క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఆ రెండు చోట్ల సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చేలా చేస్తామన్నారు. అలాగే అన్ని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ట్రామాకేర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు పెరుగుతుండటంతో క్షతగాత్రులకు తక్షణమై మెరుగైన వైద్య సేవలు అందించేందుకే వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో వేలాది బెడ్స్ అందుబాటులోకి వస్తాయని, తద్వారా వైద్య సేవలు డిసెంట్రలైజేషన్ అయి, అందరికి ట్రీట్మెంట్ సమీపంలోనే లభిస్తుందన్నారు . అలాగే హైదరాబాద్‌లోని పెద్దాస్పత్రులపై భారం తగ్గుతుందన్నారు.

పిహెచ్‌సిల్లో సిబ్బందిని మూడు రకాలుగా విభజించి, రోగాలు, రోగులు తక్కువగా ఉన్నచోట నుంచి ఎక్కువగా ఉన్న కేంద్రాలకు వైద్య సిబ్బందిని రేషనలైజేషన్ చేపడతామని వెల్లడించారు. రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ నిధులను సరైన విధంగా వినియోగించుకోవడంతో కేంద్రం ప్రోత్సాహకంగా మరో రూ.80 కోట్లు అదనంగా ఇచ్చిందని ఈటెల తెలిపారు. అలాగే అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా నిధులు కేటాయించడం సరికాదని, రాష్ట్రాల అవసరాలకు తగిట్లుగా నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.

అవి గాలి వార్తలే
పార్టీ మారతానన్నది గాలి వార్తలే కాగా తాను పార్టీ మారతానని పత్రికల్లో వస్తోన్న వార్తలపై మంత్రి ఈటల స్పందించారు. అవన్నీ గాలివార్తలేనని కొట్టిపారేశారు. తాను పార్టీ మారేదీ లేదన్నారు. బిజెపిలోకి వస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారన్న దానిపై స్పందిస్తూ ‘ చెప్పేవాళ్లు ఎన్నయినా చెప్తారు ‘ అని అన్నారు.

9 area Hospitals as District Hospitals

The post జిల్లా ఆసుప్రతులుగా 9 ఏరియా దవాఖానాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: