సందడే సందడి

కోల్‌కతా: భారత గడ్డపై జరుగుతున్న తొలి డేనైట్ టెస్టును పురస్కరించుకొని కోల్‌కతా మహా నగరంలో క్రికెట్ సందడి నెలకొంది. భారత్‌బంగ్లాదేశ్ జట్ల మధ్య శుక్రవారం కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్‌లో డేనైట్ టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ చారిత్రక మ్యాచ్‌కు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీలు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత మాజీ క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, […] The post సందడే సందడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కోల్‌కతా: భారత గడ్డపై జరుగుతున్న తొలి డేనైట్ టెస్టును పురస్కరించుకొని కోల్‌కతా మహా నగరంలో క్రికెట్ సందడి నెలకొంది. భారత్‌బంగ్లాదేశ్ జట్ల మధ్య శుక్రవారం కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్‌లో డేనైట్ టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ చారిత్రక మ్యాచ్‌కు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీలు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత మాజీ క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, వివిఎస్.లక్ష్మణ్, హర్భజన్ సింగ్ తదితరులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టీమిండియా మాజీ కెప్టెన్లను ప్రత్యేక బండ్లలో మైదానంలో ఊరేగించారు.

కాగా, భారత్‌లో జరుగుతున్న తొలి డేనైట్ టెస్టు సమరాన్ని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో స్టేడియం పరిసరాల్లో పండగ వాతావరణం కనిపించింది. ఈ మ్యాచ్‌కు పింక్ బంతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన క్రికెట్ ప్రేమీకులు విచిత్ర వేషాధరణతో అలరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేశారు. భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పర్యవేక్షణలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మరోవైపు క్రీడా రంగంలో అసాధారణంగా రాణించిన దిగ్గజాలను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, బ్యాడ్మింటన్ ఆణిముత్యం పి.వి.సింధు, బాక్సింగ్ గ్రేట్ మేరీకోమ్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జాలను క్రికెట్ బోర్డు తరఫున సత్కరించారు. ఇక, ఈ మ్యాచ్‌కు ఊహించిన స్పందన లభించడంతో నిర్వాహకుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

India vs Bangladesh Day Night Test

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సందడే సందడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: