ఎలక్ట్రానిక్ సిగరెట్లపై కొరడా

  ఉత్పత్తి, దిగుమతి, అమ్మకం నిషేధిస్తూ బిల్లు ప్రత్యామ్నాయ ఉత్పత్తులకూ వర్తింపు తొలి ఉల్లంఘనకు ఏడాది జైలు, లక్ష జరిమానా న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ సిగరెట్లు, అదే తరహా వస్తువుల ఉత్పత్తి, దిగుమతి, అమ్మకాలను నిషేధించే బిల్లును లోక్‌సభలో శుక్రవారం ప్రవేశపెట్టారు. సెప్టెంబర్ 18న జారీచేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధం (ఉత్పత్తి, తయాయీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, అమ్మకం, పంపిణి, నిలవచేయడం, ప్రకటనలు) బిల్లు 2019 బిల్లును కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ ప్రవేశపెట్టారు. కేవలం ఎలక్ట్రానిక్ […] The post ఎలక్ట్రానిక్ సిగరెట్లపై కొరడా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఉత్పత్తి, దిగుమతి, అమ్మకం నిషేధిస్తూ బిల్లు
ప్రత్యామ్నాయ ఉత్పత్తులకూ వర్తింపు
తొలి ఉల్లంఘనకు ఏడాది జైలు, లక్ష జరిమానా

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ సిగరెట్లు, అదే తరహా వస్తువుల ఉత్పత్తి, దిగుమతి, అమ్మకాలను నిషేధించే బిల్లును లోక్‌సభలో శుక్రవారం ప్రవేశపెట్టారు. సెప్టెంబర్ 18న జారీచేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధం (ఉత్పత్తి, తయాయీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, అమ్మకం, పంపిణి, నిలవచేయడం, ప్రకటనలు) బిల్లు 2019 బిల్లును కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ ప్రవేశపెట్టారు. కేవలం ఎలక్ట్రానిక్ సిగరెట్లే కాకుండా ప్రత్యామ్నాయ పొగ సాధనాలను కూడా గుర్తించదగిన నేరంగా పరిగణించి జైలుశిక్ష, జరిమానా విధించేందుకు కూడా ఈ బిల్లు వర్తిస్తుంది.

మొదటిసారి దీన్ని ఉల్లంఘించిన వారు ఏడాది జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తారు. ఆపై అదేపనిగా ఉల్లంఘిస్తుంటే మూడేళ్ల వరకూ జైలుశిక్ష లేదా రూ. 5 లక్షల జరిమానా లేదా రెండూ విధించవచ్చని ఆర్డినెన్స్ పేర్కొంది. సోదాలు చేసేందుకు అనుమతిలేని ప్రదేశాల్లో కూడా అధికారులు తనిఖీలు జరిపేందుకు బిల్లు వీలు కల్పిస్తోంది. ఇందుకు సంబంధించి ఫిర్యాదు అందినప్పుడు ఉత్పత్తి చేసే ప్రాంగణాల్లో తనిఖీలు నిర్వహించి ఆస్తులు జప్తు చేయవచ్చు. అయితే ప్రభుత్వ చర్యను వ్యాపార సంస్థలు, వినియోగవర్గాలు, వ్యతిరేకిస్తున్నాయి. ఇది ఆటవిక చట్టం అని విమర్శిస్తున్నాయి.

Bill to ban E Cigarettes introduced in Lok Sabha

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎలక్ట్రానిక్ సిగరెట్లపై కొరడా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: