లంబూ పాంచ్ పటాకా

వణికించిక ఇషాంత్, చెలరేగిన ఉమేశ్, షమి బంగ్లా @106 ఆలౌట్, రాణించిన పుజారా, కోహ్లి గులాబీ టెస్టులో భారత్ 174/3 కోల్‌కతా: చారిత్రక గులాబీ టెస్టు సమరంలో భారత్ కళ్లు చెదరే ఆరంభాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ను భారత్ 106 పరుగులకే కుప్పకూల్చింది. వెటరన్ స్పీడ్‌స్టర్ కళ్లు చెదిరే బౌలింగ్‌తో చెలరేగి పోయాడు. లంబూ ఐదు వికెట్లు తీయగా, ఉమేశ్ మూడు, షమి రెండు వికెట్లు తీసి తమవంతు సహకారం అందించారు. భారత బౌలర్ల […] The post లంబూ పాంచ్ పటాకా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వణికించిక ఇషాంత్, చెలరేగిన ఉమేశ్, షమి
బంగ్లా @106 ఆలౌట్, రాణించిన పుజారా, కోహ్లి
గులాబీ టెస్టులో భారత్ 174/3

కోల్‌కతా: చారిత్రక గులాబీ టెస్టు సమరంలో భారత్ కళ్లు చెదరే ఆరంభాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ను భారత్ 106 పరుగులకే కుప్పకూల్చింది. వెటరన్ స్పీడ్‌స్టర్ కళ్లు చెదిరే బౌలింగ్‌తో చెలరేగి పోయాడు. లంబూ ఐదు వికెట్లు తీయగా, ఉమేశ్ మూడు, షమి రెండు వికెట్లు తీసి తమవంతు సహకారం అందించారు. భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 46 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఇప్పటికే భారత్‌కు 68 పరుగుల ఆధిక్యం లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (21), మయాంక్ అగర్వాల్ (14) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు.

అయితే మిస్టర్ డిపండబుల్ చటేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లి అర్ధ సెంచరీలతో చెలరేగడంతో భారత్ కోలుకుంది. ఒక దశలో 42 పరుగులకే ఓపెనర్లను కోల్పోయి కాస్త కష్టాల్లో చిక్కుకున్నట్టు కనిపించిన భారత్‌ను పుజారా, కోహ్లిలు ఆదుకున్నారు. ఇద్దరు బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన పుజారా 8 ఫోర్లతో 55 పరుగులు చేశాడు. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి 8 ఫోర్లతో 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వైస్ కెప్టెన్ అజింక్య రహానె 23 (నాటౌట్) అతనికి అండగా ఉన్నాడు.

హడలెత్తించారు

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ను భారత బౌలర్లు హడలెత్తించారు. వెటరన్ బౌలర్ ఇషాంత్ శర్మ అద్భుత బంతితో బంగ్లాదేశ్ ఓపెనర్ ఇమ్రుల్ కైస్ (4) వెనక్కి పంపాడు. ఆ వెంటనే మరో స్పీడ్‌స్టర్ ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఉమేశ్ ధాటికి బంగ్లా కెప్టెన్ మోమినుల్ హక్ (౦), వికెట్ కీపర్ మహ్మద్ మిథున్ (౦) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. ఇక, సీనియర్ ఆటగాడు ముష్ఫికుర్ రహీం (౦)ను మహ్మద్ షమి క్లీన్‌బౌల్డ్ చేశాడు. అతను కూడా సున్నాకే వెనుదిరిగాడు. మరోవైపు నిలకడగా ఆడుతున్న ఓపెనర్ షద్మన్ ఇస్లాం (29)ను ఇషాంత్ ఔట్ చేశాడు. దీంతో బంగ్లాదేశ్ 38 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.

ఆ తర్వాత బంగ్లాదేశ్ మళ్లీ కోలుకోలేక పోయింది. అసాధారణ రీతిలో చెలరేగిన ఇషాంత్ 22 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఉమేశ్ మూడు, షమి రెండు వికెట్లు తీసి తమవంతు పాత్ర పోషించారు. బంగ్లా జట్టులో ముగ్గురు మాత్రమే రెండంకెలా స్కోరును అందుకున్నారు. లిటన్ దాస్ (24), నయీం హసన్ (19) కాస్త రాణించడంతో బంగ్లా స్కోరు 106కి చేరింది. కాగా, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఇప్పటికే 10 ఆధిక్యంలో ఉంది. ఇక, కనీసం ఈ మ్యాచ్‌లోనైనా భారత్‌కు గట్టి పోటీ ఇస్తుందని భావించిన బంగ్లాదేశ్ తక్కువ స్కోరుకే కుప్పకూలి అభిమానులను నిరాశకు గురి చేసింది. తొలి రోజే టీమిండియా మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరడంతో బంగ్లా ఆత్మవిశ్వాసం దెబ్బతిందనే చెప్పాలి. ఏదైనా అనూహ్యం జరిగితే తప్ప బంగ్లా ఈ మ్యాచ్‌లో కోలుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. ఇక, విరాట్ సేన మరో భారీ విజయానికి మార్గం సుగమం చేసుకుంటోంది.

కోహ్లి ప్రపంచ రికార్డు

రికార్డుల రారాజు విరాట్ కోహ్లి మరో అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా ఐదు వేల పరుగులను సాధించిన కెప్టెన్‌గా కోహ్లి నిలిచాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికి పాంటింగ్ పేరిట ఉన్న రికార్డును తిరగ రాశాడు. బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్టులో 32 పరుగులు చేయడం ద్వారా కోహ్లి ఈ రికార్డును సృష్టించాడు. పాంటింగ్ 97 ఇన్నింగ్స్‌లలో ఐదు వేల పరుగులను పూర్తి చేశాడు. కోహ్లి మాత్రం 86వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించడం విశేషం.

Ishant highlights Indian domination at Eden Gardens

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post లంబూ పాంచ్ పటాకా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: