సర్కార్ దవాఖానలో నర్సుల నియామకాలు

హైదరాబాద్: మహానగరంలో పేదలకు వైద్యసేవలందించే సర్కార్ దవాఖానలో నర్సుల కొరత లేకుండా నూతన నియామాకాలు చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభంతో సీజనల్ వ్యాధులైన డెంగ్యూ,మలేరియా వ్యాధిగ్రస్తులకు చికిత్సలు అందించడంలో సిబ్బంది సమస్యలు ఎదుర్కొన్నారు. చాలామందికి సెలవులు రద్దుచేసి సామాన్య ప్రజలకు సేవలందించాలని ఆదేశించారు. అప్పటి నుంచి నర్సులు, ల్యాబ్ నిపుణులను నియమించాలని ఆసుపత్రులను సందర్శించిన అధికారులకు, స్దానిక ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు సూచించారు. నిత్యం ఆసుపత్రులకు రోగుల సంఖ్య పెరిగిపోవడంతో ప్రస్తుతం ఉన్న నర్సుల సేవలందించడం […] The post సర్కార్ దవాఖానలో నర్సుల నియామకాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: మహానగరంలో పేదలకు వైద్యసేవలందించే సర్కార్ దవాఖానలో నర్సుల కొరత లేకుండా నూతన నియామాకాలు చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభంతో సీజనల్ వ్యాధులైన డెంగ్యూ,మలేరియా వ్యాధిగ్రస్తులకు చికిత్సలు అందించడంలో సిబ్బంది సమస్యలు ఎదుర్కొన్నారు. చాలామందికి సెలవులు రద్దుచేసి సామాన్య ప్రజలకు సేవలందించాలని ఆదేశించారు. అప్పటి నుంచి నర్సులు, ల్యాబ్ నిపుణులను నియమించాలని ఆసుపత్రులను సందర్శించిన అధికారులకు, స్దానిక ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు సూచించారు. నిత్యం ఆసుపత్రులకు రోగుల సంఖ్య పెరిగిపోవడంతో ప్రస్తుతం ఉన్న నర్సుల సేవలందించడం కష్టంగా మారింది.

ఉండాల్సి సంఖ్య కంటే తక్కువగా ఉన్నారు. క్యాజువాలిటీ ఐసియూలో వెంటిలేటర్ చికిత్స పొందే ఒక్కొ రోగికి ముగ్గురు అవసరం, కానీ 8 వెంటిలేటర్లకు ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఆపరేషన్ థియేటర్లలో ఐదుమంది రోగులకు ఒకే నర్సు విధులు నిర్వహిస్తుంది. ఉస్మానియా ఆసుపత్రిలో జనరల్ వార్డులో షిష్ట్‌కు 80మందికి ఒకే నర్సు సేవలందిస్తున్నారు. దాదాపు పదేళ్ల నుంచి ఖాళీలు భర్తీ కాగితాలపై సాగుతుంది. దీంతో నర్సులకు పనిభారం పెరగడంతో ఆసుపత్రులు ఉన్నతాధికారులు నర్సుల సంఖ్య పెంచాల్సి ఉండదని రెండు నెలకితం ఆసుపత్రి సందర్శించిన ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను కోరారు. వీటికి సంబంధించిన వివరాలు అందజేయాలని పేర్కొనడంతో వెంటనే ఆసుపత్రులకు కావాల్సిన నర్సుల ఖాళీలు పూర్తి వివరాలు అందజేశారు.

డిసెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి జనవరి చివరి వారంలోగా భర్తీ చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉస్మానియా ఆసుపత్రుల్లో 367మంది విధులు నిర్వహిస్తున్నారు. రోజుకు 1500మంది రోగులకు ఓపి ద్వారా పరీక్షలు చేస్తున్నారు. ఈలెక్కన చూస్తే వెయ్యిమంది నర్సులు అవసరం. ప్రతి షిప్టుకు 350మంది ఉండాలి, కానీ మూడు షిప్టులు కలిపి ఉన్న వారి సంఖ్య 367, ఎంసీఐ నిబంధనల ప్రకారం 832మంది నర్సులు విధులు నిర్వహించాలి. గాంధీ ఆసుపత్రిలో ఇదే రోజుకు 1300మంది రోగులకు ఓపి ద్వారా సేవలందిస్తున్నారు. ఇందులో 358మంది నర్సులుండగా షిప్ట్‌కు 110మంది పనిచేస్తున్నారు. క్యాజువాలిటీలు,ఐసీయూలు, జనరల్ వార్డులు ప్రతి విభాగంలో 6 మంది పనిచోట ఒకరినే నియమిస్తున్నారు.

ఈకొరతకారణంగానే గాంధీలో ఏర్పాటు చేయాల్సిన అత్యవసర మెడికల్ విభాగం ముందుకు సాగడంలేదు. నీలోఫర్ ఆసుప్రతిలో కూడా ఇదే పరిస్దితి కనిపిస్తుంది. చిన్నారుల సంఖ్య రోజురోజుకు పెరగడంతో ప్రస్తుతం నర్సులు సరిపోవడంలేదు. 140మంది నర్సులు మాత్రమే సేవలందిస్తున్నారు. ఎంసీఐ నిబంధనల ప్రకారం ఐసియూలో ఇద్దరు చిన్నారులకు ఒకనర్సు,జనరల్ విభాగంలో ఐదుగురికి ఒక నర్సు ఉండాలి. కోఠి ప్రసూతి ఆసుపత్రిలో 160 పడకలుండగా ఇక్కడ నర్సుల సమస్య వేధిస్తోంది. నిమ్స్‌లో కూడ రోజుకు 600లకుపైగా ఓపి ద్వారా సేవలందిస్తారు.

ఈఆసుపత్రిలో 1500 పడకలుండగా 620మంది నర్సులు మాత్రమే విధుల్లో ఉంటున్నారు. ప్రభుత్వ శాఖలో పనిచేసే ఉద్యోగులు ఎక్కువశాతం జూన్, డిసెంబర్ నెలల్లో పదవి విరమణ పొందుతారు. అదే విధంగా ఆసుపత్రిలో కూడా పలువురు రిటైర్మైంట్ తీసుకున్నారు. వచ్చే నెలల్లో కూడా మరికొంతమంది ఉన్నారు. దానిని దృష్టిలో పెట్టుకుని నూతన భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు ఆసుపత్రుల ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు.

ఆసుపత్రులు పడకలు నర్సులు నియమాకాలు…
గాంధీఆసుపత్రి 1062 352 300
ఉస్మానియా 1169 370 360
నిమ్స్ 1500 350 280
నీలోఫర్ 1010 130 80

Appointment of Nurses in Government Hospital

The post సర్కార్ దవాఖానలో నర్సుల నియామకాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: