‘ఓ డాడీ’…సందడి

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ’అల వైకుంఠపురములో…’. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాలను అందించిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతుందని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఇటీవల విడుదల చేసిన ‘సామజవరగమన…’, ‘రాములో రాముల…’ […] The post ‘ఓ డాడీ’… సందడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ’అల వైకుంఠపురములో…’. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాలను అందించిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతుందని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఇటీవల విడుదల చేసిన ‘సామజవరగమన…’, ‘రాములో రాముల…’ పాటలు చిత్రంపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. ఈ పాటలు ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే.

ఇప్పుడు సంగీత దర్శకుడు తమన్ స్వరపరచిన చిత్రంలోని మరో గీతం ‘ఓ డాడీ…’ శుక్రవారం విడుదలైంది. సాహిత్య విలువలతో కూడిన, ఎన్నో విజయవంతమైన గీతాలను రచించిన గీత రచయిత కృష్ణ చైతన్య ఈ పాట రాశారు. ఈ పాటలో వచ్చే తెలుగు ర్యాప్ కూడా ఆయనే రాయడం విశేషం. తెలుగు ర్యాప్‌ని బిగ్ బాస్ ఫేమ్ రోల్ రైడా పాడగా, ఇంగ్లీష్ ర్యాప్‌ని రాహుల్ నంబియార్ పాడారు. ఫిమేల్ ర్యాప్‌ని లేడీ కాష్ పాడింది. గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను తన స్టయిల్‌లో పాడి ఉర్రూతలూగించారు. బ్లాజీ ఈ పాటకు గాత్ర సాయం చేశారు.

‘ఓ డాడీ’ గీతం విడుదలైన కొద్ది సమయానికే అద్భుతమైన స్పందన వస్తోంది. సోషల్ మీడియాలో మరో ఫేవరేట్ సాంగ్‌గా చార్ట్ బస్టర్స్‌లో టాప్‌లో నిలుస్తోంది. అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్కర్, తనికెళ్ల భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, రోహిణి, రాహుల్ రామకృష్ణ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కెమెరామెన్: పి.ఎస్.వినోద్, ఎడిటర్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: రామ్, లక్ష్మణ్.

O Daddy Song Release from Ala vaikunta puramulo

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘ఓ డాడీ’… సందడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: