29 నుంచి మైండ్ స్పేస్ వరకు మెట్రో పొడగింపు

  హైదరాబాద్:  హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశలో మరో అడుగు ముందుకు పడటంతో ఐటీ ఉద్యోగులకు మరింత ఉరట లభించనుంది. హైటెక్ సిటీ నుంచి మైండ్ స్పేస్ వరకు సేవలు అందుబాటులోకి రానున్నాయి. మంత్రులు కేటిఆర్, పువ్వాడ అజయ్ ఈ నెల 29 దీన్ని ప్రారంభించనున్నారు. దీంతో కారిడార్ ..3లో నాగోల్ నుంచి మైండ్ స్పేస్ జంక్షన్ వరకు సుమారు 28 కిలో మీటర్ల దూరం మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది. ఐటీ కంపెనీలు […] The post 29 నుంచి మైండ్ స్పేస్ వరకు మెట్రో పొడగింపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్:  హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశలో మరో అడుగు ముందుకు పడటంతో ఐటీ ఉద్యోగులకు మరింత ఉరట లభించనుంది. హైటెక్ సిటీ నుంచి మైండ్ స్పేస్ వరకు సేవలు అందుబాటులోకి రానున్నాయి. మంత్రులు కేటిఆర్, పువ్వాడ అజయ్ ఈ నెల 29 దీన్ని ప్రారంభించనున్నారు. దీంతో కారిడార్ ..3లో నాగోల్ నుంచి మైండ్ స్పేస్ జంక్షన్ వరకు సుమారు 28 కిలో మీటర్ల దూరం మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది. ఐటీ కంపెనీలు అధికంగా ఉన్న మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి మెట్రో సేవలు ప్రారంభమైతే వేలాది మంది ఐటీ ఉద్యోగులకు ప్రయాణ సౌకర్యం మెరుగవుతుంది.

ఇప్పటి వరకు హైటెక్ సిటీ , రాయదుర్గం చెరువు మెట్రో స్టేషన్ల వద్ద షటిల్ సర్వీసుల ద్వారా కంపెనీలకు ఉద్యోగులు చేరుకుంటున్నారు. మెట్రో అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో మైండ్ స్పేస్ జంక్షన్ వరకు ఐటీ ఉద్యోగులకు సుదపాయం ఉంటుంది. మరో వైపు మెట్రో కారిడార్ 2 నిర్మాణ పనులన్నీ పూర్తి కావడంతో జేబిఎస్ నుంచి ఎంజిబిఎస్ వరకు ఉన్న 10 కిలో మీటర్లు మార్గాన్ని త్వరలో ప్రారంభిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ మార్గాన్ని విద్యుత్ తనిఖీలు అధికారులు పరిశీలించారు.

Metro Extension to Mind Space

The post 29 నుంచి మైండ్ స్పేస్ వరకు మెట్రో పొడగింపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: