ఉద్ధవ్ ఠాక్రేకే కూటమి సారథ్యం

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరనున్న శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ కూటమికి శివసేన అధ్యక్షుడు, 59 ఏళ్ల ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వం వహిస్తారని ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ శుక్రవారం ప్రకటించారు. కూటమి విధివిధానాలను ఖరారు చేసేందుకు ముంబైలోని నెహ్రూ కేంద్రంలో మొదటిసారి మూడు పార్టీల నాయకులు సమావేశమయ్యారు. చర్చల అనంతరం శరద్ పవార్ మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ అపాయింట్‌ను ఎప్పుడు కోరాలో శనివారం సమావేశమై తేదీని నిర్ణయిస్తామని […] The post ఉద్ధవ్ ఠాక్రేకే కూటమి సారథ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరనున్న శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ కూటమికి శివసేన అధ్యక్షుడు, 59 ఏళ్ల ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వం వహిస్తారని ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ శుక్రవారం ప్రకటించారు. కూటమి విధివిధానాలను ఖరారు చేసేందుకు ముంబైలోని నెహ్రూ కేంద్రంలో మొదటిసారి మూడు పార్టీల నాయకులు సమావేశమయ్యారు. చర్చల అనంతరం శరద్ పవార్ మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ అపాయింట్‌ను ఎప్పుడు కోరాలో శనివారం సమావేశమై తేదీని నిర్ణయిస్తామని చెప్పారు.

ముఖ్యమంత్రి పదవితోపాటు అధికారంలో సగం సగం ఇవ్వాలన్న డిమాండుతో బిజెపి నుంచి వేరుపడిన శివసేనకే ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రి అప్పగించాలని శివసేన సారథ్యంలోని కూటమి నిర్ణయించింది. కాగా, శివసేన-ఎన్‌సిపి-కాంగ్రెస్ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉన్న నేపథ్యంలో దేశ రాజధానిలో జరగనున్న గవర్నర్ల సమావేశానికి హాజరుకావలసిన గవర్నర్ కోష్యారీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. గవర్నర్‌ను కూటమి నాయకులు శనివారం కలిసే అవకాశం ఉంది. గవర్నర్ ఆమోదిస్తే ఆదివారం నాడే శివసేన సారథ్యంలో కొత్త కూటమి కొలువుతీరే అవకాశం ఉంది.

Uddhav to lead new alliance in Maharastra, Sharad Pawar declares that they will meet tomorrow to decide on the date to seek appointment of Governor Bhagat Singh Koshyari

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఉద్ధవ్ ఠాక్రేకే కూటమి సారథ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: