21 ఏళ్లకే న్యాయమూర్తి…

జైపూర్‌: రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన 21 ఏళ్ల మయాంక్‌ ప్రతాప్‌ సింగ్‌ అనే యువకుడు రికార్డు సృష్టించాడు. చిన్న వయసులోనే జడ్జి పదవిని చేపట్టనున్నారు. రాజస్థాన్‌ యూనివర్సిటీ నుండి ఐదేళ్ల ఎల్‌ఎల్‌బి కోర్సును ఈ సంవత్సరం ఏప్రిల్‌లో పూర్తి చేశాడు. మయాంక్‌ జడ్జిల నియామక పరీక్షల్లో మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా మయాంక్‌ మాట్లాడుతూ… మంచి న్యాయమూర్తిగా ఎదగడానికి నిజాయితీ అత్యంత కీలకమన్నారు. న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించబోతున్న క్రమంలో అందుకు ఎలా సన్నద్ధమయ్యావనే ప్రశ్నకు […] The post 21 ఏళ్లకే న్యాయమూర్తి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
జైపూర్‌: రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన 21 ఏళ్ల మయాంక్‌ ప్రతాప్‌ సింగ్‌ అనే యువకుడు రికార్డు సృష్టించాడు. చిన్న వయసులోనే జడ్జి పదవిని చేపట్టనున్నారు. రాజస్థాన్‌ యూనివర్సిటీ నుండి ఐదేళ్ల ఎల్‌ఎల్‌బి కోర్సును ఈ సంవత్సరం ఏప్రిల్‌లో పూర్తి చేశాడు. మయాంక్‌ జడ్జిల నియామక పరీక్షల్లో మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా మయాంక్‌ మాట్లాడుతూ… మంచి న్యాయమూర్తిగా ఎదగడానికి నిజాయితీ అత్యంత కీలకమన్నారు.
న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించబోతున్న క్రమంలో అందుకు ఎలా సన్నద్ధమయ్యావనే ప్రశ్నకు రోజూ 12 నుండి 13 గంటలు ప్రాక్టీస్ చేయాల్సి వచ్చిందన్నారు. జ్యూడీషియల్‌ పరీక్షలు రాయడానికి గతంలో కనీసం 23 ఏళ్ల వయసు ఉండాలనే నిబంధన ఉండేది. ఇటీవల రాజస్థాన్‌ హైకోర్టు సవరించి 21 ఏళ్ల వయసుకు కుదించిన సంగతి తెలిసిందే.
21 Year Old Boy From Jaipur Becomes The Youngest Judge

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 21 ఏళ్లకే న్యాయమూర్తి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: