ప్రశాంత్ బాధ్యత పాక్‌దే

  ప్రశాంత్, వారిలాల్‌లను కాన్సులర్ సందర్శించడానికి అనుమతి ఇవ్వాలి విదేశాంగ శాఖ ప్రకటన న్యూఢిల్లీ : పాకిస్తాన్ అదుపులో ఉన్న ఇద్దరు భారతీయుల వ్యవహారంపై కేంద్ర విదేశాంగశాఖ గురువారం స్పందించింది. ఈ నెల 14న హైదరాబాద్‌కు చెందిన వైందం ప్రశాంత్‌తో పాటు మధ్యప్రదేశ్‌కు చెందిన వారిలాల్‌ను పాక్ నిర్బంధంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఆ ఇద్దరి భారతీయుల బాధ్యత పాకిస్తాన్‌దేనని స్పష్టం చేశారు. వీరికి […] The post ప్రశాంత్ బాధ్యత పాక్‌దే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రశాంత్, వారిలాల్‌లను కాన్సులర్ సందర్శించడానికి అనుమతి ఇవ్వాలి
విదేశాంగ శాఖ ప్రకటన

న్యూఢిల్లీ : పాకిస్తాన్ అదుపులో ఉన్న ఇద్దరు భారతీయుల వ్యవహారంపై కేంద్ర విదేశాంగశాఖ గురువారం స్పందించింది. ఈ నెల 14న హైదరాబాద్‌కు చెందిన వైందం ప్రశాంత్‌తో పాటు మధ్యప్రదేశ్‌కు చెందిన వారిలాల్‌ను పాక్ నిర్బంధంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఆ ఇద్దరి భారతీయుల బాధ్యత పాకిస్తాన్‌దేనని స్పష్టం చేశారు. వీరికి కాన్సులర్ యాక్సెస్ కల్పించాలని కోరినట్లు తెలిపారు.

ఇద్దరికీ ఎటువంటి హాని కలగకుండా సురక్షితంగా స్వదేశానికి పంపించాలని విజ్ఞప్తి చేశారు. 2016-17 సంవత్సరంలో ఇద్దరు భారతీయులు పాక్ చెరలో అడుగు పెట్టారనే సమాచారం అందిందని, అప్పుడే ఈ విషయంపై పాకిస్తాన్ అధికారులకు సమాచారం అందించామన్నారు. వీరి అరెస్ట్‌కు సంబంధించి అకస్మాత్తుగా ఇప్పుడు ప్రకటన రావడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఈ అంశం గురించి పాక్ అధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. పాకిస్తాన్ చేస్తున్న అసత్య ప్రచారానికి వీరు బలికాబోరని, వీరిని తిరిగి రప్పించేందుకు కొంత సమయం పడుతుందని రవీష్ పేర్కొన్నారు.

India seeks repatriation of 2 Indians arrested by Pakistan

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రశాంత్ బాధ్యత పాక్‌దే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: