ఇఎస్‌ఐ శ్కాంలో సూపరింటెండెంట్ వీరన్న అరెస్టు

  మన తెలంగాణ/హైదరాబాద్: ఇఎస్‌ఐ శ్కాంలో ఐఎంఎస్ డైరెక్టరేట్ సూపరింటెండెంట్ వీరన్నను గురువారం ఎసిబి అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడు వీరన్న ఇఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణి తరపున ఫార్మా కంపెనీల నుంచి లంచాల వసూళ్లకు పాల్పడినట్లు ఎసిబి అధికారుల విచారణలో వెల్లడైంది. ఫార్మా కంపెనీల నుంచి వసూలు చేసిన నగదును ఈ కేసులో ప్రధాన నిందితురాలు దేవికారాణి బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి న జ్యూవెలరీ దుకాణాలకు చెల్లింపులు చేసినట్లు ఎసిబి దర్యాప్తులో తేలింది. దీంతో ఈ కేసులోని […] The post ఇఎస్‌ఐ శ్కాంలో సూపరింటెండెంట్ వీరన్న అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మన తెలంగాణ/హైదరాబాద్: ఇఎస్‌ఐ శ్కాంలో ఐఎంఎస్ డైరెక్టరేట్ సూపరింటెండెంట్ వీరన్నను గురువారం ఎసిబి అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడు వీరన్న ఇఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణి తరపున ఫార్మా కంపెనీల నుంచి లంచాల వసూళ్లకు పాల్పడినట్లు ఎసిబి అధికారుల విచారణలో వెల్లడైంది. ఫార్మా కంపెనీల నుంచి వసూలు చేసిన నగదును ఈ కేసులో ప్రధాన నిందితురాలు దేవికారాణి బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి న జ్యూవెలరీ దుకాణాలకు చెల్లింపులు చేసినట్లు ఎసిబి దర్యాప్తులో తేలింది. దీంతో ఈ కేసులోని మరో నిందితుడు వీరన్నపై 120(బి). 420, రెడ్‌విత్ 34 ఐపిసి, రెడ్‌విత్ 13(1)(సి). (డి), 7(ఎ), 13(1)(ఎ), 13(2) 1988 అవినీతి చట్టం కింద ఎసిబి అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు నిందితుడు వీరన్నను ఎసిబి పోలీస కస్టడీకి తీసుకోనున్నట్లు సమాచారం.

ఇఎస్‌ఐలో అకౌంట్స్ విభాగంలో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న వీరన్న డైరెక్టర్ దేవికారాణి బినామీగా వ్యవహరించినట్లు అధికారుల విచారణలో తేలింది. వీరన్న ఫార్మా కంపెలను నుంచి దేవికారాణి తరపున భారీ మొత్తాలు వసూలు చేసి హైదరాబాద్ నగరంలోని పిఎంజె జ్యూవెలరీలో చెల్లింపులు జరిపినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. ఈక్రమంలో 21.22019లో దేవికారాణి ఆదేశాల మేరకు ఇఎస్‌ఐకి మందులు, సర్జికల్ వస్తు సామాగ్రి సరఫరా చేసే రెప్రజెంటిటీవ్స్ నుంచి రూ. 6 లక్షలు వసూలు చేసి పిఎంజె జ్యూవెలరీలో చెల్లింపులు చేశాడు. అలాగే పలు మార్లు దేవికారాణి తరపున రూ. 2 నుంచి రూ. 6 లక్షల వరకు వసూలు చేసి పిఎంజె జ్యూవలరీ, ఇతర షాపింగ్ మాల్స్‌లో నగదు చెల్లింపులు చేసినట్లు విచారణలో వెలుగుచూసింది.

అలాగే తన వ్యక్తి గత అవసరాల కోసం ఫార్మా కంపెలకు చెందిన రెప్రెజెంటిటీవ్స్, ఒరిజిన్, తేజా ఫార్మాల నుంచి రూ. 3, 1500 వసూళ్లు జరిపినట్లుగా దర్యాప్తులో తేలింది. ఈక్రమంలో తేజాఫార్మకు చెందిన పండరి రాజేశ్వర్ రెడ్డి నుంచి నేరుగా తన బ్యాంకు ఖాతాకు రూ. 50 నగదు బదిలా చేయించుకున్న విషయం విచారణలో వెలుగుచూసింది. ఇఎస్‌ఐ శ్కాం వెలుగులోకి రావడంతో విజిలెన్స్ అధికారులు జరిపిన తనిఖీలలో వీరన్న పెన్‌డ్రైవ్‌లో బినామీ కంపెనీల జాబితా లభ్యమైంది. ప్రభుత్వం నుంచి ఇఎస్‌ఐకి బిల్లులు పొందే విషయంలో వీరన్న కీలక పాత్ర పోషించినట్లు విజిలెన్స్, ఎసిబి అధికారులు గుర్తించారు. ఈక్రమంలో ఇఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణి అవినీతికి సహకరించిన వీరన్న రూ. 40 కోట్లు అక్రమంగా ఆర్జించి తన తండ్రి, సోదరుడి పేరిట భూములు కొన్నట్లు ఆరోపణల నేపథ్యంలో ఎసిబి అధికారులు ఆ దిశగా దర్యాప్తు చేపడుతున్నారు.

ఇఎస్‌ఐ స్కామ్ కేసులో డైరెక్టర్ దేవికారాణి మూడేళ్ల కాలంలో దేవికారాణి రూ. 200 కోట్ల మేరకు అక్రమంగా ఆర్జించినట్లు ఎసిబి దర్యాప్తు అధికారులు నివేదికలో సూపరింటెండెంట్ వీరన్న కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టడంతో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదిలావుండగా 2013 వరకు తేజ ఫార్మ వ్యాపారంలో రాణించలేదు. కాగా దేవికారాణి ఇఎస్‌ఐ డైరెక్టర్‌గా విధులు చేపట్టినప్పటి నుంచి తేజఫార్మ పుంజుకుందని ఇందులో వీరన్న పాత్ర ఉన్నట్లు ఎసిబి అధికారులు అనుమానిస్తున్నారు. తేజాఫార్మతో పాటు ఒరిజిన్ కంపెనీ యజమాని శ్రీకాంత్, తేజాఫార్మా అధినేత రాజేష్, మందుల సరఫరా దారుడు శంకర్‌లు ఇఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణి బినామీలుగా ఉన్న సంస్థల నుంచి వీరన్న వసూళ్లకు పాల్పడ్డారన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇఎస్‌ఐ శ్కాంలో ఎసిబి అధికారులు అరెస్ట్ చేసిన సూపరింటెండెంట్ వీరన్నను పోలీసు కస్టడీలో మరిన్ని వివరాలు సేకరించేందుకు ఎసిబి అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలియవచ్చింది. ఇదిలాఉండగా ఇఎస్‌ఐ శ్కాం దర్యాప్తులో భాగంగా మరికొంత మందిని అరెస్ట్ చేయనున్నట్లు విశ్వసనీమ వర్గాల సమాచారం.

ACB arrested by Superintendent Veeranna in ESI scam

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇఎస్‌ఐ శ్కాంలో సూపరింటెండెంట్ వీరన్న అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: