ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై కేసు నమోదు

మనతెలంగాణ/మాదన్నపేట్ : ఓ మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి 14వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సైదాబాద్ పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల ప్రకారం 23 జూలై 2019లో కరీంనగర్ సభలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తన ప్రసంగంలో 15 నిమిషాలు గుర్తు ఉందా…ఆరెస్సెసె నన్ను ఏమి చేయలేదు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో 2012లో నిర్మల్ సభలో 15 నిమిషాల్లో 100 కోట్ల హిందువులను […] The post ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై కేసు నమోదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనతెలంగాణ/మాదన్నపేట్ : ఓ మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి 14వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సైదాబాద్ పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల ప్రకారం 23 జూలై 2019లో కరీంనగర్ సభలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తన ప్రసంగంలో 15 నిమిషాలు గుర్తు ఉందా…ఆరెస్సెసె నన్ను ఏమి చేయలేదు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో 2012లో నిర్మల్ సభలో 15 నిమిషాల్లో 100 కోట్ల హిందువులను అంతం చేస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఈ వ్యాఖ్యలపై కేసు కూడా నమోదైయింది. పోలీసులు ఆరెస్టు చేసి జైల్‌కు కూడా తరలించిన విషయం విధితమే. కానీ అలాంటి వ్యాఖ్యలే మళ్లీ కరీంనగర్ సభలో మాట్లాడటంతో న్యాయవాది కరుణాసాగర్ సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో కోర్టును ఆశ్రయిం చారు. కోర్టు గురువారం కరీంనగర్ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందకుకు అక్బరుద్దీన్‌పై 153(A), 153(B),506 ఆఫ్ ఐపిఎస్ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

Case Filed Against MLA Akbaruddin Owaisi

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై కేసు నమోదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: