తెలంగాణ జలకూడలి మధ్య మానేరు

  మన తెలంగాణ/బోయినిపల్లి : తెలంగాణ రాష్ట్ర జల కూడలిగా మధ్య మానేరు జలాశయం అవతరించిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. గురువారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి మిడ్‌మానేరు రిజర్వాయర్‌ను సందర్శించారు. జలాశయంలోని గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాజెక్ట్‌ను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశీలించారు. బోగం ఒర్రె ప్రాంతంలో చేపట్టిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినోద్‌కుమార్ మాట్లాడుతూ ఏకొత్త […] The post తెలంగాణ జలకూడలి మధ్య మానేరు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మన తెలంగాణ/బోయినిపల్లి : తెలంగాణ రాష్ట్ర జల కూడలిగా మధ్య మానేరు జలాశయం అవతరించిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. గురువారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి మిడ్‌మానేరు రిజర్వాయర్‌ను సందర్శించారు. జలాశయంలోని గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాజెక్ట్‌ను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశీలించారు. బోగం ఒర్రె ప్రాంతంలో చేపట్టిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినోద్‌కుమార్ మాట్లాడుతూ ఏకొత్త ప్రాజెక్ట్ పూర్తి అయిన నీటిని దశలవారీగా నింపి పరీక్షించడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలోనే గత రెండు సంవత్సరాలుగా 6టిఎంసిల నీటిని నింపా మన్నారు. ప్రస్తుత సంవత్సరం ఆగస్టులో ప్రాజెక్టులో 15 టిఎంసిల నీటిని నింపామన్నారు.

ఈ క్రమంలో రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒర్రె ప్రాంతంలో కొంత నీరు బయటకు వచ్చిన విషయం గుర్తించడం జరిగిందన్నారు. దిగువ మానేరు డ్యాం, మధ్య మానేరు జలాశయాలతో ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేయవచ్చునని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మధ్య మానేరు జలాశయం జల కూడలిగా అవతరించిందన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ మిడ్ మానేరు జలాశయం చూస్తే సముద్రాన్ని చూసినంత సంబరంగా ఉందన్నారు. ఈ ప్రాంతంలో తాగు, సాగు నీటి కొరత శాశ్వతంగా పరిష్కారమైందన్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణ, ఎమ్మెల్సీ నారదాసు, నీటి పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈద శంకర్ రెడ్డి, ఇంజనీర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.

Mid Manair Dam work left unfinished in Congress rule

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తెలంగాణ జలకూడలి మధ్య మానేరు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: