నిధుల పర్యవేక్షణకు వినూత్న పద్ధతులు

  కాగ్‌కు ప్రధాని మోడీ పిలుపు న్యూఢిల్లీ : ప్రభుత్వ శాఖలలో నిధులపై పర్యవేక్షణ బాధ్యత ప్రత్యేకించి కాగ్‌పైనే ఉందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. భారతదేశం ప్రతిష్టాత్మకంగా 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారాలనుకొంటోంది. ఈ దిశలో నిధుల దుర్వినియోగం నివారణ కీలకం. నిధుల గణంకాలకు సంబంధించి కీలక అధికార వ్యవస్థగా ఉన్న కాగ్ వారు వినూత్న సృజనాత్మక పద్ధతులు రూపొందించుకోవాలి. నిధులపై ఎప్పటికప్పుడు సరైన పర్యవేక్షణ ఉండేలా చూడాలని పిలుపు నిచ్చారు. ప్రస్తుత […] The post నిధుల పర్యవేక్షణకు వినూత్న పద్ధతులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కాగ్‌కు ప్రధాని మోడీ పిలుపు

న్యూఢిల్లీ : ప్రభుత్వ శాఖలలో నిధులపై పర్యవేక్షణ బాధ్యత ప్రత్యేకించి కాగ్‌పైనే ఉందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. భారతదేశం ప్రతిష్టాత్మకంగా 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారాలనుకొంటోంది. ఈ దిశలో నిధుల దుర్వినియోగం నివారణ కీలకం. నిధుల గణంకాలకు సంబంధించి కీలక అధికార వ్యవస్థగా ఉన్న కాగ్ వారు వినూత్న సృజనాత్మక పద్ధతులు రూపొందించుకోవాలి. నిధులపై ఎప్పటికప్పుడు సరైన పర్యవేక్షణ ఉండేలా చూడాలని పిలుపు నిచ్చారు. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఆడిటింగ్‌ను సరైన హమీ కల్పించేలా చేయడం అనే అంశంపై కంప్ట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ తరఫున జరిగిన సదస్సులో ప్రధాని మాట్లాడారు. సరైన ఆడిటింగ్‌తోనే సమర్థత పెరుగుతుంది.

నిర్ణీత లక్షాల ఛేదన జరుగుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. సుపరిపాలన, సవ్యదిశలో అధికార వ్యవస్థ సాగడం ఆడిటర్‌తోనే సాధ్యం అవుతుందని, లేకపోతే ప్రభుత్వం నుంచి అందే భారీ నిధులు అన్నీ దారిమళ్లుతాయని తేల్చిచెప్పారు. ప్రభుత్వం వచ్చే 2022 నాటికి సాక్షాల ప్రాతిపదికన ఉండే విధాన నిర్ణయాల రూపకల్పన తద్వారా సుపరిపాలనా సాధన దిశలో సాగుతుందని ప్రధాని తెలిపారు. ఈ నేపథ్యంలో కాగ్ గురుతర బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఐదు లక్షల ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్షాన్ని చేరుకునేందుకు సహకరించాలని ఆడిట్ విభాగాన్ని ప్రధాని కోరారు. ప్రభుత్వ విభాగాలలో మోసాలను అరికట్టేందుకు కాగ్ సాంకేతిక ప్రక్రియలను రూపొందించుకోవల్సి ఉందని తెలిపారు.

CAG should be catalyst of good governance, says PM Modi

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నిధుల పర్యవేక్షణకు వినూత్న పద్ధతులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: