మూడు ముళ్ల మహాపీఠం

శివసేనకు ఎన్‌సిపి, కాంగ్రెస్ మద్దతు, ఉమ్మడి కార్యక్రమం ప్రాతిపదికగా ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు న్యూఢిల్లీ : మహారాష్ట్రలో ప్రభుత్వ స్థాపన విషయంలో తమ మధ్య పూర్తి ఏకాభిప్రాయం కుదిరిందని కాంగ్రెస్, ఎన్‌సిపిలు గురువారం తెలిపాయి. అన్ని అంశాలను తాము చర్చించుకున్నట్లు , మంత్రివర్గ నిర్మాణంలో సాధకబాధకాలు, వాటి పరిష్కారాలపై తమ చర్చలు కొలిక్కి వచ్చినట్లు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విలేకరులకు తెలిపారు. అంతకు ముందు కాంగ్రెస్ , ఎన్‌సిపి కీలక నేతల సమావేశం విస్తృత […] The post మూడు ముళ్ల మహాపీఠం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
శివసేనకు ఎన్‌సిపి, కాంగ్రెస్ మద్దతు, ఉమ్మడి కార్యక్రమం ప్రాతిపదికగా ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు

న్యూఢిల్లీ : మహారాష్ట్రలో ప్రభుత్వ స్థాపన విషయంలో తమ మధ్య పూర్తి ఏకాభిప్రాయం కుదిరిందని కాంగ్రెస్, ఎన్‌సిపిలు గురువారం తెలిపాయి. అన్ని అంశాలను తాము చర్చించుకున్నట్లు , మంత్రివర్గ నిర్మాణంలో సాధకబాధకాలు, వాటి పరిష్కారాలపై తమ చర్చలు కొలిక్కి వచ్చినట్లు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విలేకరులకు తెలిపారు. అంతకు ముందు కాంగ్రెస్ , ఎన్‌సిపి కీలక నేతల సమావేశం విస్తృత స్థాయిలో సాగింది. శివసేనతో కలిసి ప్రభుత్వ స్థాపనకు తమ రెండు పార్టీలు సంపూర్ణ స్థాయిలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు, ఇక ముంబైలో శివసేన అధినేతతో చర్చలు ఉంటాయని, దీనితో మంత్రివర్గ ఏర్పాటు పూర్తిగా కొలిక్కి వస్తుందని చవాన్ విలేకరులకు తెలిపారు.

మూడు పార్టీల మధ్య అధికార పంపిణీ, పదవుల విషయాలు గురించి చర్చిస్తామని, దీనికి ప్రాతిపదికగా కనీస ఉమ్మడి కార్యక్రమం (సిఎంపి) ఉంటుందని తెలిపారు. మూడు పార్టీల మధ్య ముంబైలో జరిగే చర్చలతో అనేక విషయాలకు తుది రూపం వస్తుందని, అప్పుడు తమ త్రిపక్ష కూటమి ఏ విధంగా ఉంటుంది? స్వరూపం ఏమిటీ? అధికార పంపిణీ తంతు వంటి వాటిపై తామే స్వయంగా పత్రికల వారికి చెపుతామని వివరించారు.

ఇంకా రెండు రోజులే : సంజయ్ రౌత్

మంత్రివర్గ ఏర్పాటు ఇతర అంశాలపై వచ్చే రెండు రోజుల్లోనే కీలక ప్రకటన ఉంటుందని శివసేన నేత సంజయ్ రౌత్ దేశరాజధానిలో విలేకరులకు తెలిపారు. కాంగ్రెస్, ఎన్‌సిపిల చర్చలు ఇతర విషయాలను విలేకరులు ప్రస్తావించగా ఇక ముందు ఏమి జరుగుతుందనేది అతి త్వరలోనే వెల్లడి కానుందన్నారు.

ఉద్ధవ్ సిఎం, అజిత్ పవార్, థోరట్‌లు డిప్యూటీ సిఎంలు?

శివసేన, కాంగ్రెస్, ఎన్‌సిపిల ప్రభుత్వం ఏర్పాటు అవుతుందనే విశ్లేషణలతో ఇప్పుడు తదుపరి సిఎం శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే అవుతారని గురువారం విశ్లేషణలు వెలువడ్డాయి. ఇక ఎన్‌సిపికి చెందిన అజిత్ పవార్, కాంగ్రెస్ నాయకులు బాలాసాహెబ్ థోరట్‌లు ఉప ముఖ్యమంత్రులు అవుతారని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి చెరి సమాన కాలం ఉంటుందా? అనే విషయం స్పష్టం కాలేదు. అయితే కాంగ్రెస్, శివసేన, ఎన్‌సిపిల త్రిముఖ కూటమని మహా వికాస్ అగాధీగా వ్యవహరిస్తారని పార్టీల వర్గాలు తెలిపాయి. అయితే ఎవరు సిఎం అవుతారు? ఎవరు డిప్యూటీ సిఎంలు? అనేది ఏ పార్టీ నేతలు ఇప్పటికైతే వెల్లడించలేదు.

అయితే ముఖ్యమంత్రులుగా మూడు పార్టీల వారికి రొటేషన్ పద్ధతిలో వీలు కల్పించాలని శరద్ పవార్ తమ ఫార్మూలాను తీసుకువచ్చినట్లు వెల్లడైంది. దీనితో ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్మూలా కూడా దెబ్బతిని మరీ పాతిక అంతకు మించి శాతం అవుతుందని వ్యాఖ్యానాలు వినబడుతున్నాయి. ఒక వేళ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్మూలా కుదిరితే శివసేన తరువాతి అవకాశం కాంగ్రెస్‌కు ఇస్తారా? లేక ఎన్‌సిపికి దక్కుతుందా? అనేది కీలకంగా మారుతుంది. అయితే శివసేనకే పూర్తి కాలం సిఎం పదవి ఇవ్వడం, మిగిలిన రెండు పార్టీల వారికి ఉపముఖ్యమంత్రి పదవులు ఈ కాలంలో కొనసాగించడం గురించి మూడు పార్టీల మధ్య అంగీకారం కుదిరినట్లు భావిస్తున్నారు.

Maharashtra government formation updates

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మూడు ముళ్ల మహాపీఠం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: