యూనిఫాం తీశానా.. బయటకొచ్చిన సింహంలా ఆగను.. ఇక వేటే!

  నందమూరి బాలకృష్ణ హీరోగా కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రూలర్’. ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్ ఆరంభంలోనే “ధర్మ మా ఊరి గ్రామదైవం.. ఎవరికి ఏ కష్టం వచ్చినా తనే ముందుంటాడు”అంటూ బాలయ్య గురించి ఓ భారీ ఇంట్రో ఇస్తారు. ఇక ఈ సీనియర్ స్టార్ తనదైన శైలిలో రౌడీలను చితక్కొడుతూ ఫుల్ యాక్షన్ మూడ్‌లో ఉంటారు. […] The post యూనిఫాం తీశానా.. బయటకొచ్చిన సింహంలా ఆగను.. ఇక వేటే! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నందమూరి బాలకృష్ణ హీరోగా కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రూలర్’. ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్ ఆరంభంలోనే “ధర్మ మా ఊరి గ్రామదైవం.. ఎవరికి ఏ కష్టం వచ్చినా తనే ముందుంటాడు”అంటూ బాలయ్య గురించి ఓ భారీ ఇంట్రో ఇస్తారు. ఇక ఈ సీనియర్ స్టార్ తనదైన శైలిలో రౌడీలను చితక్కొడుతూ ఫుల్ యాక్షన్ మూడ్‌లో ఉంటారు. బాలకృష్ణ సినిమా టీజర్ అంటే ఒక పవర్‌ఫుల్ పంచ్ ఉండాలి కదా. “ఒంటి మీద ఖాకి యూనిఫాం ఉంటేనే బోనులో పెట్టిన సింహంలా ఉంటాను.

యూనిఫాం తీశానా.. బయటకొచ్చిన సింహంలా ఆగను.. ఇక వేటే” అంటూ చిటికెలు వేస్తూ పోలీసు యూనిఫామ్‌లో ఉన్న బాలయ్య గర్జిస్తారు. ఈ టీజర్‌లో బాలయ్య అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఉన్నాయి. ఇంటెన్స్ సీన్స్, ఫైట్స్, రొమాన్స్, కామెడీ… ఇలా అన్ని అంశాలతో తెరకెక్కించిన సినిమాలా ఉంది. ప్రొడక్షన్ రిచ్‌గా కనిపిస్తోంది. ఇక తారాగణం కూడా భారీగానే ఉంది. అటు ప్రకాష్‌రాజ్, భూమిక నుంచి ఇటు ధన్‌రాజ్ వరకు చాలామంది నటీనటులు ఉన్నారు. ఈ టీజర్‌లో సినిమా స్టొరీ, థీమ్ ఏంటి అన్నది చెప్పలేదు. కాబట్టి ట్రైలర్ వస్తే సినిమా ఎలా ఉంటుందో తెలుస్తుంది. బాలయ్యను రెండు గెటప్‌లలో చూపించారు కానీ ఎక్కువ వివరాలను టీజర్‌లో వెల్లడించలేదు.

Balakrishna KS Ravikumar Ruler Teaser Rreleased

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post యూనిఫాం తీశానా.. బయటకొచ్చిన సింహంలా ఆగను.. ఇక వేటే! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: