కూల్ లుక్‌లో చైతూ

  హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న కొత్త సినిమా నుండి హీరో చైతూ లుక్ విడుదలైంది. ఈ పోస్టర్‌లో సూపర్ కూల్ లుక్‌లో నాగచైతన్య ఉల్లాసంగా కనిపిస్తున్నారు. అతని బర్త్‌డే సందర్భంగా ఈ నెల 23న ఉదయం 10.30 గంటలకు హీరో క్యారెక్టర్‌ని పరిచయం చేసే ఓ వీడియోను రిలీజ్ చేయబోతున్నారు ఫిల్మ్‌మేకర్స్. సహజత్వం నింపుకొన్న ఉన్న పాత్రలతో అందమైన కథలను తెర మీదకు తెచ్చే దర్శకుడు శేఖర్ కమ్ముల […] The post కూల్ లుక్‌లో చైతూ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న కొత్త సినిమా నుండి హీరో చైతూ లుక్ విడుదలైంది. ఈ పోస్టర్‌లో సూపర్ కూల్ లుక్‌లో నాగచైతన్య ఉల్లాసంగా కనిపిస్తున్నారు. అతని బర్త్‌డే సందర్భంగా ఈ నెల 23న ఉదయం 10.30 గంటలకు హీరో క్యారెక్టర్‌ని పరిచయం చేసే ఓ వీడియోను రిలీజ్ చేయబోతున్నారు ఫిల్మ్‌మేకర్స్. సహజత్వం నింపుకొన్న ఉన్న పాత్రలతో అందమైన కథలను తెర మీదకు తెచ్చే దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ ప్రేమ కథను మరింత హృద్యంగా మలుచుతున్నారు. ఏమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిబ్యానర్‌పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి.రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : విజయ్ సి. కుమార్, మ్యూజిక్ : పవన్.

Naga Chaitanya new movie poster release on 23

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కూల్ లుక్‌లో చైతూ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: