‘క్రాక్’ షూటింగ్ షురూ

  డాన్‌శీను, బలుపు వంటి రెండు సెన్సేషనల్ హిట్ చిత్రాల తర్వాత రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ‘క్రాక్’. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్‌పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ గురువారం నుండి హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో మొదలైంది. రవితేజ, శృతిహాసన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో […] The post ‘క్రాక్’ షూటింగ్ షురూ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

డాన్‌శీను, బలుపు వంటి రెండు సెన్సేషనల్ హిట్ చిత్రాల తర్వాత రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ‘క్రాక్’. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్‌పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ గురువారం నుండి హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో మొదలైంది. రవితేజ, శృతిహాసన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన నిజ ఘటనల ఆధారంగా చేసుకొని అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. కోలీవుడ్ నటులు వరలక్ష్మి శరత్‌కుమార్, సముద్రఖని ఇందులో పవర్‌ఫుల్ పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి జి.కె.విష్ణు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రానికి డైలాగ్స్‌ః సాయిమాధవ్ బుర్రా, ఎడిటర్‌ః నవీన్ నూలి, ఆర్ట్‌ః ఏ.ఎస్.ప్రకాశ్, ఫైట్స్‌ః రామ్, లక్ష్మణ్, పాటలుః రామజోగయ్యశాస్త్రి.

Ravi Teja Krack movie Shooting begin

The post ‘క్రాక్’ షూటింగ్ షురూ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: