ఉత్పత్తి పెరిగినా…తగ్గని గుడ్డు ధర

  హైదరాబాద్: సాధారణంగా ఏదైనా సరుకైనా ఉత్పత్తి పెరిగితే దాని ధరలు కొంత మేరకు తగ్గుముఖ పట్టడం జరుగుతుంది. కాని రాష్ట్రంలో కోడి గుడ్ల ఉత్పత్తి పెరిగినా వాటి ధరలు మాత్రం పెరిగిపోతున్నాయి. గ్రేటర్ పరిధిలో గుడ్ల వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరను విపరీతంగా పెంచేస్తున్నారు. ఉత్పత్తి దారుల ధరలు ఒకలా ఉంటే అది వినియోగదారుని వద్దకు వచ్చే సరిగాకి రెట్టింపు అవుతోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కోడిగుడ్ల ఉత్పత్తులు […] The post ఉత్పత్తి పెరిగినా… తగ్గని గుడ్డు ధర appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: సాధారణంగా ఏదైనా సరుకైనా ఉత్పత్తి పెరిగితే దాని ధరలు కొంత మేరకు తగ్గుముఖ పట్టడం జరుగుతుంది. కాని రాష్ట్రంలో కోడి గుడ్ల ఉత్పత్తి పెరిగినా వాటి ధరలు మాత్రం పెరిగిపోతున్నాయి. గ్రేటర్ పరిధిలో గుడ్ల వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరను విపరీతంగా పెంచేస్తున్నారు. ఉత్పత్తి దారుల ధరలు ఒకలా ఉంటే అది వినియోగదారుని వద్దకు వచ్చే సరిగాకి రెట్టింపు అవుతోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కోడిగుడ్ల ఉత్పత్తులు బానే ఉన్నాయని నెక్ వర్గాలు చెబుతున్నాయి. శివారు ప్రాంతాల్లో సుమారు 80 వరకు ఉన్న ఫౌల్ట్రీ ఫారాలు, చికెన్‌తో పాటు కోడి గుడ్లపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.

అయితే వేసవిలో చికెన్ వినియోగం కొంత తగ్గినా గుడ్ల వినియోగం మాత్రం రికార్డు స్థాయిలో ఉన్నట్లు పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు.హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం రోజుకు కోటి వరకు గుడ్ల వినియోగం జరుగుతోంది. వేసవి సెలువులు కావడంతో అంగన్ వాడీలు,హస్టళ్ళు మూసి ఉంచడంతో గుడ్ల సరఫరా నిలిచిపోయింది. ఈ పథకాల కోసం రోజుకు 50 లక్షల మేరకు గుడ్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తుండేది. అయితే హస్టళ్ళు, అంగన్ వాడీ కేంద్రాలు మూసి ఉంచడంతో వాటి వినియోగం జరలేదు. గుడ్లను సరఫరా చేసే ఫౌల్ట్రీ వ్యాపారులు బహిరం మార్కెట్‌లకు వాటిని తరలిస్తున్నారు. అయినా కూడా నగరంలో గుడ్ల ధరలు మాత్రం తగ్గడం లేదు.

వాస్తవంగా ఫామ్ ధర గుడ్డుకు రూ.2.50 నుంచి 2.75 పైసలకు మధ్యవర్తులు కోనుగోలు చేస్తున్నారు. తిరిగి వారు హోల్ సేల్ వ్యాపారులకు తిరిగి రూ.2.80 పైసల నుంచి 2.90కు పైసలకు అమ్ముతున్నారు. హోల్‌సేల్ వ్యాపారులు రిటైల్ వ్యాపారులకు ఒక గుడ్డ రూ.3.25 పైసల నుంచి రూ.3.50 పైసల వరకు అమ్ముతున్నారు. ఇక రిటైల్ వ్యాపారులు వినియోగదారులకు ఒక గుడ్డు రూ .5లకు వరకు అమ్ముతున్నారు. అంటే ఫామ్ వద్ద నుంచి వినియోగ దారుడికి చేరుకునే లోపు గుడ్డు ధర రెండింతలు పెరుగుతోంది. అధికారలు అశంపై ప్రత్యేక దృష్టి సారింని వినియోగదారులకు సరసమైన ధరకు గుడ్లు లభించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Loot of egg merchants in the city

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఉత్పత్తి పెరిగినా… తగ్గని గుడ్డు ధర appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: