ఆ ఆటోలో వాష్ బేసిన్, సెల్ చార్జింగ్ పాయింట్లు

ముంబై: తన ఆటోలో ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం ముంబైలోని ఒక ఆటోడ్రైవర్ ఇంట్లో లభించే సౌకర్యాలన్నీ సమకూర్చే ప్రయత్నం చేశాడు. ఎన్నో విశిష్టలతో కూడిన ఈ ఆటో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ భార్య మాజీ సినీ తార ట్వింకిల్ ఖన్నాను కూడా విశేషంగా ఆకట్టుకుంది. వాష్‌బేసిన్, మొబైల్ చార్జింగ్ పాయింట్లు, డెస్క్‌టాప్‌తోపాటు పూల కుండీలు కూడా ఈ ప్రత్యేక ఆటోలో ఉన్నాయి. సత్యవాన్ గీతె అనే ఆటోడ్రైవర్ తన ఆటో రిక్షాపైన ఫస్ట్ హోమ్ సిస్టమ్ […] The post ఆ ఆటోలో వాష్ బేసిన్, సెల్ చార్జింగ్ పాయింట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబై: తన ఆటోలో ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం ముంబైలోని ఒక ఆటోడ్రైవర్ ఇంట్లో లభించే సౌకర్యాలన్నీ సమకూర్చే ప్రయత్నం చేశాడు. ఎన్నో విశిష్టలతో కూడిన ఈ ఆటో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ భార్య మాజీ సినీ తార ట్వింకిల్ ఖన్నాను కూడా విశేషంగా ఆకట్టుకుంది. వాష్‌బేసిన్, మొబైల్ చార్జింగ్ పాయింట్లు, డెస్క్‌టాప్‌తోపాటు పూల కుండీలు కూడా ఈ ప్రత్యేక ఆటోలో ఉన్నాయి. సత్యవాన్ గీతె అనే ఆటోడ్రైవర్ తన ఆటో రిక్షాపైన ఫస్ట్ హోమ్ సిస్టమ్ అని కూడా దీని ప్రత్యేకతను రాసుకున్నాడు. ప్రయాణికులు ఆటోలో ఈ ప్రత్యేక సౌకర్యాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసున్నారు. ట్వింకిల్ ఖన్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోకు కూడా విశేష స్పందన లభిస్తోంది. నా ఆటోలో మీ ఫోన్‌ను చార్జింగ్ చేసుకోవచ్చు. శుద్ధిచేసిన తాగునీరు కూడా లభిస్తుంది. వాష్‌బేసిన్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఒక కిలోమీటర్ వరకు సీనియర్ సిటిజన్లకు ఎటువంటి చార్జ్ ఉండదు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ఈ సమకూర్చాను అని గీతె తెలిపాడు. ట్వింకిల్ ఖన్నా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఆటో ఫోటో గురించి ప్రశ్నించగా ఆ విషయం తనకు తెలియదని గీతె చెప్పారు. తాను ఆమెకు పెద్ద ఫ్యాన్‌నని, అక్షయ్ కుమార్‌ను, ట్వింకిల్ ఖన్నా కలుసుకుంటానని అతను తెలిపాడు.

Mumbais first Home System Auto
Satyavan Geete provides wash basin, desk top, mobile charging points for the benefit of customers

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆ ఆటోలో వాష్ బేసిన్, సెల్ చార్జింగ్ పాయింట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: