రక్షణశాఖ పార్లమెంటరీ మండలికి ఎంపి ప్రజ్ఞా సింగ్ నామినేట్

  న్యూఢిల్లీ: వివాదాస్పద బిజెపి ఎంపి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ రక్షణ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీకి గురువారం నామినేట్ అయ్యారు. మొత్తం 21 మంది సభ్యుల ఈ కమిటీకి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వం వహిస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ప్రజ్ఞా సింగ్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ లీడర్ దిగ్విజయ్ సింగ్ పై గెలుపొందింది. కాగా, మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలుగా ఉన్న ప్రజ్ఞా సింగ్ తరచూ […] The post రక్షణశాఖ పార్లమెంటరీ మండలికి ఎంపి ప్రజ్ఞా సింగ్ నామినేట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: వివాదాస్పద బిజెపి ఎంపి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ రక్షణ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీకి గురువారం నామినేట్ అయ్యారు. మొత్తం 21 మంది సభ్యుల ఈ కమిటీకి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వం వహిస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ప్రజ్ఞా సింగ్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ లీడర్ దిగ్విజయ్ సింగ్ పై గెలుపొందింది. కాగా, మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలుగా ఉన్న ప్రజ్ఞా సింగ్ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది.

మహాత్మ గాంధీని చంపిన నాథూరాం గాడ్సే దేశ భక్తుడని.. అయన దేశభక్తుడిగానే ప్రజలలో నిలిచిపోతారని ప్రజ్ఞా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దీంతో ఈ వ్యాఖ్యలపై బిజెపి మండిపడుతూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంతో.. తను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు తెలిపింది.

Pragya Thakur Nominated to Defence ministry panel

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రక్షణశాఖ పార్లమెంటరీ మండలికి ఎంపి ప్రజ్ఞా సింగ్ నామినేట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: