‘పునాదిరాళ్లు’దర్శకుడికి సినీ ప్రముఖుల ఆర్థిక సాయం

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తొలి సినిమా ‘పునాదిరాళ్లు’. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన గుడపాటి రాజ్ కుమార్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యం చేయించుకునేందుకు డబ్బు లేకపోవడంతో ఆయన తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. గుడపాటి రాజ్ కుమార్ అనారోగ్యం గురించి తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయనకు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఆయనకు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ రూ.50వేల ఆర్థిక సాయం అందించారు. దర్శకుడు మెహర్ రమేష్ కూడా […] The post ‘పునాదిరాళ్లు’ దర్శకుడికి సినీ ప్రముఖుల ఆర్థిక సాయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తొలి సినిమా ‘పునాదిరాళ్లు’. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన గుడపాటి రాజ్ కుమార్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యం చేయించుకునేందుకు డబ్బు లేకపోవడంతో ఆయన తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. గుడపాటి రాజ్ కుమార్ అనారోగ్యం గురించి తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయనకు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఆయనకు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ రూ.50వేల ఆర్థిక సాయం అందించారు. దర్శకుడు మెహర్ రమేష్ కూడా రూ.10 వేలు అందించగా, నటుడు, రచయిత కాశీ విశ్వనాథ్ రూ.5వేలు, ప్రసాద్స్ క్రియోటివ్ ఫిలిం మీడియా స్కూల్ మేనేజింగ్ పార్టనర్ సురేష్ రెడ్డి రూ.41 వేలు, నటుడు కాదంబరి కిరణ్ కుమార్ రూ.25 వేల ఆర్థిక సాయం అందించారు. తనకు ఆర్థిక సాయం అందించిన సినీ ప్రముఖులకు గుడపాటి రాజ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.

Cinema Celebrities Finances Help To Punadhirallu Director

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘పునాదిరాళ్లు’ దర్శకుడికి సినీ ప్రముఖుల ఆర్థిక సాయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: